Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, April 11, 2022

శ్రీ సాయి దయా సాగరమ్ 9 వ, భాగమ్

0 comments Posted by tyagaraju on 7:39 AM

 



11.04.2022  సోమవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

శ్రీ మాత్రే నమః 

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయి దయా సాగరమ్ 9 వ, భాగమ్

అధ్యాయమ్ – 4

కొన్ని అధ్బుతాలు

మరాఠీ మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి

ఆంగ్లానువాదమ్ ---  శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి

తెలుగు అనువాదమ్ ---  ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్

నేను రాత్రివేళ మాత్రమే కాదు, పగలు కూడా నిద్రిస్తూ ఉంటాను.  ఆవిషయం నాకు 2000 సం.వరకు గుర్తే.  మా ఇంటిలో నేను, మా అత్తగారు ఇద్దరమే ఉంటాము.  మేమిద్దరం వేరు వేరు గదుల్లో నిద్రిస్తూ ఉండేవాళ్ళం.  మా అత్తగారి సోదరుడు పనిమీద పార్లే వస్తుండేవాడు.  ఆవిధంగా వచ్చినపుడు అప్పుడప్పుడు మా ఇంటికి కూడా వచ్చేవాడు.  అతను వచ్చినపుడు మేము గాఢనిద్రలో ఉండేవాళ్ళం.  అతను ఇంటిలోకి వచ్చి అన్ని గదులూ తిరుగుతూ మేము గాఢనిద్రలో ఉన్నందువల్ల మమ్మల్ని లేపడం ఇష్టం లేక వెళ్ళిపోతూ ఉండేవాడు. 

Sunday, April 10, 2022

శ్రీ సాయి దయా సాగరమ్ 8 వ, భాగమ్

0 comments Posted by tyagaraju on 1:14 AM

 




10.04.2022  ఆదివారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి



శ్రీ మాత్రే నమః

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీరామనవమి శుభాకాంక్షలు

శ్రీ సాయి దయా సాగరమ్ 8 వ, భాగమ్

అధ్యాయమ్ - 3

మరాఠీ మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి

ఆంగ్లానువాదమ్ ---  శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి

తెలుగు అనువాదమ్ ---  ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్

శ్రీ సాయి విశ్వవిద్యాలయమ్ – 2

ఇంటిలో ఊరికే కూర్చుని హాయిగా కాలం గడిపినంత మాత్రాన నువ్వు సాయికి నిజమయిన భక్తుడివి కాలేవు.  బాబా నీకు సూచించిన ప్రకారం కష్టపడి పనిచేయాలి.  మొట్టమొదటగా చేయవలసినది నీలో ఉన్న అహంకారాన్ని తొలగించుకోవాలి.  ప్రతివారి ఎడల మర్యాదగాను, దయతోను ఏవిధంగా ప్రవర్తించాలో నేర్చుకోవాలి.

ఈ విశ్వవిద్యాలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే 24 గంటలూ ఇది తెరిచే ఉంటుంది.  విద్యార్ధులందరూ బాగా  శ్రమించి 24 గంటలూ కష్టపడి చదవాలి.  మీ ఇంటివద్ద కూడా చదువుకుంటూ పరీక్షకు తయారవవచ్చు.  విద్యార్ధికి కావలసినది నిజాయితీ, నమ్మకం.;  అదృష్టవంతుడయిన విద్యార్ధికి ఈ విశ్వవిద్యాలయంలో ప్రవేశం దొరుకుతుంది.  విద్యార్ధి తనలో ఉన్న అహంకారాన్ని స్వార్ధాని, పొగరుమోతు తనాన్ని వదిలించుకోవాలి.  

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List