Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, December 18, 2020

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 15 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 8:14 AM

 


18.12.2020  శుక్రవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయిబాబాపరిశోధనా వ్యాస గ్రంధము – 15 .భాగమ్

(రచయితశ్రీ ఆంటోనియో రిగోపౌలస్ఇటలీ)

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

ఫొన్ : 9440375411 & 8143626744

మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

షిరిడీ, శుక్రవారమ్, అక్టోబరు, 18, 1985

నా డైరీలో వ్రాసుకున్న విషయాలు

ప్రశ్న   ---   బాబా సమాధి చెందిన తరువాత ఏమి జరిగింది?

జవాబు   ---   బాబా తన శరీరాన్ని విడిచిన వెంటనే షిరిడీలో ముస్లిమ్స్, హిందూ వర్గాలమధ్య చాలా వాదోపవాదాలు జరిగాయి.  హిందువులు, ముస్లిమ్ లు బాబా శరీరం తమదంటే తమదని, ఆయన వాస్తవంగా తమకు సంబంధించినవారేనని ఎవరికి వారే వాదులాడుకోసాగారు.  బాబా హిందువు అందుచేత ఆయన శరీరం తమకే ఇవ్వాలనిహిందువులు అన్నారు.  బాబా ముస్లిమ్ ఆయన శరీరం మాదిఅని ముస్లిమ్ లు అన్నారు.  ఈవిధంగా వాదనలు జరిగాయి.  అపుడు హరిసీతారామ్ దీక్షిత్ అహ్మద్ నగర్ జిల్లా కలెక్టర్ గారికి తంతి (టెలిగ్రామ్) పంపించారు.  

Wednesday, December 16, 2020

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 14 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 6:31 AM

 


16.12.2020  బుధవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయిబాబాపరిశోధనా వ్యాస గ్రంధము – 14 .భాగమ్

(రచయితశ్రీ ఆంటోనియో రిగోపౌలస్ఇటలీ)

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

ఫొన్ : 9440375411 & 8143626744

మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

షిరిడీ, శుక్రవారమ్, అక్టోబరు, 18, 1985

నా డైరీలో వ్రాసుకున్న విషయాలు

30 సంవత్సరాలకు పైగా తాను ఇక్కడే పనిచేస్తున్నానని శివనేశన్ స్వామి చెప్పారు.  చావడిలోను, సంస్థానం వారికి ఉచితంగా సేవచేస్తున్నానని అన్నారు.  ఆయన తనను తాను ఒక సాధువుగా చెప్పుకొన్నారు.  అంతే కాక ఇక్కడ ఉన్నవారందరూ కూడా ఆయనను ఆవిధంగానే గౌరవిస్తారు.  బషీర్ బాబా ఇక్కడికి వచ్చినపుడు శివనేశన్ స్వామి ఆయనను కలుసుకొన్నారు.  బషీర్ బాబా గురించి ఆయనకు కాస్త మాత్రమే తెలుసు.  సాయిబాబాను దర్శించుకున్న వెంటనే తనకు ప్రత్యేకంగా శక్తులు, సిధ్ధులు లభించాయని బషీర్ బాబా చెప్పుకొన్నారు.  కాని ఆయన తనకు లభించిన శక్తులను, సిధ్ధులను అహంభావంతో తన స్వప్రయోజనాలకోసం అనగా ధన సంపాదనకు, కొంతభూమిని కొనడానికి దుర్వినియోగం చేసి ఉండవచ్చని అన్నారు.  

Monday, December 14, 2020

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 13 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 6:41 AM

 




14.12.2020  సోమవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయిబాబాపరిశోధనా వ్యాస గ్రంధము – 13 .భాగమ్

(రచయితశ్రీ ఆంటోనియో రిగోపౌలస్ఇటలీ)

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

ఫొన్ : 9440375411 & 8143626744

మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

షిరిడీ, శుక్రవారమ్, అక్టోబరు, 18, 1985

నా డైరీలో వ్రాసుకున్న విషయాలు

12.45 P.M.  రోజు నేను స్థానికంగా నివసిస్తున్న ఒక గ్రామస్థుడిని కలుసుకొని మాట్లాడాను.  ఆయనకు 87 సంవత్సరాల వయసు.  సాయిబాబా సమాధి చెందిననాటికి ఆయన వయస్సు 24 సంవత్సరాలు.  ఆయన పేరు బప్పాబాబా.   ఆయనతో నా సంభాషణ ఎంతో ఉపయుక్తంగా జరిగింది.  సాయిబాబా ఆయనకు ఇచ్చిన నాణాన్ని నాకు చూపించారు.  దానిని ఆయన బాబా జ్ఞాపకార్ధంగా వెలకట్టలేని సంపదగా భద్రపరచుకొన్నారు.

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List