Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, May 4, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1996 (02)

0 comments Posted by tyagaraju on 7:18 PM


05.05.2012  శనివారము

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
నెట్ కన్నెక్షన్ సమస్య వల్ల పరచుర్ణకు అంతరయాం కలుగుతోంది.
ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ -  1996  2వ. భావాన్ని చదువుకుందాము
 
సాయి.బా.ని.. డైరీ -  1996  (02)

30.05.1996

శ్రీ సాయి రాత్రి కలలో ఒక అజ్ఞత వ్యక్తిగా దర్శనము యిచ్చి మాట్లాడిన మాట్లు.

1) నీ భవిష్యత్ జీవితములో నీకు స్వదేశము, విదేశములలో సాయి బంధువులతో పరిచయాలు ఏర్పడుతాయి.  ఆపరిచయాలను పరిమితముగానే యుంచుకొని జీవించు.

2) నేడు దేశములోని రాజకీయాలలో నీతి నిజాయతి లేవు.  నీవు రాజకీయాలకు దూరంగా జీవించు.

3) నీ పిల్లలు నీకు సేవ చేయలేదు అని భావించకు, వారిని సుఖ సంతోషాలతో జీవించని.


01.06.1996

నిన్న రాత్రి శ్రీసాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి - ప్రశాంతముగ జీవించు అని ఆశీర్వదించి సలహాలను యిచ్చినారు.

1) విందులకు వినోదాలకు దూరంగా జీవించు.

2) ఎదుటివానిని పాముకంటితో చూడవద్దు.

3) కోరికలు అనే ఎలుగుబంటి మీద స్వారి చేస్తే ఊరిలోని కుక్కలు ఎలుగుబంటిని తరిమి కొట్టి నీజీవితాన్ని తలక్రిందు చేస్తాయి.

4) నీ ఆఫీసు జీవితము పరవళ్ళు తొక్కుతున్న నదిలాగ యున్నది.  ఆనది గుండా నీ జీపును నేను జాగ్రత్తగా నడుపుతాను, నిన్ను తిరిగి రోడ్డు మీదకు తెస్తాను.

5) నీ అనారోగ్యము విషయములో డాక్టర్స్ యింకా కొన్ని పరీక్షలు చేయాలి.  అంత వరకు ఓరిమితో ఉండు.

6) దైనందిక జీవితములో నీ భార్యతో గొడవలు పడవద్దు.

03.06.1996

రాత్రి కలలో శ్రీసాయి ఒక ఫకీరు రూపములో దర్శనము యిచ్చి అన్న మాటలు.

1) నీవు గొప్పవారితో స్నేహము చేసిన తప్పులేదు.  కాని వారినుండి ఏమీ ఆశించకు.

2) జీవిత పోరాటములో మహాభారతములోని అభిమన్య కుమారుడిని ఆదర్శముగా తీసుకొని పోరాటము సాగించు, అపుడు నీకు మరణము అంటే భయము ఉండదు.

3) పిల్లలను పెంచి పెద్ద చేసినావు. మరి వారిని వారి జీవితములో ప్రశాంతముగా జీవించని.  వారు నీనుండి దూరముగా యున్న బాధ పడకు.

4) నీ ఆరోగ్యము కోసము, ప్రశాంత జీవితము కోసము నీవు నానుండి నాలుగు అరటిపళ్ళు స్వీకరించినావు.  మరి నాకు రూ.6/- దక్షిణగా సమర్పించుకో (అరిషడ్వర్గాలు వదలించుకో)

5. నీవు త్వరలో "సబ్ కా మాలిక్ ఏక్ దే" అనే ఉద్యమము ప్రారంభించుతావు.  నేను నీవెనుకనే ఉంటాను.

11.06.1996

శ్రీసాయి రాత్రికలలో డాక్ట్ ర్ రూపములో దర్శనము యిచ్చి అన్న మాటలు.

1) 17.05.1996 అమావాస్యనాడు నీకు తిరిగి పునర్ జన్మ లభించినది.  ఆనాటినుండి నీజీవిత ఆఖరి రైలు ప్రయాణము ప్రారంభము.  నీకు తోడుగాసాయి బంధువులు ఉన్నారు.  ఎవరి స్టేషన్ రాగానె వారు దిగిపోవాలి.
 
