Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, October 3, 2020

ఋణ విముక్తి

0 comments Posted by tyagaraju on 8:00 AM

 




















03.10.2020  శనివారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు బాబా చేసిన సహాయం గురించి ప్రచురిస్తున్నాను.  బాబా జీవించి ఉన్న రోజులలో జరిగిన ఈ సంఘటన ‘సాయి సరోవర్’ అనే గుజరాతీ పుస్తకంలో ప్రచురింపబడినది. మరలా ఆంగ్లంలో shiridisaitrust.org లో ప్రచురింపబడింది. 

తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

ఋణ విముక్తి

నాగపూర్ లో శ్రీ అమీదాస్ లక్ష్మీదాస్ మెహతా అనే వడ్డీవ్యాపారి ఉండేవాడు.  అతను వసంతరావు అనే సాయిభక్తుడికి ఆరువందల రూపాయలు అప్పుగా ఇచ్చాడు.

వసంతరావు రోజులు బాగాలేకపోవడంవల్ల అతను ఎంతోమంది వద్దనుంచి కూడా అప్పులు చేసి వాటిని సకాలంలో తీర్చలేకపోయాడు.  ఇక సాయిబాబాయే తనకు దిక్కు అనుకున్నాడు.  అంతేకాకుండా సాయిబాబా ఎల్లప్పుడూ అతనితోనే ఉండేవారు.  అందువల్లనే అతను షిరిడీ వెళ్ళాడు.  

Tuesday, September 29, 2020

నాకోసం పాదయాత్ర చేసి చూడు….

0 comments Posted by tyagaraju on 7:45 AM

 









29.09.2020  మంగళవారమ్

ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు మరొక అద్భుతమయిన సాయి లీల ప్రచురిస్తున్నాను.  సాయిలీల పత్రికలో ప్రచురింపబడిన ఈ లీలను తెలుగులోకి అనువాదం చేసి భువనేశ్వర్ నుండి శ్రీమతి మాధవిగారు పంపించారు.

నాకోసం పాదయాత్ర చేసి చూడు….

2009 వ.సంవత్సరం జనవరి 30 వ.తారీకున తొమ్మిదిమందిమి సాయిభక్తులం బరోడానుంచి షిరిడీకి 400 కి.మీ.పాదయాత్ర చేసుకుంటూ బయలుదేరాము.  నేను ప్రతిరోజు 35 కి.మీ. దాకా నడుస్తూ ఉండేవాడిని.  రెండురోజులలో 70 కి.మీ. నడచుకుంటూ వెళ్ళడం నాజీవితంలో ఇదే మొదటిసారి.  బాబాయే నాకు అంతలా నడిచే శక్తినిచ్చారు.  60 సంవత్సరాల వయసున్న నేను అంతదూరం అలసట లేకుండా నడవగలిగానంటే అది కేవలం బాబా దయ.  అలా పాదయాత్ర చేసుకుంటూ మేమందరం ఆరు రోజులలో సటాకా గ్రామానికి రాత్రివేళకి చేరుకొన్నాము.

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List