25.04.2014 శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు ఒక అద్భుతమైన బాబా లీలను తెలుసుకొందాము. మీకందరకూ గుర్తుండే ఉంటుంది. కొన్నాళ్ళ క్రితం బాబా వారు షిరిడిలో ని ద్వారకామాయిలో కనపడిన విషయం.. దాని చిత్రం కూడా ఇక్కడ జత చేస్తున్నాను. అదేవిధంగా కెనడాలోని సాయిధామం లో కనపడిన వృత్తాంతాన్ని ఇప్పుడు చదవండి.
కెనడాలో బాబా దివ్య దర్శనం
బాబా షిరిడీలో దర్శనమిచ్చిన తరువాత కెనడాలోని సాయిధామం లో దర్శనమిచ్చారు.
మా సాయిధామం పరివారందరమూ కూడా అఖండ రామనవమి ఉత్సవాలను ఉదయం 9 గంటలనుండి రాత్రి 9 గంటలవరకు జరుపుకొంటున్నాము. అదేరోజు మేము వచ్చిన ప్రతివారికి వారం రోజులపాటు ఉదయం అల్పాహారము మధ్యాహ్న్నం భోజనాలు ఏర్పాటు చేశాము. బాబా వారు చెప్పిన ప్రకారం ఎవరూ కూడా ఆకలితో తిరిగి వెళ్ళకూడనే సూత్రాన్ని పాటించి అందరికీ అన్నదానం ఏర్పాట్లు చేశాము.
ఆరోజు కార్యక్రమమంతా కూడా చాలా బాగా జరిగింది. శేజ్ ఆరతి పూర్తవగానే బాబా ముందు ఉన్న రెండు తెరలను వేసేశాము. ఇక మూడవ తెర దించుతుండగా కొంతమంది భక్తులు తెర దించవద్దని చెప్పారు. శుభ్రా ముఖర్జీ అనే భక్తురాలితో బాబా సజీవంగా కనపడుతున్నారని చెప్పారు. మొట్టమొదటగా చూసిన వ్యక్తి నవీన్. మొదటగా అది తన భ్రమేమో అనుకున్నాడు. తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. తనప్రక్కనే ఉన్న ఇద్దరు భక్తులతో వారికి కూడా బాబా కనిపిస్తున్నారా అని అడిగాడు. వాళ్ళు కూడా తమకి బాబా కనిపిస్తున్నారని చెప్పారు. ఆర్గనైజేషన్ కో-ఫౌండర్ అయిన శుభ్రా ముఖర్జీ తో అదే విషయాన్ని చెప్పారు. ఆమె ఇక మూడవ తెరను దించడం ఆపివేసి అక్కడున్నవారందరికి బాబా ని చూసే అదృష్టాన్ని కల్పించారు. ఆరోజు రాత్రంతా భక్తులందరూ వేకువజాము 4 గంటల వరకూ అక్కడే ఉన్నారు. మరుసటి రోజు కూడా బాబా గారు కనిపించారు.
(కెనడా సాయిధామం లో బాబావారి దర్శనం పైన చిత్రంలో చూడవచ్చు)
ఇక్కడ కెనడాలో సాయిధాం లో బాబా వారు సజీవంగా కనిపించారు. ఈ సంఘటనను తోటి భక్తులందరికీ కూడా పంపించి వారందరికి బాబా అనుగ్రహం కల్పించమని కోరుతున్నాము.
జై సాయిరాం
శుభ్రా ముఖర్జీ
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)