2)  డాక్టర్ నీగుండెకు ఆపరేషన్ చేసారు.  లోపలి పుండు యింకా మానలేదు.  బరువులు ఎత్తవద్దు.  మందులు జాగ్రత్తగా వాడుతూ ఆరోగ్యము కాపాడుకో.
 
15.06.1996

శ్రీసాయి రాత్రి కలలో సన్యాసి రూపములో దర్శనము యిచ్చి అన్న మాటలు.

1) సంసార జీవితము సాయి సేవకు ఆటంకము కాదు.  మహల్సాపతి సంసారము చేస్తు శ్రీసాయి సేవను చేసినాడే.  నీవు కూడ సంసారము సాగించుతు నా సేవ చేసుకో.

2)  శ్రీసాయి సేవలో నీదగ్గరకు వచ్చే సాయి భక్తుల కొబ్బరి కాయలు కుళ్ళిఫొయి ఉంటాయి.   అటువంటివారితో వ్యవహారాలులో జాగ్రత్తగా యుండు.  

3) శ్రీ సాయి సేవలో ధన వ్యామోహము విడనాడు.  లేకపోతే పోలీసులు ఆధనాన్ని అవహరించి నిన్ను నానాబాధలు పెడతారు.  జాగ్రత్త.

 (యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు

Thursday, May 3, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1996 (01)

0 comments Posted by tyagaraju on 8:36 AM


03.05.2012  గురువారము

ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజునుంచి సాయి.బా.ని.స. డైరీ -  1996 చదువుకుందాము. 

సాయి.బా.ని..  డైరీ -  1996   (01)

27.05.1996  సీ.డీ.ఆర్.  హాస్పిటల్

నా గుండెకు ఆపరేషన్ విజయవంతముగా జరిపించినందులకు బాబాకు కృతజ్ఞత తెలియచేసుకొని - బాబా నన్ను త్వరగా యింటికి పంపమని వేడుకొని నిద్రపోయినాను.

శ్రీసాయి ఫకీరు రూపములో కలలో దర్శనము యిచ్చి నెమలి కన్నుల ఈకల కట్టతో నాశరీరముపై మూడు సార్లు శుభ్రము చేసినారు.  నాలో కొత్త శక్తి వచ్చినది.  లేచి వారి పాదాలకు నమస్కరించినాను.  వారు చిరునవ్వుతో నన్ను ఆశీర్వదించి అదృశ్యమైనారు. 

యింకొక దృశ్యములో శ్రీసాయి చిన్న పిల్లల ఆసుపత్రి వద్ద నిలబడి అక్కడ ఓతల్లి తన పిల్లవాడు పూర్తి ఆరోగ్యము పొందిన తర్వాత డాక్టరుగార్కి కృతజ్ఞత తెలియచేసి తన పిల్లవానిని యింటికి తీసుకొని వెళ్ళినది.  శ్రీ సాయి ఆతల్లిని, పిల్లవానిని ఆశీర్వదించినారు ఈ రెండు దృశ్యములు చూసిన తర్వాత నేను కూడా పూర్తి ఆరోగ్యముతో యింటికి వెళ్ళుతాను అని నమ్మకము కుదిరినది.

29.05.1996

యింటి.నుంబరు. 1-7-204, కమలాననగర్
నిన్నటిరోజున శ్రీ సాయి దయతో ఆసుపత్రినుండి యింటికి క్షేమముగా చేరుకొన్నాను.  నూతనజీవితానికి సలహాలు సూచనలు ప్రసాదించమని శ్రీ సాయిని వేడుకొన్నాను.  శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో యిచ్చిన సలహాలు.

1) యికమీదట, విందులు, వినోదాలు. షికార్లు మానివేయి.

2) నీగత జీవిత స్నేహితులు నిన్ను మానసికముగా బాధ పెడతారు, ఓరిమితో భరించక తప్పదు.

3) నీజీవిత యాత్ర పాసింజరు రైలుబండి ప్రయాణములాగ యుంటుంది.  అటువంటి యాత్ర అలవాటుకు సిధ్ధపడు.

4) నీ నూతన జీవిత యాత్రలో ఎవరినీ మోసగించవద్దు.  నీవు మోసగించపడవద్దు.  జాగ్రత్త. 

