16.01.2021
శనివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 27 వ.భాగమ్
(రచయిత… శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
(అనివార్య కారణాలవల్ల వారం రోజులుగా ప్రచురించడానికి సమయం కుదరలేదు)
షిరిడీ- కోపర్ గావ్ – షిరిడీ
శనివారమ్ – అక్టోబరు, 19, 1985
ప్రశ్న --- బాబావారి పుట్టుపూర్వోత్తరాల గురించి, ఆయన చెప్పిన గురువు గురించి మీరేమనుకుంటున్నారు? వీటిపై మీ అభిప్రాయం ఏమిటి?
జవాబు --- బాబా గురువు గురించి రెండు కధలు ఉన్నాయి. ఒకసారి బాబా యాదృచ్చికంగా తన గురువు పేరు వెంకూసా అని తను మహారాష్ట్రలోని సేలూ గ్రామంనుండి వచ్చానని అన్నారు. షిరిడీకి వచ్చిన బాబా వేపచెట్టు క్రిందనే ఎల్లప్పుడూ తపస్సు చేసుకోవడం చూసిన గ్రామస్తులు వేపచెట్టు క్రిందనే కూర్చోవటానికి కారణమేమిటని బాబాను అడిగారు.