31.07.2017 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ
సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
మన సద్గురువయిన శ్రీ
సాయిబాబాకు అత్యంత ప్రియతమ భక్తుడయిన శ్రీ మాధవరావు దేశ్ పాండే (శ్యామా) గురించి పూర్తిగా
తెలుసుకుందాము. మనకు తెలియని ఎన్నో విషయాలు
ఈ వ్యాసం ద్వారా తెలుసుకోవచ్చు. బాబాకు శ్యామా
అంటే ఎందుకంత అభిమానమో ఈ వ్యాసమ్ చదివితె మనకర్ధమవుతుంది. ఈ వ్యాసం రెండవ భాగమ్ శ్రీసాయి లీల ద్వైమాస పత్రిక
జూలై - ఆగస్టు 2006 సంచికలో ప్రచురింపబడింది.. మరాఠీ మూలం
శ్రీమతి ముగ్ధా దివాద్కర్. ఆంగ్లంలోకి అనువాదమ్ శ్రీ సుధీర్
తెలుగు అనువాదమ్: ఆత్రేయపురపు
త్యాగరాజు
మాధవరావు దేశ్ పాండే
గురించి 6 వ.భాగంతో అయిపోయిందనుకున్నాను. దానికి
కారణం మే – జూన్ 2006 వ.సంచికలో ఇంకా ఉంది అని ప్రచురించకపోవడమ్ వల్ల. ఈ రోజు జూలై – ఆగస్టు 2006 వ.సంచిక చూసిన తరువాత
క్రితం సంచికలో ప్రచురించినదానికి కంటిన్యూడ్ అని ఉంది. దానిని ఈ రోజు ప్రచురిస్తున్నాను.
మాధవరావు దేశ్ పాండే (శ్యామా) - 7 వ.భాగమ్
సంత్ జ్ఞానేశ్వర్ ఏమని
చెప్పారంటే “ఎవరయినా రెండవ దీపాన్ని వెలిగించాలంటే మొదటి దీపంతోనే వెలిగించగలరు. దీపాలు వేటికవే వేరువేరు కావచ్చు. కాని రెండింటియొక్క జ్వాలలూ కలిసి ఒకే వెలుగునిస్తాయి.
సముద్రాన్ని గమనించినట్లయితే అలలు వేరు సముద్రం
వేరు అన్నట్లుగా కనిపిస్తుంది. కాని ఆ సముద్రపు
నీటిలోనే అలలు కలిసి వుంటాయి.