5) ఆఫీసు జీవితములో ఎవరితోను గొడవలు పడవద్దు.

6) ధనవ్యామోహము, పరస్త్రీ మీద వ్యామోహమును విడనాడు.

7) భార్యా వియోగము సంభవించిన నీవు తిరిగి వివాహము చేసుకోవద్దు.

8) ఆధ్యత్మిక రంగములో నీవు ఒంటరి ప్రయాణము చేయాలి.  అందుచేత యితరుల యింట సత్ చరిత్ర పారాయణ చేయవద్దు

 (యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు

Sunday, April 29, 2012

శరణాగతి - బాబా పాదాల వద్ద

0 comments Posted by tyagaraju on 8:22 PM




శరణాగతి - బాబా పాదాల వద్ద


30.04.2012
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బందువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు మరొక బాబా లీలను తెలుసుకుందాము.  ఈ అనుభవం జర్మనీలోని స్వాతి గారిది.  బాబామీద మనకున్న నమ్మకమే మనలనందరినీ ముందుకు నడిపిస్తుంది.  ఆ నమ్మకం మనకి గొప్ప ధైర్యాన్నిస్తుంది.బా ఏరూపంలో వచ్చినా ముందర మనం గుర్తించలేము.  తరువాత అనుకుంటాము, అయ్యో వచ్చినది బాబాయేనేమో అని. ముందర మన మనసుని మాయ కప్పివేస్తుంది.  అందుచేత నిరంతరం మన మనసులో బాబా నామస్మరణే చేస్తూ ఉంటే మనకంతా సాయిమయంగానే కనపడుతుంది. 



ఈరోజు జర్మనీనుంచి స్వాతిగారి బాబా అనుభవాన్ని తెలుసుకుందాము.  

ఇది నాకు ఈమధ్యనే జరిగిన అనుభవం. నేను ప్రతీ గురువారమునాడు బాబా గుడికి వెడుతూ ఉంటాను.  ఒకసారి గుడికి వెళ్ళేముందు నా స్నేహితురాలు నాకు ఫోన్ చేసి తనకు కూడా బాబా ప్రసాదం తీసుకురమ్మని చెప్పింది.  నాకు కనక ప్రసాదం ఇస్తే నీకు కూడా తెస్తానని చెప్పాను. నేనిక్కడ జర్మనీలో ఉంటున్నాను.  ఇక్కడ గుడిలోని పూజారిగారు బాబాకు తను తయారుచేసిన ప్రసాదం, స్వీట్లు, పళ్ళు, యింకా భక్తులు తెచ్చి సమర్పించేవి అన్ని నైవేద్యంగా పెడుతూ ఉంటారు.   ఆరతి అయినతరువాత భక్తులందరూ ప్రసాదం అక్కడే తినేస్తారు, అందుచేత ఎవరూ కూడా ప్రసాదం ఇంటికి పట్టుకుని వెళ్ళే సమస్యే లేదు.  నేను గుడికి వెళ్ళినతరువాత నా స్నేహితురాలు చెప్పిన విషయాన్ని పూర్తిగా మర్చిపోయాను.   భజన కార్యక్రమంలో పూర్తిగా లీనమయిపోయాను.  



