11.03.2018 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీస్వామీజీ భక్తులతో జరిపిన అనుగ్రహ భాషణమ్ - 11 వ.భాగమ్
శ్రీ సాయి పదానంద రాధాకృష్ణస్వామీజీ
గారు భక్తులనుద్దేశించి
చేసిన ప్రసంగాలలోని విషయాలను “Swamiji talks to Devotees” పుస్తకంలోని విషయాలను తెలుగులో అనువదించి అందిస్తున్నాను. SrI sai
Spiritual Centre, T.Nagar, Bangalore వారు ముద్రించారు. ఈ రోజు ఆ ఈ పుస్తకానికి సంపాదకులు, ప్రొఫెసర్ పి.ఎస్.నారాయణ రావు, శ్రీ బి.కె. రఘు ప్రసాద్ గార్లు. సాయిలీల.ఆర్గ్ నుండి గ్రహింపబడినది.
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
12.09.1971 : ఈ రోజు
శ్రీకృష్ణుని జన్మదినమయిన గోకులాష్టమి. స్వామీజీ
కొద్దిమంది భక్తులతో కలిసి గోకులాష్టమి పూజకై ఒక భక్తుని యింటికి వెళ్ళారు. “ప్రతివారికి సత్సంగము, భజన చాలా అవసరం” అని స్వామీజీ
అన్నారు. ఎంతోమంది యోగులు, భాగవతోత్తములయిన భోదేంద్ర, నారద, అజామిళ, ప్రహ్లాద, మారుతి లాంటివారు భజనలకి ఎంతో గౌరవాన్నిచ్చారు.