24.08.2018 గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిభక్తులందరికీ బాబా వారి శుభాశీస్సులు
శ్రావణశుక్రవార శుభాకాంక్షలు
బాబా గారు జీవించి ఉన్న రోజులలో ఆయనను ప్రత్యక్షంగా దర్శించుకుని ఆయన ద్వారా అనుభూతులను పొందినవారు ఎందరో ఉన్నారు. ఆనాటి బాబా అంకిత భక్తులెందరో తమ తమ అనుభవాలను సామాన్య ప్రజానీకానికి అందించారు. తమ అనుభవాలను వెల్లడించనివారు, ప్రచురణకి ఇవ్వనివారు కూడా ఉండి ఉండవచ్చును. ఆ రోజుల్లో చిన్న పిల్లలు కూడా బాబాను ప్రత్యక్షంగా చూసి ఆయనతో ఆటలాడుకున్నవారు కూడా ఉన్నారు. కాని బ్మాబాతో తమ చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నవారు ఎందరు ఉన్నారో మనకు తెలియదు. కాని ఈ రోజు ప్రచురిస్తున్న ఈ వ్యాసం శ్రీ అనంత్ జయదేవ్ చితంబర్ గారు తమ చిన్నతనంలో బాబాను ప్రత్యక్షంగా చూసి ఆ రోజుల్లో జరిగిన సంఘటనలను కూడా పూర్తిగా జ్ఞప్తియందుంచుకొని సాయి భక్తులందరికీ అందించారు. ఆయన మరాఠీలో వ్రాసిన వ్యాసం శ్రీసాయి లీల మాసపత్రిక మార్చ్, 1978 వ.సంవత్సరంలో ప్రచురింపబడింది. దానికి ఆంగ్లానువాదమ్ చేసినవారు శ్రీ పర్ణకిషోర్ గారు.
సాయిలీల.ఆర్గ్ నుండి గ్రహింపబడినది
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
అట్లాంటా , (అమెరికా) ఫోన్ : 1571 594 7354
శ్రీ అనంత్ జయదేవ్ చితంబర్
– అహ్మద్ నగర్
అహ్మద్
నగర్ నివాసి శ్రీ అనంత్ జయదేవ్ చితంబర్ గారు తన చిన్న తనంలోనే బాబాను దర్శించుకున్న
భాగ్యశాలి. ఆయన తండ్రి శ్రీ జయదేవ్ చితంబర్ గారు షిరిడీలోని ప్రాధమిక పాఠశాలకు హెడ్
మాస్టర్ గా 1912 నుంచి 1927 వరకు పనిచేసారు.
ఈ పాఠశాలలోనే శ్రీ మాధవరావు దేశ్ పాండే (శ్యామా) ఉపాధ్యాయునిగా పనిచేసారు. ఆవిధంగా శ్రీ అనంత్ చితంబర్ గారి బాల్యం శ్రీసాయిబాబావారి
సమక్షంలో గడిచింది. శ్రీ అనంతచితంబర్ గారి
తీపి గురుతులను బట్టి చిన్నపిల్లలయందు కూడా శ్రీసాయిబాబాగారి దైవాంశసంభూతమయిన ప్రభావం
ఎంతగా ఉన్నదో మనం గ్రహించుకోగలం. 1975 వ.సంవత్సరం
సాయిలీల మాసపత్రికలో మరాఠీలో ప్రచురింపబడిన ఆయన జ్ఞాపకాల దొంతరలయొక్క అనువాదమ్ ….. ఎడిటర్