12.11.2021 శుక్రవారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ
రోజు మనం ఒక గొప్ప అవధూత గురించి తెలుసుకుందాము.
ఆయన పేరు శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి.
శ్రీ సాయి లీల మాసపత్రిక 1971 వ.సం. సెప్టెంబరు నెలలో ప్రచురితమయింది. ఆయన గురించి చదివిన తరువాత దీనిని ప్రచురిద్దామా
వద్దా అని ఆలోచించాను గాని అనువాదం ప్రారంభించలేదు. బ్లాగులో ప్రచురించడానికి ఏదయిన చెప్పమని ధ్యానంలో అడిగినప్పుడు అవధూత గురించి వ్రాయమన్నట్లుగా సూచించారు. మనలో కొంతమంది పూర్వకాలంలో ఆల్ ఇండియా రేడియోలో భక్తిరంజని
కార్యక్రమంలో సదాశివ బ్రహ్మెంద్ర గారి కీర్తనలు వినే ఉంటారు. ఈ రోజు ఆయన గురించి కొంతవరకు తెలుసుకుందాము.
ఆంగ్ల
మూలమ్ : శ్రీ జి. ఎన్. పురందరె, అడ్వొకేట్
తెలుగు
అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట,
హైదరాబాద్
శ్రీ
సదాశివ బ్రహ్మేంద్రస్వామి
శ్రీ సదాశివ బ్రహ్మేంద్రస్వామి గారుపరిపూర్ణుడయిన అవధూత, బుద్దిశాలి, కవి, భక్తుడు మరియు వేదాంతి. భారత దేశ చరిత్రలో బహుశ ఇటువంటి మహాపురుషుడు మరొకరు ఉండి ఉండకపోవచ్చు. ఆయన తంజావూరు దగ్గరనున్న షజిరాజపురానికి చెందినవారు.