23.09.2017 శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ
సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
ఈ రోజు మరొక అత్యధ్భుతమైన
సాయి లీలను గురించి, ఆయన వాక్కుకు, ఊదీకి ఎంతటి శక్తి ఉందో తెలియచేసె లీల. ఇది షిర్డీసాయిసేవా ట్రస్ట్.ఆర్గ్ నుండి సంగ్రహింపబడినది.
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట్, హైదరాబాద్
సాయిబాబా వాక్కుకు అనంతమయిన
శక్తి
సాయి సరోవర్ గుజరాతీ
పుస్తకంనుండి ఆగ్లంలోకి అనువదించిన వారు సాయి కి దీవాని, ఆదివారమ్, జూన్ 8, 2008.
సాయిబాబా యొక్క స్వబావాన్ని
పూర్తిగా అర్ధం చేసుకున్నవారెవరూ ఆయన మీద తమకు ఉన్న భక్తిని అంత సులబంగా వదులుకోలేరు. వారి హృదయంలోను, నాలుక మీద ఆయన నామం తరచూ జపించబడుతూనే
ఉంటుంది. ఆవిధంగా చేయడం వల్ల వారికి ఎటువంటి
కష్టాన్నయినా ఎదుర్కోగలిగే శక్తి లభిస్తుంది.
పైన యివ్వబడిన శీర్షికకు సంబంధించి సాయిబాబా వారి వాక్కులోను ఆయన ఉదీలోను ఎంతటి
శక్తి దాగి ఉందో తెలియ చేసే సంఘటనలను గురించి ఇపుడు తెలుసుకుందాము.