27.11.2022 ఆదివారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
శ్రీ మాత్రే నమః
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
సాయి దయా సాగరమ్ 48 వ, భాగమ్
అధ్యాయమ్
– 47
మరాఠీ
మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి
ఆంగ్లానువాదమ్
--- శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి
తెలుగు
అనువాదమ్ --- ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట,
హైదరాబాద్
9440375411 & 81436267
శ్రీ
సాయి సత్ చరిత్ర 16 వ.అధ్యాయమ్
కాకి
ఎత్తుకువెళ్ళిన బంగారు గొలుసు
ఇది
వాస్తవంగా జరిగిన సంఘటన. సాయిభక్తురాలు ఒకామె
తన బంగారు గొలుసును కిటికీలో ఉంచి ఏదో పనిలో పడింది. ఈ లోపుగా ఒక కాకి వచ్చి కిటికీలో పెట్టిన బంగారు
గొలుసును పట్టుకుని ఎగిరిపోయింది.
ఆమె ఇక ఏడవటం తప్ప ఏమీ చేయలేకపోయింది.
ఆమెకు
దాని ఖరీదే చాలా ఎక్కువ. బాధతో బాబాను ప్రార్ధించసాగింది. మరుసటి వారం ఆమె ఇంటిలో టి.వి. పాడయింది. అందుచేత ఆమె మెకానిక్ ని పిలిపించింది. అతను అంతా పరీక్షించి యాంటెన్నాలో సమస్య ఉందని చెప్పాడు.
ఇద్దరూ
కలిసి డాబా పైన యాంటెన్నాఉన్న చోటకు వెళ్ళారు.
అతను యాంటెన్నా సరిచేస్తుండగా అమె ద్ఫృష్టి ప్రక్కింటివారి డాబా మీద పడింది. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. కాకి ఎత్తుకువెళ్ళిన ఆమె బంగారు గొలుసు ప్రక్కింటివారి
డాబా మీద పడి ఉంది. తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. వెంటనే పక్కింటి డాబాలోకి దుమికి తన గొలుసును తీసుకుంది.
తన
గొలుసు తనకు మరలా వారం తరవాత దొరికినందుకు ఎంతగానో సంతోషించింది. కళ్ళంబట నీరు కారసాగింది. తన గొలుసును తనకు తిరిగి చేరేలా బాబా తన లీలను
చూపినందుకు ధన్యవాదాలు తెలుపుకుంది. బాబాను
మనఃస్ఫూర్తిగా వేడుకుంటే మన సమస్యలన్నిటినీ ఆయన ఏవిధంగా పరిష్కరిస్తారో మనం గ్రహించుకోవచ్చు.
(ఆమెకు తన బంగారు గొలుసు పక్కింటి డాబా మీద ఉన్న విషయం తెలుసుకోలేదు కదా. అందుకే బాబా వారు యాంటెన్నా వల్ల టి.వి. లో సమస్య వచ్చేలా చేసారు. ఆవిధంగా డాబా మీదకు వెళ్ళిన ఆమెకు తన గొలుసును కనిపించేలా చేసారు. ఇది బాబా చేసిన లీల కాదా!)
( వేణుగోపాలస్వామి గుడిలో బాబా ఇచ్చిన ప్రేరణ, త్వరలో )
ఒక
సాయిభక్తురాలు
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment