14.03.2013 గురువారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బందువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబంధువులకు ఒక గమనిక: ద్వారకామాయి గీత్ మాలా లింక్ ఇస్తున్నాను. దానిలో మరపురాని మధురమైన పాటలను తనివితీరా విని ఆనందించండి.
http://www.facebook.com/dwarakamai?ref=hl
శ్రీవిష్ణుసహస్రనామం 47వ. శ్లోకం, తాత్పర్యం
శ్లోకం: అనిర్విణ్ణస్స్ఠావిష్టో భూర్ధర్మయూపో మహామఖః |
నక్షత్రనేమి ర్నక్షత్రీక్షమః క్షామస్నమీహనః ||
తాత్పర్యం: భగవంతుని విస్మయము చెందని వానిగను, స్థిరమైనవారిలో శ్రేష్టునిగను, మొక్కలు మున్నగునవి మొలిపించువానిగను, జీవులను పుట్తించువానిగను, ఈ సృష్టియను యజ్ఞమునకు ఆధారమగు ధర్మమను స్థంభమునకు జీవులను కట్టి యుంచువానిగను, సృష్టియందలి అన్ని యజ్ఞములకు ఆధారమైన మహా యజ్ఞముగను, రాశిచక్రము, నక్షత్ర విభజన మున్నగు వానికి అధిపతిగను, సహనము, సామర్ధ్యము మున్నగు అంశములు తానే అయిన వానిగను, కరువు, ఆకలి, అనువాని రూపమున జీవులకు క్రమశిక్షణనిచ్చువానిగను, జీవుల కోరికలయొక్క వరుస తానే అయిన వానిగను ధ్యానము చేయుము.
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి -
12వ.అధ్యాయం
ప్రియమైన చక్రపాణి,
పండ్రెండవ అధ్యాయములో హేమాద్రిపంతు శ్రీసాయి భక్తుల అనుభవాలను వివరముగా వ్రాసినారు. నాకు జరిగిన ఒక చిన్న అనుభవాన్ని నీకు వ్రాసేముందుగా, శ్రీ సాయి సత్ చరిత్రలో హేమాద్రిపంతు శ్రీసాయి భక్తులు గురించి వివరించుతూ యిలాగ అన్నారు.
"వారి వంతు రానిదే వారు బాబాను స్మరించువారు కారు" ఇది అక్షర సత్యము. నావిషయము ఆలోచించు. బహుశ నీకు వెనకటి ఉత్తరములో వ్రాసి యుంటాను. అదే 1964 లో ఒకనాటి రాత్రి శ్రీసత్యసాయి నాకలలో దర్శనము ఇచ్చి ఇచ్చిన సందేశము. ఆసందేశము ప్రకారము శ్రీశిరిడీసాయిని తలచే భాగ్యము 1989 సంవత్సరములో వచ్చినది. ఈఅధ్యాయములో శ్రీహేమాద్రిపంతు మూలే శాస్త్గ్రి అను భక్తుని వివరాలు చక్కగా వివరించినారు. . శ్రీసాయి ములేశాస్త్రికి నాలుగు అరటిపళ్ళు ఇచ్చి ఆశీర్వదించినారు. 1991 సంవత్సరము లో శ్రీసాయి ములేశాస్త్రిని నాయింటికి పంపి నన్ను ఆశీర్వదించినారు. యిది కొంచము ఆశ్చర్యముగా యుంది కదూ. 1991 సంవత్సరములో (తేదీ, నెల గుర్తు లేదు) ఒకరోజున ఆఫీసులో నాస్నేహితుడు శ్రీములేతో మాట్లాడినాను. అతను మరాఠీ బ్రాహ్మణుడు. నాకు మంచి స్నేహితుడు. ఆరోజు ఆఫీసునుండి యింటికి వచ్చి విశ్ర్రాంతి తీసుకొంటు యుంటే పోస్టుమాన్ వచ్చి శ్రీసాయిబాబా పక్ష పత్రిక అందచేసినాడు. ఆపత్రిక వెనుక అట్టపై శ్రీములేశాస్త్రికి శ్రీసాయి నాలుగు అరటిపళ్ళు యిచ్చి ఆశీర్వదించిన ఘట్టము ఉంది. నేను చాలా ఆసక్తిగా చదువుతున్నాను. నేను యింకా ఆపుస్తకము చదువుతు ఉండగా, ఉదయము నాతో మాట్లాడిన నాస్నేహితుడు శ్రీములే నాయింటికి వచ్చి నాతో టీ త్రాగినాడు.
ఈసంఘటన ద్వారా శ్రీసాయి తెలియ చేసినది ఏమిటి అనేది ఆలోచించు. ఆరోజులలో ములేశాస్త్రి అహంకారముతో శ్రీసాయిని గుర్తించలేదు. కాని శ్రీసాయి అటువంటి అహంకారిని కూడా ఆశీర్వదించి ప్రేమతో నాలుగు అరటి పళ్ళు యిచ్చినారు. నేను ములేశాస్త్రి గురించిన వివరాలు సాయిబాబా పక్షపత్రికలో చదువుతు ఉండగా, మా ఆఫీసులో పని చేస్తున్న శ్రీములేను సాయి మన యింటికి పంపి ఆశ్చర్యపరచటములో అర్ధము, అహంకారము ఉంటే దానిని తొలగించుకోవలసినది అని హెచ్చరించటము అని గుర్తు పెట్ట్లుకోవాలి.
శ్రీములేశాస్త్రి మరియు ఒక డాక్టర్ యొక్క చరిత్ర చదివిన తర్వాత మనము తెలుసుకోవలసిన విషయము ఏమిటి? అనే దానికి నాకు తోచిన సమాధానము నీకు వ్రాస్తాను. నీవు నీగురువునందు, నీయిష్ఠ దైవమునందు స్థిరమైన నమ్మకము ఉంచవలెను. ఒకసారి మనము మన గురువుపై నమ్మకము పెంచుకొంటే అది ఏనాటికి తరగిపోదు. ఆయనే నీయిష్ఠ దైవము రూపములో నీకు దర్శనము యిస్తు నిన్ను ఆధ్యాత్మిక రంగములో ముందుకు నడిపించుతు నీ అభివృధ్ధికి పాటుపడతారు.
శ్రీసాయి సేవలో
నీతండ్రి.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment