(బుల్లి కృష్ణుడికి వెన్నముద్దతో గులాబీ)
Butter Rose
16.08.2014 శనివారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీకృష్ణజన్మాష్టమి శుభాకాంక్షలు
మానవజీవితానికి శ్రీసాయి సందేశాలు - 3వ.భాగం
ఈరోజు సాయి.బా.ని.స. శ్రీరావాడ గోపాలరావుగారు చెపుతున్న ఉపన్యాసం తరువాయి భాగం వినండి.
మూలం: సాయి.బా.ని.స. శ్రీరావాడ గోపాలరావు
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు
'ఆధ్యాత్మిక చింతన అనే నిచ్చెనను కొంతవరకూ ఎక్కిన తరువాత అక్కడే నిలబడి ఉండాలి కాని క్రిందకు జారకూడదు '.
ఈసందేశాన్ని మనం శ్రీసాయి సత్ చరిత్ర 21వ.అధ్యాయంలో చూడగలం. వీ.హెచ్.ఠాకూర్ తో బాబా అన్నమాటలు "ఈదారి అప్పాచెప్పినంత సులభమయినది కాదు. నానేఘాట్ లోయలో ఎనుబోతునెక్కి స్వారీ చేసినంత సులభమూ కాదు. ఈ ఆధ్యాత్మిక మార్గం మిక్కిలి కష్టమయినది. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించాలంటే దానికి ఎంతో కృషి, సాధన,అవసరం. సరియైన పధ్ధతిలోనే ఆచరిస్తే తగిన ఫలితం లభిస్తుంది".