23.12.2020 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస
గ్రంధము – 17 వ.భాగమ్
(పరిశోధకులు… శ్రీ ఆంటోనియో
రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ :
ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ, శుక్రవారమ్, అక్టోబరు, 18, 1985
నా డైరీలో వ్రాసుకున్న విషయాలు
ప్రశ్న --- ఇక్కడికి వచ్చేయాత్రికులు కొద్దిరోజులు ఇక్కడే ఉండేవారా లేక బాబా దర్శనం చేసుకొన్న
తరువాత అదే రోజు తిరిగి వెళ్ళిపోతుండేవారా?
జవాబు --- కొంతమంది ఇక్కడికి పారాయణ చేసుకోవడానికి వస్తారు. అపుడు వారు ఇక్కడే ఏడు రోజులు ఉండి
బాబాకు సప్తాహం చేస్తారు. పారాయణ చేయడానికి వచ్చినవారు షిరిడిలోనే వారం, పదిరోజులు
ఉండిపోతారు. ఎక్కువమంది
మాత్రం దర్శనం చేసుకొన్న తరువాత వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది మూడు రోజులనుంచి అయిదు రోజులు
ఇక్కడే బాబాతో ఉంటారు.
ప్రశ్న --- షిరిడిలో ప్రత్యేకంగా యజ్ఞాలు ఏమయినా జరుగుతూ ఉంటాయా?
జవాబు --- లేదు, యజ్ఞాలు గాని మంత్రాలు గాని ఏమీ జరగవు. నాలుగు ఆరతులు, భజనలు పాడటం ఇవే జరుగుతాయి.
నేను (ఆంటోనియో) --- అంటే సాయిమీద స్వఛ్చమయిన భక్తి అంతేనా?
జవాబు --- అవును, అవును, ప్రతిరోజు రాత్రి 7 గంటలనుండి గం.9.30 వరకు భజన కార్యక్రమం జరుగుతుంది.
ప్రశ్న --- అయితే భజన కీర్తనలు సాయంత్రం మాత్రమే పాడుతూ ఉంటారా?
జవాబు --- అవును. కాని,
పండుగల సమయంలో భజనలు పగటివేళలో జరుగుతాయి. ప్రత్యేకమయిన కొన్ని విధులు,
సంస్కారాలు కూడా ఉంటాయి.
ప్రశ్న --- దగ్గరలోనే సాకోరీలో ఉన్న ఆశ్రమం గురించి మేరేమనుకుంటున్నారు? సతీగోదావరి మాతాజీ మీద మీ అభిప్రాయం
ఏమిటి?
జవాబు --- ఆమె అంటే నాకు మంచి అభిప్రాయమే ఉంది. సాకోరి మంచి ప్రదేశం. ఆశ్రమం కూడా
చాలా బాగుంటుంది. నేను
ఆశ్రమాన్ని చూసాను. అక్కడ
గోదావరి మాతతో కలిసి స్త్రీలు మాత్రమే ఉంటారు. వారంతా కన్యలు. అక్కడ మంచి సేవ జరుగుతూ ఉంటుంది. చాలా ప్రశాంతమయిన ప్రదేశం. ధ్యానం చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఉపాసనీ బాబా సాకోరీలోనే సమాధి చెందారు.
ప్రశ్న --- ఆయనను సాకోరీకి వెళ్ళమని షిరిడీబాబా గారే చెప్పారా?
జవాబు --- అవును. అది బాబాగారు
ఉన్న కాలంలోనే జరిగింది. షిరిడీలో ఉపాసనీ బాబాకు సంబంధించి ఏదో జరిగింది. ఏమిటంటే ఆయనకు గ్రామస్థులకు మధ్య జరిగింది. అపుడు ఉపాసనీ బాబా, సాయిబాబా వద్దకు వెళ్ళి తనకు సహాయం చేయమన్నారు. అపుడు బాబా “ఇపుడు నేనేమి చేయగలను?” అన్నారు. అపుడే బాబా ఆయనను ఇక్కడినుండి మూడుమైళ్ల
దూరంలో ఉన్న సాకోరీకి వెళ్ళమన్నారు.
