27.07.2014 ఆదివారము (విజయవాడనుండి)
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయి సత్ చరిత్ర - తత్వం - అంతరార్ధం - 3వ.భాగం
ఇంతకుముందే నేను శ్రీసాయి సత్ చరిత్ర 32వ.అధ్యాయంలో బాబా చెప్పిన మాటలు మీకు వివరించాను. బాబా తనమతం 'కబీర్ 'అని చెప్పారు. కబీర్ 1398 లో జన్మించాడు. కబీర్ 1518లో మహాసమాధి చెదాడు. అంటే కబీర్ 120 సంవత్సరాలు జీవించాడు. హేమాద్రిపంత్ శ్రీసాయి సత్ చరిత్రలో బాబా 1838సం. లో జన్మించి ఉండవచ్చని వ్రాశారు.
ఇప్పుడు మనం 1838 సం.వెనుకటి కాలానికి వెడదాము. బాబాకు ముందు ముగ్గురు బాలురు నేతపనివారుగా పని చేస్తున్నారు.