14.03.2013 గురువారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బందువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబంధువులకు ఒక గమనిక: ద్వారకామాయి గీత్ మాలా లింక్ ఇస్తున్నాను. దానిలో మరపురాని మధురమైన పాటలను తనివితీరా విని ఆనందించండి.
http://www.facebook.com/dwarakamai?ref=hl
శ్రీవిష్ణుసహస్రనామం 47వ. శ్లోకం, తాత్పర్యం
శ్లోకం: అనిర్విణ్ణస్స్ఠావిష్టో భూర్ధర్మయూపో మహామఖః |
నక్షత్రనేమి ర్నక్షత్రీక్షమః క్షామస్నమీహనః ||
తాత్పర్యం: భగవంతుని విస్మయము చెందని వానిగను, స్థిరమైనవారిలో శ్రేష్టునిగను, మొక్కలు మున్నగునవి మొలిపించువానిగను, జీవులను పుట్తించువానిగను, ఈ సృష్టియను యజ్ఞమునకు ఆధారమగు ధర్మమను స్థంభమునకు జీవులను కట్టి యుంచువానిగను, సృష్టియందలి అన్ని యజ్ఞములకు ఆధారమైన మహా యజ్ఞముగను, రాశిచక్రము, నక్షత్ర విభజన మున్నగు వానికి అధిపతిగను, సహనము, సామర్ధ్యము మున్నగు అంశములు తానే అయిన వానిగను, కరువు, ఆకలి, అనువాని రూపమున జీవులకు క్రమశిక్షణనిచ్చువానిగను, జీవుల కోరికలయొక్క వరుస తానే అయిన వానిగను ధ్యానము చేయుము.
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి -
12వ.అధ్యాయం
ప్రియమైన చక్రపాణి,
పండ్రెండవ అధ్యాయములో హేమాద్రిపంతు శ్రీసాయి భక్తుల అనుభవాలను వివరముగా వ్రాసినారు. నాకు జరిగిన ఒక చిన్న అనుభవాన్ని నీకు వ్రాసేముందుగా, శ్రీ సాయి సత్ చరిత్రలో హేమాద్రిపంతు శ్రీసాయి భక్తులు గురించి వివరించుతూ యిలాగ అన్నారు.