ఆరతికి ముందు పూజారిగారు బాబాకి ప్రసాదాన్ని నైవేద్యం పెట్టారు.  ఒక తల్లి తన బిడ్డకు ఎలాగయితే ఆహారాన్ని తినిపిస్తుందో, అంతే భక్తితోను, ప్రేమతోను ఆయన బాబాకి ప్రసాదం పెట్టారు.  ఆయన బాబా విగ్రహానికి భుజాల చుట్టూ చిన్న తువాలును కట్టి, బాబా నోటివద్ద ప్రసాదన్ని పెట్టారు. మీరు  బాబాకి ప్రత్యేకంగా తయారుచేసినదానిని అలా సమర్పించినపుడు ఒక విధమైన ఆధ్యాత్మిక భావం కలుగుతుంది.  నిజంగా బాబా ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారనే భావం మనలో కలుగుతుంది.  నేను బాబాకి బొప్పాయి పండును తీసుకువచ్చాను.  దానిని పూజారిగారు బాబా పాదపద్మాల వద్ద ఉంచారు.  ప్రసాదాన్ని నైవేద్యంగా పెడుతున్నపుడు గుడిలో హనుమాన్ చాలీసా పెట్టారు, అందరూ కూడా దానితో పాటే గొంతులు కలిపి  పాడటం మొదలుపెట్టారు.  నివేదన చేస్తున్నపుడు పూజారిగారు ఎవరికీ కూడా ప్రసాదాన్ని ఇవ్వడం నేనెప్పుడూ చూడలేదు. అందుచేత నేను కళ్ళు మూసుకుని హనుమాన్ చాలీసా పాడటంలో నిమగ్నమైపోయి అందులోని ఆనందాన్ని అనుభవిస్తున్నాను.  ఈలోగా పూజారిగారు ఒక ఆపిల్ పండును బాబాకి నైవేద్యంగా పెట్టినప్పుడు, బాబా ఆ పండుని  కొంచెం కొరికి తిని తరువాత  నాకు ఇవ్వకూడదా అనే ఆలోచన నామనసులో కలిగింది.   తరువాత నాకు నేనే ఎంత తెలివితక్కువదానిని అని అనుకున్నాను.  అది సాధ్యం కాదనుకుని మరలా హనుమాన్ చాలీసాని  ఏకాగ్రతతో పాడటం ప్రారంభించాను.   

హటాత్తుగా నా ప్రక్కన కూర్చున్నామె నా కాలిమీద తట్టి, పూజారిగారు ఇచ్చే ప్రసాదం తీసుకోమని చెప్పింది.  పూజారిగారు ఆపిల్ పండును బాబాకు నైవేద్యంగా పెట్టిన తరువాత నాకు ఇస్తున్నారని నాకు తెలీలేదు. నాకు నా భర్తకి కళ్ళంబట నీళ్ళు వచ్చాయి.  బాబాగారు మమ్మల్ని అనుగ్రహించారు. 

మేము యింటికి వచ్చేటప్పటికి రాత్రి చాలా పొద్దుపోయింది, అందుకని ఆపిల్ ని మర్నాడు ఉదయం తిందామనుకున్నాము.  ఆపిల్ ని కోస్తున్నపుడు నా స్నేహితురాలు ప్రసాదం అడిగిన విషయం గుర్తుకు వచ్చింది.  ఆ ఆపిల్ మనకే కాదు ఆమెకి కూడా అని నా భర్త అన్నారు.  బాబా ప్రసాదం గురించి నా స్నేహితురాలి కోరిక నిజమైన కోరిక.  అందుకనే బాబాగారు మాద్వారా ప్రసాదాన్ని ఆమెకు పంపించారు. ఆపిల్ పండులో కొంత ఆమెకి ఇచ్చి మొత్తం జరిగినదంతా వివరించాను. బాబా తనను అలా అనుగ్రహించినందుకు నా స్నేహితురాలు చాలా సంతోషించింది.  తాను సర్వాంతర్యామినని బాబ సత్ చరిత్రలో చెప్పారు.  ఆయన చెప్పిన మాట అక్షారాల సత్యమనిపించింది నాకు. ఆయన సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి. ఆయనకన్నీ తెలుసు, ఆయన మనకోరికలను తీరుస్తారు.  మనం చేయవలసినదల్లా ఆయన పాదాలముందు శరణాగతి చేయడమే. తరువాత మనకేది చేయాలో ఆయనే చూసుకుంటారు. నాకిప్పుడు జీవితంలో పెద్ద కష్ఠం ఎదురయింది.  చిన్నవాడయిన మా అబ్బాయికి వంట్లో బాగుండలేదు.  కాని బాబా నాతోనే ఉన్నారన్న విషయం నాకు తెలుసు. అంతా ఆయనే చూసుకుంటారు. బాబా నాతోనే ఉన్నపుడు నేను దేని గురించీ ఆందోళనపడనవసరం లేదు. ఆయనే నాతండ్రి. మాయోగక్షేమాలు ఆయనే చూసుకుంటారు.  ఓం సాయిరాం.   

