07.11.2020 శనివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్యామ్ రావ్ జయకర్ – బాబా అనుభవాలు
ఈ రోజు మరొక అధ్బుతమయిన బాబా లీలను ప్రచురిస్తున్నాను.
శ్రీ
సాయి లీల ద్వైమాసపత్రిక సెప్టెంబర్ – అక్టోబర్, 2014 వ.సంవత్సరంలో ప్రచురింపబడింది.
శ్రీసాయిబాబా
వారి తైల వర్ణచిత్రాన్ని చిత్రించిన శ్రీ శ్యామరావ్ జయకర్ గారు బాబాతో తనకు కలిగిన అనుభవాన్ని స్వయంగా బాబా సాహెబ్ గారికి, శ్రీ ఆర్. ఎ. తర్ఖడ్ గారికి వివరించారు.
ఆయన
స్వయంగా చెప్పిన ఈ అనుభవాన్ని చదివి మనం కూడా ఆనందిద్దాము.
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపెట, హైదరాబాద్
ఫోన్. 9440375411 & 8143626744
ఈ రోజు సాయంకాలం నేను (ఈ వ్యాసరచయిత) నా స్నేహితునితో కలిసి పని ఉండి శ్రీ శ్యామ రావ్ రామచంద్ర వినాయక్ జయకర్ గారి ఇంటికి వెళ్లాను.
ఆయన
పార్లేలో శ్రీ తిలక్ మందిర్ రోడ్ లో నివాసం ఉంటున్నారు.
సాయిమాత బాలగోపాలురతో (చిన్నపిల్లలతో) ఆటలాడుతూ ఉండేవారు.
ఆ
బాలగోపాలురలో
శ్రీ శ్యామ్ రావ్ జయకర్ ఎంతో ప్రేమ అంకితభావం ఉన్నవాడు.
ఆయన మంచి పేరుపొందిన చిత్రకారుడు.
ద్వారకామాయిలో శ్రీసాయిబాబా
వారి తైలవర్ణ
చిత్రం (ఆయిల్ పెయింటింగ్) వేసినది ఆయనే.
అదేవిధంగా
ఆర్.బి.మోరేశ్వర్ ప్రధాన్ గారి ఇంటిలో ఉన్న పూజాగదిలో కూడా శ్యామ్ రావ్ జయకర్ గారే చిత్రించిన (ఆయిల్ పెయింట్ వేసిన) బాబా చిత్రపటం ఉంది.