31.10.2015 శనివారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ జీ.ఎస్.కపర్డే గారి డైరీ లోని మరికొన్ని విశేషాలు
రేపు తిరుపతి యాత్రకు వెడుతున్నందు వల్ల, మరికొన్ని విశేషాలను యాత్రనుండి తిరిగి వచ్చిన తరువాత ప్రచురిస్తాను.
శ్రీ జీ.ఎస్.కపర్డే డైరీ - 8
12 డిసెంబరు, 1911, మంగళవారం
కాకడ ఆరతికి వేళ అయిపోతోందనే ఉద్దేశ్యంతో నేను, భీష్మ చాలా తొందరగా నిద్ర లేచాము. కాని ఆరతికి ఇంకా గంట సమయం ఉంది. తరువాత మేఘా వచ్చాడు. అందరం కలిసి ఆరతికి వెళ్ళాము. సాయి మహరాజ్ బయటకు వెళ్ళేంతవరకు నేను ప్రార్ధన చేసుకొంటూ కూర్చున్నాను. ఆయన బయటకు వెళ్ళేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు దర్శనం చేసుకున్నాను. ఆయన బయటకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే సమయంలో గోఖలే పాటలు వింటూ కూర్చున్నాను. ఆయన చాలా బాగా పాడతారు.
ఈ రోజు అల్పాహారం కాస్త ఆలస్యమయింది. ఈ రోజు మేఘాకి మారేడు ఆకులు దొరకకపోవడంతో వాటి కోసం చాలా దూరం వెళ్ళవలసి వచ్చింది. అందుచేత మధ్యాహ్న పూజ 1.30 కి గాని పూర్తవలేదు. సాయి మహరాజ్ మంచి ఉల్లాసంగా ఉన్నారు. నవ్వుతూ కబుర్లు చెబుతూ కూర్చున్నారు.
మేము తిరిగి వచ్చి అల్పాహారం చేయడానికి కూర్చున్నపుడు, స్థానికంగా ఉన్న పాఠశాలలో దర్బారుకు నన్ను రమ్మని ఒకతను వచ్చి చెప్పాడు. నేను భోజనం చేసి బయటకు వచ్చేటప్పటికి పూర్తయిపోయింది.