ఈరోజు నాకింకొక అనుభవం జరిగింది. మా అబ్బాయికి ఒంట్లో నలతగా ఉండటంవల్ల తల్లిగా నాకు చాలా దిగులుగా ఉంది.  అది సహజం.  చెడు ఆలోచనలను పారద్రోలడం కోసం ప్రతిరోజు చేసే పూజల తరువాత, యూ ట్యూబ్ లో సాయి సచ్చరిత్రను పెట్టాను. ఆ చరిత్ర శ్రవణం నాకు ధైర్యాన్నిస్తుంది. పొద్దున్న అంతా కూడా బాబాని గురించే ఆలోచిస్తూ కూర్చున్నాను.  మధ్యాహ్న్నం మాయింటి తలుపునెవరో కొట్టారు. మా అబ్బాయి తలుపుతీయడానికి వెంటనే పరిగుత్తుకుని వెళ్ళాడు.  ముందర వచ్చినదెవరో కనుక్కోమని చెప్పాను.  ఎవరదీ అని అడిగాడు మా అబ్బాయి.  వచ్చినతను ఒక జర్మన్ సేల్స్ మన్. మీ అమ్మగారు ఉన్నారా అని అడిగాడు మా అబ్బాయిని.  నేను మా అబ్బాయి వెనకాలే నుంచున్నాను.  నేను ఏదో మాట్లాడేలోపే, అతను ఇలా అన్నాడు, "బాబా ఉన్నారు".  నాకు పాపా ఉన్నారా అన్నట్లుగా వినపడింది.  అతను పాపా అన్నాడేమో అనుకున్నాను. నేను దాని గురించి పట్టించుకోలేదు.  అతనింకా నన్ను ఏదో అడిగాడుగానీ, నేను ఏదీ తీసుకోలేదు. అప్పుడతను మరేమీ ఫరవాలేదులెండి, నో ప్రోబ్లెం , ఓం సాయిరాం అన్నాడు. అతను ఓం సాయిరాం అనగానే నేను కొంచెం షాక్ కి గురయ్యాను. నేను కూడా అతనికి ఓం సాయిరాం అని సమాధానం చెప్పాను, అతను ముందుకు వెళ్ళిపోయాడు.  నేనింకా ఆ షాక్ లో ఉండే తలుపు వేశేశాను.  అప్పుడు ప్రవేశ ద్వారానికి ఎదురుగా గోడమీద బాబా పటాన్ని చూశాను.  బహుశా అతను బాబా ఫోటోని చూసి ఉండవచ్చు.  అందుచేతనే అతను బాబా ఉన్నారు అని అన్నాడు. కానీ నాకు మరొకలా వినపడింది.  నేను అర్ధం చేసుకోలేకపోయాను. నేను, మా అబ్బాయి యింట్లో ఒంటరిగా ఉండటంతో, ఆ వచ్చినతనికి బాబా ఎలా తెలుసాని అడగనందుకు నేను చాలా బాధపడ్డాను.  అతని ద్వారా బాబా తను ఉన్నానని చెప్పారు.  నేను నీవద్దనే ఉన్నాను, ప్రతీచోటా ఉన్నాను చింతించకు అని బాబా చెప్పినట్లుగా అనిపించింది నాకు.  మనం ఆయనకు సర్వశ్య శరణాగతి చేస్తే సర్వం సాయిమయంగానే కనపడుతుంది అన్నది సత్యం. 

లేకపోతే, ఒక జర్మనీ దేశస్థుడు వచ్చి తలుపు కొట్టడమేమిటి, బాబా ఉన్నారు అని చెప్పి ఓం సాయిరాం అనడమేమిటి. అదంతా కూడా బాబా ఏర్పాటు.  ఆయనకంతా తెలుసు.  ఆయనెప్పుడు మన యోగక్షేమాలు చూస్తూఉంటారు.  బాబా! నన్నెపుడు ఒంటరిగా వదలద్దు, ఇదే నా వినమ్రమై న అభ్యర్ధన.  నన్ను నీదివ్య చరణాల వద్దనే ఉండనీ.  నాతప్పులనీ, అహంకారాన్నీ క్షమించు. నన్ను నీఅధీనంలోకి తీసుకో.

ఓం సాయిరాం. 
 

సర్వం శ్రీసాయినాధార్పణమస్తు

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List