శ్రీ
షిరిడీ సాయితో ముఖాముఖి
సాయిబానిస
శ్రీ రావాడ గోపాలరావు
21.07.2019 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి –
14 వ.భాగమ్
సాయిబానిస
గారి ద్వారా సాయి భక్తులకు బాబా వారు అందిస్తున్న
అమూల్యమయిన
సాయి సందేశాలు
సంకలనమ్ : ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
చదివిన
తరువాత మీ అభిప్రాయాలను తెలపండి.
మైల్
ఐ.డి.
tyagaraju.a@gmail.com
ఫోన్స్ & వాట్స్
ఆప్ :
9440375411 & 8143626744
బాబా తన అసలు పేరు ఏమని చెప్పారో వచ్చే ఆదివారం ప్రచురింపబోయే 15 వ.భాగంలో చదవండి.
(బాబా నీ అసలు పేరేమిటో చెప్పవా?)
శ్రీ షిరిడీ సాయితొ ముఖాముఖీపై పాఠకుల అభిప్రాయాలు...
1. అజ్ఞాత భక్తురాలు కాలిఫోర్నియా నుండి ఇలా వ్రాస్తున్నారు...
సాయిబానిస అంకుల్, సాయిరామ్
శ్రీ షిరిడీ సాయితో ముఖాముఖీ లో బాబా వారు చెప్పిన విషయాలను చదివే భాగ్యం కలిగినందుకు నేనెంతో అదృష్టవంతురాలినని భావిస్తున్నాను. బాబా వారు సాయిబానిసగారి ద్వారా అందిస్తున్న అమూల్యమయిన విషయాలు సాయి భక్తులందరూ ఆధ్యాత్మికంగా మరింతగా అభివృధ్దిపధంలో పయనించడానికి ఎంతగానో తోడ్పడతాయి.
2. మరొక అజ్ఞాత సాయిబంధువు ఇలా వ్రాస్తున్నారు...
బాబా బోధనలు ఇంత చక్కగా మాకు తెలుపుతున్న మీకు కోటి కోటి నమస్కారములు... ఓమ్ సాయిరామ్
3. శ్రీమతి శారద, నెదర్లాండ్స్ నుండి...
చాలా సార్లు ఒళ్ళు జలదరించింది చదువుతోంటే... ధన్యవాదాలు
3. శ్రీమతి శారద, నెదర్లాండ్స్ నుండి...
చాలా సార్లు ఒళ్ళు జలదరించింది చదువుతోంటే... ధన్యవాదాలు
4. చెన్నై నుండి శ్రీమతి కృష్ణవేణి గారు 13వ.భాగమ్ చదివిన తరువాత ఆమెకు వచ్చిన సందేహాలు...(వాట్స్ ఆప్ ద్వారా)
భాటే గారు శ్రీహరి రూపంలో వచ్చి ఉంటారు, అంతే కదా సర్,
కాని సాయిబానిస గారి కలలో బస్ లో ప్రయాణిం చేటప్పుడు అలా పరిగెట్టడం లో అర్ధమేమిటి? ఆ దొంగలు ఎవరయి ఉంటారు?
(వాట్స్ ఆప్ ద్వారా ఆమె సందేహాలకు సమాధానం ఇవ్వడం జరిగింది)
భాటే గారు శ్రీహరి రూపంలో వచ్చి ఉంటారు, అంతే కదా సర్,
కాని సాయిబానిస గారి కలలో బస్ లో ప్రయాణిం చేటప్పుడు అలా పరిగెట్టడం లో అర్ధమేమిటి? ఆ దొంగలు ఎవరయి ఉంటారు?
(వాట్స్ ఆప్ ద్వారా ఆమె సందేహాలకు సమాధానం ఇవ్వడం జరిగింది)
(ఇక ఈవారం భాగం చదవండి)
03.07.2019 - భాగోజీ షిండే – కుష్టురోగ భక్తుడు
ఇతడు మధ్య తరగతి కుటుంబములో జన్మించి, యవ్వనములో గొప్పవారితో స్నేహముచేసి, అనేక దుర్వ్యసనాలకు అలవాటుపడి, కుష్టురోగవాతము పడ్డాడు. ఇతనికికుష్టురోగమని తెలిసి ఇతని స్నేహితులు ఇతనినుండి, దూరముగా వెళ్ళిపోయారు. ఇతనితో కాపురము చేయలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. బంధువులు ఇతనిని తమఇళ్ళకు రానిచ్చేవారు కాదు.