15.07.2020 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయిలీల ద్వైమాసపత్రిక మే – జూన్ 2000 సంవత్సరంలో ప్రచురించిన శ్రీ కె. షెనాయ్, పూనా వారి బాబా లీల ఒకటి అందిస్తున్నాను.
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
విజాంపేట, హైదరాబాద్
ఫోన్. 9440375411 & 8143626744
నేను ఒంటరివాడిని కాను – బాబా నాకు తోడుగా ఉన్నారు
1997 వ.సంవత్సరం నవంబరు నెలలో నేను, నాభార్య ఇద్దరం అమెరికాలో ఉంటున్న మా అమ్మాయి ఇంటికి వెళ్ళాము.
మేము
భారతదేశంనుండి
బయలుదేరేముందు నాకు విపరీతమయిన బ్రాంకైటిస్. అంతేకాదు.
నేను షుగర్ పేషెంట్ ని కూడా.
ఆమెరికాలో
ఉన్నంత కాలం ఏమేమి మందులు వాడాలో అన్నీ డాక్టర్ గారు వ్రాసి ఇచ్చారు.
అనుకున్న ప్రకారం అమెరికా చేరుకొని మా అమ్మాయి ఇంట్లో హాయిగా గడుపుతున్నాము.
మేము
ఎప్పుడూ చేసుకునేటట్లుగానే మేము ప్రేమించే దైవమ్
అయిన సాయినాధుడిని ప్రతిరోజూ పూజించుకుంటూ, ఆయన నామస్మరణతో కాలం గడుపుతున్నాము.
మేము
అమెరికాలో 3 నెలలు ఉందామనుకున్నాము.
అమెరికాకి
వచ్చిన 13వ.రోజున అకస్మాత్తుగా నా ఛాతీ భాగంలో విపరీతమయిన నొప్పి మొదలయింది.
ఆనొప్పిని
భరించలేకుండా, ఊపిరి కూడా తీసుకోలేనంతగా ఉన్నాను.
నేను
ఉన్న చోటనే నేలమీద పడుకుండిపోయాను.
ఆ
సమయంలో మా అమ్మాయి అల్లుడు ఇద్దరూ ఆఫీసుకు వెళ్ళిపోవడంవల్ల ఇంట్లో నేను, నాభార్య, మా అమ్మాయి చిన్నపిల్లలతో ఉన్నాము.
నాకు
ఈస్థితి కలిగినపుడు నేను డ్రాయింగ్ రూములో ఉన్నాను.
నాభార్య
వంటయింటిలో ఉంది.
అతికష్టం
మీద ఆమెని సైగ చేసి పిలిచాను.
నా
పరిస్థితిని
చూసి నాభార్య చాలా భయపడిపోయి మా అమ్మాయికి ఫోన్ చేసింది.
ఆసమయంలో
బయట మంచు కురుస్తు ఉంది.
రోడ్డుమీదనుంచి మా
ఇంటిదాకా 18 అంగుళాల ఎత్తువరకు మంచు పేరుకుని ఉంది.
బయటి
ఉష్ణోగ్రత సున్నా డిగ్రీల కన్నా తక్కువగా ఉంది.
నా
పరిస్థితిని
విన్నవెంటనే
మా అమ్మాయిని ఆమె పనిచేస్తున్న
ఆఫీసులోని సహోద్యోగి కారులో తీసుకుని వచ్చింది.
మంచుతో
నిండి ఉన్న రోడ్డుమీద కారు డ్రైవ్ చేసుకుంటూ 15 నిమిషాలలోనే ఇద్దరూ ఇంటికి చేరుకొన్నారు.
మా అమ్మాయి నా దుస్థితిని చూసి, ఇక క్షణం కూడా ఆలోచనలతో సమయం వృధా చేయకుండా అత్యవసర సేవలవారికి ఫోన్ చేసి నేను పడుతున్న బాధనంతా వివరించి చెప్పింది.
10 నిమిషాలలోనే
వాళ్ళందరూ వైద్యానికి అవసరమయిన వాటన్నిటితో చేరుకొన్నారు. వారిలో ఇద్దరు వైద్యులు కూడా ఉన్నారు.
నన్ను
పరీక్షించి అక్కడికక్కడే E C G తీసారు.
చూసిన
తరువాత స్ట్రోక్ వచ్చిందనీ, వెంటనే గుండెకు ఆపరేషన్ చేసే వసతి ఉన్న ఆస్పత్రికి తీసుకొని వెళ్ళాలని చెప్పారు.
మా
ఇంటికి దగ్గరలో గుండెకు సర్జరీ చేసే ఆస్పత్రులు రెండే ఉన్నాయి.