నేను (ఆంటోనియో) --- ఆయనకు గ్రామస్థులతో సమస్యలు ఉండటం వల్లనే బాబా ఆయనను అక్కడికి పంపించేశారన్నమాట.
జవాబు --- అవునవును అది నిజమే
ప్రశ్న --- ఉపాసనీ బాబాకు షిరిడీ గ్రామస్థులతో సమస్యలు ఎందుకు వచ్చాయో మీకేమయినా తెలుసా?
జవాబు --- అవును, ఆయన సాయిబాబాతో
చాలా సన్నిహితంగా ఉండేవారు. అందువల్ల ఆయనకు సహాయం చేయడానికే సాకోరీకి పంపించేసారు.
ప్రశ్న --- షిరిడీ చాలా ప్రశాంతంగాను, ఎక్కువ శబ్దకాలుష్యం గందరగోళం
లేకుండా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా?
జవాబు --- అవును, నేనలాగే అనుకుంటున్నాను. కాని ఇక్కడికి వచ్చేవారందరికీ మానసిక
ప్రశాంతత లభిస్తోందనే నానమ్మకం. చాలా మంది ఏమంటారంటే, “ఇక్కడికి షిరిడీ వచ్చిన తరువాత
నాకెంతగానో మనశ్శాంతి లభించింది” అని. నాకు కూడా అదే అనుభవం.
ప్రశ్న --- ఇక్కడ షిరిడీలో నివసిస్తున్నవారందరూ బాబా భక్తులేనా?
జవాబు --- అవును. అందులో
అనుమానం ఏమీ లేదు. ముస్లిమ్స్
కూడా బాబా భక్తులే. ఇస్లాం
మతంమీద నమ్ముకమున్న కుటుంబాలు షిరిడీలో ఎన్నో ఉన్నాయి.
ప్రశ్న --- ఇక్కడ ముస్లిమ్ కుటుంబాలు చాలా ఉన్నాయా?
జవాబు --- ఉన్నాయి. ఏభై
కుంటుంబాలకు పైగా ఉన్నాయి. వాస్తవానికి షిరిడిలో వందకు పైగా ముస్లిమ్స్ ఉన్నారు.
ప్రశ్న --- హిందువులు, ముస్లిమ్ లు ఎంత శాతం ఉన్నారో మీరెలా అంచనా
వేయగలరు?
జవాబు --- ఇక్కడ జబాభాలో 20 శాతం ముస్లిమ్స్. వారు కూడా ఇక్కడి మందిరానికి ప్రతిరోజు
వస్తూ ఉంటారు. 20 శాతం
మంది మాత్రమే.
ప్రశ్న --- మీరు ఇక్కడే షిరిడీలోనే ఉండిపోదామనుకొంటున్నారా?
జవాబు --- నామనసు, ఆలోచనలు ఆవిధంగా ఇక్కడే ఉండమని చెబితే అలాగే
ఉంటాను. కాని అంతా బాబా
ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. బాబా, నేను నీవద్దనే నీపాదాల చెంతనే ఉంటానని చెబుతాను. ఇక అంతా ఆయన ఇష్టం.
ప్రశ్న --- మీ కుటుంబం సంగతి?
జవాబు --- నేను వారినందరినీ వదిలేశాను.
నాకింక కుటుంబమే లేదు.
ప్రశ్న --- కాని మీకుటుంబానికి మీరిక్కడ ఉన్నారనే విషయం తెలుసా?
జవాబు --- లేదు. వారికి తెలియదు. నేనెక్కడ ఉన్నానో, ఏమి చేస్తున్నానో వారికేమాత్రం తెలీదు. వారికెప్పుడూ నేను ఉత్తరాలు కూడా
రాయలేదు. నాకిక వారితో
ఎటువంటి బాంధవ్యాలు లేవు. నేను మీకు ఇంతకు ముందే చెప్పినట్లుగా --- నామనసులోను, హృదయంలోను నాతోటివారిని, స్త్రీలను, పిల్లలను అందరిని నా సహచరులుగాను,
తల్లులుగాను, స్నేహితులుగాను భావిస్తాను. ఆవిధంగానే ఉంటుంది, నాదృష్టి.
(రేపు మహల్సాపతి కుమారుడు మార్తాండగారితో జరిగిన
సంభాషణ)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment