Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, December 26, 2020

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 18 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 7:51 AM

 




26.12.2020  శనివారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయిబాబాపరిశోధనా వ్యాస గ్రంధము – 18 .భాగమ్

(పరిశోధనా వ్యాస కర్తశ్రీ ఆంటోనియో రిగోపౌలస్ఇటలీ)

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

ఫొన్ : 9440375411 & 8143626744

మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

షిరిడీ- కోపర్ గావ్షిరిడీ

శనివారమ్అక్టోబరు, 19, 1985

నా డైరీలోని సారాంశాలు

4.20 P.M.   రోజు సుదినం.  ఏదేమైనగాని పరిస్థితులు కాస్త ఒత్తిడి కలిగిచేలా ఉన్నాయి.  అందుచేత నన్ను నేనే జాగ్రత్త వహించుకొంటూ ప్రతివిషయంలోను సరైన నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.  ఇప్పుడే The Pilgrims In హోటల్ లో గదితీసుకున్నాను.  ఇక్కడ చాలా సౌకర్యంగా ఉంది.  రోజుకు రూ.85/- అద్దె.  నాకు ఎక్కువ అనిపించలేదు.  అద్దె విషయంలో నాకు చాలా సంతృప్తిగా అనిపించింది. 

Wednesday, December 23, 2020

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 17 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 7:17 AM

 


23.12.2020  బుధవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయిబాబాపరిశోధనా వ్యాస గ్రంధము – 17 .భాగమ్

(పరిశోధకులుశ్రీ ఆంటోనియో రిగోపౌలస్ఇటలీ)

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

ఫొన్ : 9440375411 & 8143626744

మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

షిరిడీ, శుక్రవారమ్, అక్టోబరు, 18, 1985

నా డైరీలో వ్రాసుకున్న విషయాలు

ప్రశ్న   ---   ఇక్కడికి వచ్చేయాత్రికులు కొద్దిరోజులు ఇక్కడే ఉండేవారా లేక బాబా దర్శనం చేసుకొన్న తరువాత అదే రోజు తిరిగి వెళ్ళిపోతుండేవారా?

జవాబు   ---   కొంతమంది ఇక్కడికి పారాయణ చేసుకోవడానికి వస్తారు.  అపుడు వారు ఇక్కడే ఏడు రోజులు ఉండి బాబాకు సప్తాహం చేస్తారు.  పారాయణ చేయడానికి వచ్చినవారు షిరిడిలోనే వారం, పదిరోజులు ఉండిపోతారు.  ఎక్కువమంది మాత్రం దర్శనం చేసుకొన్న తరువాత వెళ్ళిపోతూ ఉంటారు.  కొంతమంది మూడు రోజులనుంచి అయిదు రోజులు ఇక్కడే బాబాతో ఉంటారు.

ప్రశ్న   ---   షిరిడిలో ప్రత్యేకంగా యజ్ఞాలు ఏమయినా జరుగుతూ ఉంటాయా?

జవాబు   ---   లేదు, యజ్ఞాలు గాని మంత్రాలు గాని ఏమీ జరగవు.  నాలుగు ఆరతులు, భజనలు పాడటం ఇవే జరుగుతాయి. 

నేను (ఆంటోనియో)   ---   అంటే సాయిమీద స్వఛ్చమయిన భక్తి అంతేనా?

జవాబు   ---   అవును, అవును,  ప్రతిరోజు రాత్రి 7 గంటలనుండి గం.9.30 వరకు భజన కార్యక్రమం జరుగుతుంది.

Monday, December 21, 2020

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 16 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 7:52 AM

 


21.12.2020  సోమవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయిబాబాపరిశోధనా వ్యాస గ్రంధము – 16 .భాగమ్

(రచయితశ్రీ ఆంటోనియో రిగోపౌలస్ఇటలీ)

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

ఫొన్ : 9440375411 & 8143626744

మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

షిరిడీ, శుక్రవారమ్, అక్టోబరు, 18, 1985

నా డైరీలో వ్రాసుకున్న విషయాలు

బప్పా బాబా నవ్వుతూ….

బాబా గురించి చెప్పాలంటే చాలా విషయాలున్నాయి.  కాని ఇపుడు సమయం లేదు.  నేను స్నానం చేయాలి.  అందుచేత ప్రస్తుతానికి మన సంభాషణ ఇంతటితో ఆపుదాము.

ముగించేముందు మరొక ముఖ్యమయిన విషయం గుర్తుకు వచ్చింది చెబుతాను.  బాబా ప్రతిరోజు ద్వారకామాయిలో ఉన్నవారందరికీ చాలా ఘనంగా డబ్బు పంచిపెట్టేస్తూ ఉండేవారు.  ఒక రూపాయినుండి రెండువందల వరకు నాణాలను పంచిపెట్టేవారు.  ఈ ధనమంతా ఆయనకి ఆరోజు దక్షిణగా భక్తులు సమర్పించినది.  సాయంత్రమయ్యేసరికి వచ్చిన మొత్తమంతా ఆవిధంగా బీదలకు పంచేసేవారు. రాత్రి అయేసరికి ఆయన జేబులు ఖాళీ అయిపోయేవి.  ఇదే ఆయన పధ్ధతి.

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List