Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, January 4, 2022

పర్సు పోయింది……???

0 comments Posted by tyagaraju on 4:11 AM



04.01.2022  మంగళవారం

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు మరొక అధ్బుతమయిన బాబా లీల ప్రచురిస్తున్నాను.  సాయివిచార్ నుండి గ్రహింపబడిన ఈ లీలకు తెలుగు అనువాదం

ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

పర్సు పోయింది……???

ఉషగారి అనుభవమ్

2007వ.సంవత్సరం నవంబరు 29వ.తేదీ గురువారమునాడు మైలాపూర్ లో ఉన్న సాయిబాబా మందిరానికి వెళ్ళాను.  ఉదయం గం.10.30 కి మందిరంలోకి అడుగుపెట్టాను.  గం. 10.40 కి అన్నదానానికి డబ్బు కడదామని చూస్తే హాండ్ బాగ్ లో నా పర్సు కనపడలేదు.  అన్ని రోజులలోను బాబా మందిరం బాగా రద్దీగా ఉంటుంది.  ముఖ్యంగా గురువారమునాడు భక్తుల రద్దీ బాగా విపరీతంగా ఉంటుంది.  10.30 కి నేను మందిరంలోకి వచ్చినపుడు హాండ్ బాగ్ లో పర్సు ఉందని నాకు ఖచ్చితంగా తెలుసు.  

Sunday, January 2, 2022

ప్రాణదాత

1 comments Posted by tyagaraju on 3:59 AM

 






02.01.2022 ఆదివారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

 

ఈ రోజు మరొక అధ్భుతమయిన సాయి లీలను అందిస్తున్నాను.  ఈ లీల సాయి విచార్ లో ప్రచురింపబడింది.

తెలుగు అనువాదమ్  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

ప్రాణదాత

బాబా సాక్షాత్తు భగవంతుని అవరారమే అన్నదానికి సాక్ష్యంగా మాకు కలిగిన అనుభవాన్ని మీకు వివరిస్తాను.  రెండు సంవత్సరాల క్రితం మాకుటుంబం కొన్ని ఒడిదుడుకులలో ఉన్న సమయంలో నా భార్యకు తాను గర్భవతిని అయ్యానేమోననే అనుమానం కలిగింది.  అది నిర్ధారించుకోవడానికి రెండు వారాల తరువాత వైద్యురాలి వద్దకు వెళ్ళాము.  

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List