Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, December 18, 2015

శ్రీ జీ.ఎస్. ఖపర్డే డైరీ – 13

0 comments Posted by tyagaraju on 7:31 AM

         Image result for images of shirdi sai
             Image result for images of flowers hd
18.12.2015 శుక్రవారం

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు శ్రీ జీ.ఎస్. ఖపర్డే గారి డైరీలోని మరికొన్ని విశేషాలు చదవండి. 

శ్రీ జీ.ఎస్. ఖపర్డే డైరీ – 13
     

25.12.1911 సోమవారం  
ఉదయం ప్రార్ధన తరువాత సాయి మహరాజ్ బయటకు వెళ్ళటం చూశాను.  తరువాత మహాజని, ఇంకా ఇతరులతోను మాట్లాడుతూ కూర్చున్నాను.  అతిధులు చాలా మంది వచ్చారు.  ఇంకా ఇంకా ఎందరో వచ్చారు.  అసలు తీరిక లేకుండా ఉంది.  సాయిమహరాజ్ ను దర్శించుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆహ్వానించి గోవర్ధన దాస్ మధ్యాన్నం భోజనాలు పెట్టాడు. 

Tuesday, December 15, 2015

శ్రీ జీ.ఎస్.ఖపర్డే డైరీ – 12

0 comments Posted by tyagaraju on 7:53 AM
          Image result for images of shirdi sai baba
        Image result for images of rose hd

15. 12. 2015 మంగళవారం 
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి 
సాయి బంధువులకు బాబావారి శుభశీస్సులు 

ఈ రోజు శ్రీ జీ.ఎస్. ఖపర్డే గారి డైరీలోని మరికొన్ని విశేషాలు 

 Image result for images of g s khaparde

శ్రీ జీ.ఎస్.ఖపర్డే డైరీ – 12

23.11.1911 శనివారం
ఈ రోజు కాస్త పెందరాడే లేచాను. కాని మళ్ళీ పడుకుండిపోయాను.  దాంతో చాలా ఆలస్యంగా లేచాను.  క్రిందకు వెళ్ళేటప్పటికి షింగ్లే కి , అతని భార్యకి, దర్వేష్ సాహెబ్ కి వారి ఇళ్ళకు వెళ్ళడానికి అనుమతి లభించిందని తెలిసింది.  అందుచేత షింగ్లే బొంబాయికి, దర్వేష్, కళ్యాణ్ కి వెళ్ళిపోయారు.  దర్వేష్ సాహెబ్ ఆధ్యాత్మికంగా చాలా ముందున్నాడు.  అందువల్లనే సాయి మహరాజ్ అతనికి వీడ్కోలు పలకడానికి గోడకున్న సందు దాకా వచ్చారు.  

Sunday, December 13, 2015

శ్రీ షిరిడీ సాయి వైభవం - సాయి మహిమలు

0 comments Posted by tyagaraju on 6:27 AM
       Image result for images of shirdisaibaba
     Image result for images of beautiful flowers hd
13.12. 2015 ఆదివారం 
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి 
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు 
బాబా గారు జీవించి ఉన్న రోజులలో ఆయన మహిమలను, కనులారా తిలకించిన వారు, అనుభవించినవారు ఎంతో పుణ్యం చేసుకొన్నారు.  ఆయన లీలలను అనుభవించాలంటే  ముఖ్యంగా మనందరికి కావలసినది ఆయనమీద అచంచలమైన భక్తి.  ఆ భక్తితో ప్రార్ధించి పిలిస్తే ఓయని పలకుతారు బాబా. మనసులో ఆర్తితో ప్రార్ధిస్తే చాలు. ఇప్పుడు షిరిడిసాయి వైభవంలోని ఈ రెండు లీలలను చదవండి.   


శ్రీ షిరిడీ సాయి వైభవం -  సాయి మహిమలు

బాబా ఒకసారి, కాకా ఎడమకాలి నొప్పితో బాధ పడుతున్నాడని తెలిసినా, తనతో కూడా నీమ్ గావ్ కి రమ్మన్నారు.  ఆ సమయంలో కాకా విపరీతమయిన నొప్పితో బాధ పడుతున్నాడు.  కుంటుతూ ఒక ఫర్లాంగు కూడా నడవలేని పరిస్థితి.  కాకాకి బాబా మీద పరిపూర్ణమయిన భక్తి కలవాడవటమంచేత బాబా రమ్మన్న వెంటనే బయలుదేరాడు.  తన కోసం బాబా ఏదో ప్రణాళిక వేసుకున్నారని అర్ధమయింది.  
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List