బయట
విపరీతంగా మంచు కురుస్తూ ఉండటం వల్ల చాలా మట్టుకు రోడ్లన్ని మూసుకుపోయి ఉన్నాయి.
నేను స్పృహలోనే ఉన్నాగాని కదలలేని పరిస్థితిలో ఉన్నాను. “నన్ను ఏ ఆస్పత్రికి తీసుకువెళ్లద్దు. నాకు తొందరలోనే నయమవుతుంది. నాకు భారతదేశంలోనే అవసరమయిన వైద్యం లభిస్తుంది. నేను అక్కడికే వెడతానని’ వేడుకొన్నాను. అత్యవసర సేవా విభాగంవాళ్ళు ఆస్పత్రిలో చేరాల్సిందేనని, అక్కడ ఉండే వైద్యనిపుణులు తరువాత ఏమి చేయాలో వాళ్ళే నిర్ణయిస్తారని చెప్పారు. ఏ ఆస్పత్రికి తీసుకువెళ్ళమంటారని మమ్మల్ని ప్రశ్నించారు. మా అల్లుడు తనకు తెలిసున్న ఆస్పత్రిపేరు చెప్పాడు. అక్కడయితే ఒక భారతీయ వైద్యుడు కుండా ఉన్నాడని అన్నాడు. నన్ను స్ట్రెచర్ మీద పడుకోబెట్టి మంచుతో నిండి ఉన్న రోడ్డుమీదనే ఆస్పత్రికి తీసుకొని వెళ్లారు.
ఒక అరగంటలోనే ఆస్పత్రికి చేరుకొన్నాము. అక్కడికి చేరుకోగానే ఆస్పత్రి సిబ్బంది వెంటనే నన్ను అత్యవసర విభాగానికి తీసుకొనివెళ్లారు. స్ట్రెచర్ మీద నన్ను తీసుకుని వెడుతూ ఉండటం నాకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. నిరంతరం నేను ఆ బాబానే మదిలో నిలుపుకొని ఆయన నామాన్నే జపించుకొంటూ ఉన్నాను. మవునంగానే మనసులో జపించుకుంటూ ఉన్న సమయంలో బహుశ నేను అచేతనావస్థ స్థితిలోకి జారుకొని ఉండవచ్చు. నాకు కాథరైజేషన్ తో సహా అన్ని రకాల పరీక్షలు చేసారని ఒక గంటలోనే నాకర్ధమయింది. చేసిన పరీక్షలలో రక్త నాళాలలో 4 బ్లాకులు ఉన్నాయని తేలింది. వైద్యులు, సర్జన్ లతో సహా అందరూ సమావేశమయ్యారు. ఇక ఆలశ్యం చేయకుండా వెంటనే ఓపెన్ హార్ట్ బైపాస్ సర్జరీ చేయల్సిందేననే నిర్ణయానికి వచ్చారు.
ఆస్పత్రివాళ్ళు వెంటనే అనస్థటిస్ట్ ని రప్పించారు. అతను వచ్చిన రెండు గంటలలోనే సర్జరీ ప్రారంభమయింది. నా శరీరానికి ఏమి జరుగుతూ ఉందో నాకేమీ తెలియదు. ఎక్కడో ప్రశాంతమయిన వాతావరణంలో పచ్చికబయళ్ళమీద, తోటలలోను చాలా ఆనందంగా విహరిస్తూ ఉన్నాను. నేను ఒక్కడినే కాదని, నాతోపాటుగా సాయినాధ్ కూడా ఉన్నారని నాకు తెలుసు. కాలివెనుక భాగంనుండి, తొడలనుండి నరాలను తీసి గుండెకు సంబంధించిన నాళాలకు అతికించి రక్తం గుండెకు సాఫీగా ప్రవహించడానికి చేసిన సర్జరీకి, సర్జన్ ఆయన సహాయకులకి 5 గంటలు పట్టింది. ఆపరేషన్ విజయవంతమయింది. నేను స్పృహలోకి రావడానికి మరొక 6 గంటల సమయం పట్టి ఉండవచ్చు. నా ఆపరేషన్ విజయవంతమయి నేను త్వరగా కోలుకోవాలని నాభార్య సాయినాధుడిని ప్రార్ధించుకుంటూనే ఉంది. ఆమె ప్రార్ధనలు ఫలించాయి. నాకు స్పృహ రాగానే ఆనందంతో నిండిన కన్నీళ్ళతో నాకెదురుగా కనిపించింది.
(చివరి భాగమ్ 17.07.2020 న ప్రచురించేదానిలో నేను వంటరివాడను కాదు, దీనిని మనం ఏవిధంగా భావించాలి అన్నది చదవండి. రేపటి సంచికలో ఆణిముత్యాలు 4వ.భాగమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment