17.10.2020 శనివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
దసరా శుభాకాంక్షలు
అజ్ఞానులకు కూడా జ్ఞానాన్ని ప్రసాదించగలరు బాబా
జ్ఞాన శూన్యుని చేత కూడా బాబా గ్రంధాలను రాయించగలరు, అనువాదాలను కూడా చేయించగలరని నిరూపించే ఈ బాబా లీలను ఈ రోజు ప్రచురిస్తున్నాను.
శ్రీ సాయి లీల పత్రికలో ప్రచురింపబడిన మరొక లీలను తెలుగులోకి అనువాదం చేసి భువనేశ్వర్ నుండి శ్రీమతి మాధవి గారు పంపించారు.
నిజం చెప్పాలంటే నేను కవిని కాను, రచయితను అంతకన్నా కాను.
కాని
మూలమరాఠీ గ్రంధమయిన శ్రీ సాయి సత్ చరిత్రను హిందీ భాషలోకి అనువాదం చెయ్యాలన్న ప్రేరణ నాలో ఎలా కలిగిందో తలచుకుంటే నాకే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.
నా చదువు 10వ.తరగతి వరకే సాగింది. నాకు 11 సంవత్సరాల వయసులో మానాన్నగారు కాలం చేసారు. మా పెద్దన్నయ్య, మేము నలుగురం తమ్ముళ్ళం. మా అన్నయ్య మమ్మల్ని తండ్రిలాగా చూసుకున్నాడు. మా అన్నయ్య మాకు మంచి సంస్కారం నేర్పాడు. 1970 వ. సంవత్సరం వరకు మాకు సాయిబాబా గురించి తెలీదు.