16.07.2020 గురువారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి సుభాశీస్సులు
సాయి లీల ద్వైమాసపత్రిక
మే – జూన్ 2000 సంవత్సరంలో ప్రచురించిన శ్రీ కె. షెనాయ్, పూనా వారి బాబా లీల రెండవ భాగమ్. ఈ రోజు ఆణిముత్యాలు 4 వ.భాగం ప్రచురించి శుక్రవారం నేను ఒంటరివాడను కాను 2వ.భాగాన్ని ప్రచురిద్దామనుకున్నాను. మొదటిభాగం చదివినవారు ఆ తరువాత భాగాన్ని చదవడానికి
ఆసక్తితో ఉన్నారని భావించి, వారిని నిరాశపరచడం భావ్యం కాదని సాయిభక్తుల కోరికపై ఈ రోజు
ప్రచురిస్తున్నాను.
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫోన్. 9440375411 & 8143626744
నిజాంపేట, హైదరాబాద్
ఫోన్. 9440375411 & 8143626744
నేను ఒంటరివాడిని కాను – బాబా నాకు తోడుగా ఉన్నారు – 2 వ.భాగమ్
నేను పూర్తిగా స్పృహలోకి
వచ్చాను. నేనెక్కడ ఉన్నానో నాకే తెలియటల్లేదు. నేనక్కడా లేను, ఇక్కడా లేను. నేనేమీ చెప్పలేని స్థితిలో ఉన్నాను. ఒక నిమిషమయిందో లేక రెండు నిమిషాలయిందో తెలియదు. అర్ధం చేసుకోవడానికి కొంత సమయం పట్టింది. ఒక్కసారిగా గ్రహింపుకొచ్చింది. నేను బాబాతో ఉన్నాను. నేనాయన హృదయంలోనుండి క్రిందకి నడచుకుంటూ తిరిగి
నామంచం మీదకు చేరుకొన్నాను. ఏదీ సరిగా నిర్ణయించుకోలేని
సందిగ్ధావస్థలో ఉన్నాను.