14.02.2016 ఆదివారమ్
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ధన సంపాదన –
సాయిబానిస ఆలోచనలు – 2
ధన సంపాదనపై
సాయిబానిస గారి ఆలోచనల గురించి మరికొన్ని విషయాలు ఈ రోజు తెలుసుకుందాము. వీటి గురించి మీకొక ముఖ్యమయిన విషయం తెలియచేస్తున్నాను. ఇంతకు ముందు మూడు సంవత్సరాల క్రితం ప్రచురించిన
సాయి బానిస గారి డైరేలను మీరు చదివే ఉంటారు.
ఆయన వద్ద ఇంకా కొన్ని డైరీలు ఉన్నాయని వాటిని కూడా బ్లాగులో ప్రచురింపమని నన్ను
అడగటం జరిగింది. ఆవిధంగా ఆగస్టు 2015 వ.సంవత్సరంలో
ఆయన తను వ్రాసుకున్న డైరీలలోని కొన్ని ముఖ్యమయిన విషయాలను, ఆలోచనలను నాకు ఫోన్ లో చెపుతున్నపుడు, వాటిని
నేను వ్రాసుకోవడం జరిగింది. ఆయన అనుమతితో ఇపుడు
వాటిని ప్రచురిస్తున్నాను. ఇంకొక ముఖ్య విషయం
ఏమిటంటే ఈ ప్రచురణకు శ్రీసాయిబాబావారి అనుగ్రహం ఉన్నదన్న విషయాన్ని నేను ప్రగాఢంగా
నమ్ముతున్నాను. ముందు ముందు నేను ప్రచురింపబోయే
సాయిబానిస ఆలోచనలలో 17.02.2010 తేదీన ఆయనకు వచ్చిన ఆలోచనను మీరు చదవబోతున్నారు. ఆ ఆలోచన ఆయన నాకు మొబైల్ ద్వారా చెప్పడానికి ఒక
గంట ముందుగానె యధాతధంగా అదే ఆలోచన నా మనసులోకి రావడం జరిగింది. సాయిబానిసగారు మొబైల్
లో తన ఆలోచనలను డిక్టేట్ చేస్తుండగా, గంట క్రితం నా మదిలోకి వచ్చిన ఆలోచననే ఆయన చెబుతున్నపుడు
ఆశ్చర్యపోవడం మా ఇద్దరి వంతు అయింది.
దీనిని బట్టి
సాయిబాబా వారు ఎవరి చేత ఎప్పుడే పని చేయించుకోవాలో ముందుగానే నిర్ణయిస్తారనే విషయం
ఆ సంఘటన ద్వారా నాకు అర్ధమయింది.
బాబా వారి చమత్కారాన్ని
పాఠకులు గ్రహించుకోవచ్చు… ధన సంపాదనపై సాయిబానిస గారి ఆలోచనలపై మీ అభిప్రాయాలను తెలపండి.
ఓమ్ శ్రీసాయిరామ్