11.03.2021 గురువారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
మహాశివరాత్రి శుభాకాంక్షలు
సాయిబాబా – పరిశోధనా వ్యాస
గ్రంధము – 52 వ.భాగమ్
(పరిశోధనావ్యాస రచయిత… శ్రీ ఆంటోనియో
రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ :
ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ – మంగళవారం – అక్టోబరు, 22, 1985
ప్రశ్న
--- తనలాగే ఉపాసనీ కూడా గొప్ప గురువు అవుతారని బాబా అన్నారని మీ ఉద్దేశ్యమా?
తుకారామ్
--- అవును.
సాయిబాబా
ఆవిధంగా ఉపాసనీ మహరాజ్ తో చెప్పారు.
ప్రశ్న
--- మరి ఆయనకు భోజనం సంగతి ఏమిటి?
ఆయన
తన భోజనానికి
ఏమయినా ఏర్పాట్లు చేసుకున్నారా?
జవాబు
--- ఉపాసనీ మహరాజ్ ఖండోబా దేవాలయానికి వెళ్లగానే తన సర్వస్వాన్ని వదిలేసుకున్నారు.
ప్రశ్న
--- అంటే మీరు చెబుతున్నది ఏమిటి?
జవాబు
--- సర్వస్వం అంటే ఆయన తన బట్టలు, ఇంకా ఏమయినా ఉంటే అవీ మొత్తం వదిలేశారు.
ప్రశ్న
--- ఆయన దిగంబరంగా ఉండేవారా?
తుకారామ్
--- అవును.