29.08.2020 శనివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి లీల పత్రికలో ప్రచురింపబడిన లీలను భువనేశ్వర్ నుండి శ్రీమతి మాధవి గారు పంపించారు. ఈ లీలను చదివిన తరువాత బాబా తన భక్తుల క్షేమం గురించి ఎంతగా శ్రమిస్తూ ఉంటారో మనం అర్ధం చేసుకోవచ్చు.
గౌహతీలో తుఫాను
ఇపుడు నేను చెప్పబోయేది 2009 వ.సంవత్సరంలో జరిగిన సంఘటన.
అప్పట్లో
మా వారు అస్సాం, గౌహతిలో పనిచేస్తూ ఉండేవారు.
మేము
మా కుటుంబంతో సహా ఒక పెద్ద బంగళాలో క్రింద గదిలో ఉండేవాళ్ళం.
గౌహతీలో
మూడు సంవత్సరాలు ఉన్న తరువాత మావారికి ఢిల్లీకి బదిలీ అయింది.
మా
స్వంత ఊరు ఢిల్లీ అవటం వల్ల మేమెంతగానో సంతోషించాము.