01.06.2018 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ స్వామీజీ భక్తులతో జరిపిన అనుగ్రహ భాషణమ్ –21 వ.భాగమ్
తెలుగు
అనువాదమ్ : ఆత్రేయపురపు
త్యాగరాజు
అట్లాంటా (యూ ఎస్ ఎ) - ఫోన్ : 1 571 5947354
21.12.1971 : స్వామీజీ ఈ రోజు ‘సమత్వ’ భావం
గురించి ప్రసంగించారు. ‘సమత్వం
యోగ ఉచ్యతె…”
యోగస్థః కురుకర్మాణి
సజ్ఞ్గం త్యక్త్వా ధనంజయ
సిధ్ద్య సిధ్ధ్యోః సమో భూత్వాసమత్వం యోగ ఉచ్యతే అ.2 శ్లో.48
ఓ! అర్జునా !
జయాపజయములందు ఆసక్తిని విడనాడి విద్యుక్త ధర్మమును నిర్వహింపుము. అట్టి
సమభావమే యోగమనబడును.
సమత్వమనగా సమ దృష్టి.
ప్రతీదీ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. వచ్చినదానికి
సంతోషించకుండా, పోయిన దానికి విచారించకుడా సమభావం కలిగి ఉండటమే సమబుధ్ది లేక సమదృష్టి. అవిధంగా సమబావం ఉన్న వ్కక్తికి దేనియందూ యిష్టము గాని అయిష్టము గాని ఉండవు. అటువంటి
వ్యక్తి ప్రపంచంలో జరిగే సంఘటనలన్నిటినీ సమబావంతో వీక్షిస్తూ ఉంటాడు. అతని
మనసులో గాని ఆలోచనలలో గాని ఎటువంటి ఒడిదుడుకులు ఉండవు. వ్రతాలు
చేయడం గాని శృతులను శ్రవణం చేయడానికి
గాని గల ముఖ్యమయిన కారణం,
కోరికలను జయించి చివరికి సమభావాన్ని పెంపొందింపచేసుకోవటానికే.