Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, September 26, 2022

శ్రీ సాయి దయా సాగరమ్ 26 వ, భాగమ్

0 comments Posted by tyagaraju on 7:46 AM

 



26.09..2022  సోమవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

శ్రీ మాత్రే నమః


సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయి దయా సాగరమ్ 26 వ, భాగమ్

అధ్యాయమ్ – 24

మరాఠీ మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి

ఆంగ్లానువాదమ్ ---  శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి

తెలుగు అనువాదమ్ ---  ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్

9440375411  & 8143626744

మన ఊహకందని అధ్బుతాలు….

గురువారమ్, 21, జనవరి, 2021, సమయమ్ గం. 3.55

ఉన్నత విద్యావంతులు, మంచి సంస్కారవంతుల కుటుంబంలో నేను జన్మించాను.  మా కుటుంబంలోనివారందరూ అన్ని విషయాలు ప్రత్యక్షంగా చూస్తే తప్ప నమ్మేవారు కాదు.  కాని భగవంతుని మీద మంచి నమ్మకం ఉన్నవాళ్ళు.  మా తాతగారు ప్రతిరోజు పూజలు చేసేవారు కాదు.  కాని ఆయన సాయిబాబా ఫోటోకి నమస్కరించడం నాకు గుర్తే.  సాయిని ప్రార్ధించుకున్నపుడెల్లా మాకు ఎంతో నమ్మకం, మానసిక ప్రశాంతత కలుగుతూ ఉండేది.  ప్రతి గురువారం మా నాన్నగారు బాబాకు మిఠాయి, పూలమాల తెస్తూ ఉండేవారు.  

Sunday, September 25, 2022

శ్రీ సాయి దయా సాగరమ్ 25 వ, భాగమ్

0 comments Posted by tyagaraju on 4:20 AM

 




25.09..2022  ఆదివారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

శ్రీ మాత్రే నమః

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయి దయా సాగరమ్ 25 వ, భాగమ్

అధ్యాయమ్ – 23

మరాఠీ మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి

ఆంగ్లానువాదమ్ ---  శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి

తెలుగు అనువాదమ్ ---  ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్

9440375411  & 8143626744

శ్రీ సాయి కృప

పార్లే (తూర్పు) లో ఉన్న తిలక్ మందిర్ రోడ్డులో సాయిమందిరం ఉంది.  ఈ సాయి మందిరానికి బోర్కర్ కుటుంబం వారు ట్రస్టీగా ఉన్నారు.  1975 నుంచి నేను ఈ సాయిమందిరానికి వెడుతూ ఉండేవాడిని.  నేనే కాకుండా మా పార్లేకర్ కుటుంబమంతా ఈ సాయిమందిరాన్ని మా స్వంత మందిరంగా భావించుకుంటూ ఉండేవాళ్ళం.  బాబా తన భక్తులను ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉంటూ ఉంటారు.  నేను ఒకమ్మాయిని వివాహం చేసుకుందామనుకున్నాను.  కాని ఆ అమ్మాయిది వేరు కులం వల్ల కులాంతర వివాహమని మా నాన్నగారు ఒప్పుకోలేదు.  మా నాన్నగారు  ఈ వివాహానికి అనుకూలంగా ఉండేలాగా సహాయం చేయమని బాబాను ప్రార్ధించుకోసాగాను.  బాబా అనుగ్రహం వల్ల మా వివాహం జరిగింది.

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List