Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, February 18, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1994 (30)

0 comments Posted by tyagaraju on 7:49 AM

18.02.2012 శనివారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ - 1994 30 వ.భాగాన్ని చదువుకుందాము


సాయి.బా.ని.స. డైరీ - 1994 (30)



22.10.1994


నిన్నటి
రాత్రి నిద్రకు ముందు "నాలోని అజ్ఞానాన్ని తొలగించు తండ్రి" అని సాయినాధుని వేడుకొన్నాను. శ్రీ సాయి దృశ్యరూపములో తెలిపిన విషయాల సారాంశము.

1) పిల్లలను పెంచి పెద్ద చేయటము తల్లితండ్రుల బాధ్యత . వృధ్ధులైన తల్లిదండ్రుల సేవ చేయటము పిల్లల కర్తవ్యము. అని గ్రహించు.

2) నీవు ఋణానుబంధానుసారము ఎవరికైన సహాయము చేసిన అది నీకు ఋణవిముక్తిని కలిగించుతుంది. అది నీకు లభించిన అదృష్టము. నీవలన సహాయము పొందినవారు నిన్ను గుర్తించటము లేదు అనే భావన నీనుండి నీవు తొలగించవలసిన అజ్ఞానము.

3) జీవితములో అన్నదానము చేయగలగటము చాలా అదృష్టము. అన్నదానము చేయడానికి డబ్బు ఖర్చు అగుతుంది అని అన్నదానము చేయటానికి వెనకాడరాదు.

నీవు లోకము నుండి నిష్క్రమించే సమయములో డబ్బు నీతో రాదు. అన్నదాన ఫలమే నీతో వస్తుంది అని గ్రహించు. - శ్రీ సాయి -

27.10.1994

నిన్న రాత్రి శ్రీ సాయినాధులు కలలో యిచ్చిన సందేశము "ధనము మీద వ్యామోహము ఉన్నంత కాలము పరస్త్రీ వ్యామోహము పోదు.

ఎలాగ అంటే రూపాయి నోటుమీద కంటికి కనిపించని వాటర్ మార్క్ లో ముద్రించబడిన సిం హము ముద్రవంటిది పరస్త్రీ వ్యామోహము. అందుచేత ముందుగా ధన వ్యామోహాన్ని వదిలించుకో. - శ్రీ సాయి -

28.10.1994

నిన్నటి రాత్రికలలో శ్రీ సాయి చూపిన దృశ్యాలు నాలో ఆధ్యాత్మిక భావాలను రేకెత్తించినది. వాటి వివరాలు. జీవితము ఒక పూలచెట్టు విత్తనములాగ ప్రారంభము అగుతుంది. విత్తనము చక్కటి నేలలో పడి వానకు తడిసి మొక్క అయి పెరిగి చక్కటి పూవులను ప్రసాదించుతుంది.

ఆపూలు వాటి అదృష్టానుసారము కొన్ని భగవంతుని పాదాల చెంతకు చేరి ఎండిపోతాయి.

మరికొన్ని మానవుల పాదాలక్రిద నలిగి ఎండిపోతాయి.

విధముగా ఎండిపోయిన పూలు గాలికి దూరముగా కొట్టుకొని వెళ్ళి తమ గమ్య స్తానాలు చేరుతాయి. అక్కడ భగవంతుని అనుగ్రహము అనే వానజల్లు ఎండిన పూల మీద పడి తిరిగి పూల మొక్కలగా మారిపోయినవి. నిద్రనుండి మెలుగువ వచ్చినది.

దృశ్యము ద్వారా శ్రీ సాయి యిచ్చిన సందేశము ఏమిటి? అని ఆలోచించినాను. నా మనసులో సమాధానము దొరికినది. మానవ జీవితము ఒక పూలమొక్క లాంటిది. ఆమొక్కకు పూచిన పూవులు వాటి అదృష్టానుసారము పరిమళించి కొన్ని భగవంతుని పాదాల దగ్గరకు మరికొన్ని తోటి మానవుల పాదాల క్రిందకు చేరుతాయి.

(యింకా ఉంది)
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు



Friday, February 17, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1994 29

0 comments Posted by tyagaraju on 6:11 AM




17.02.2012 శుక్రవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ - 1994 29 వ. భాగము చదువుకుందాము

సాయి.బా.ని.. డైరీ - 1994 (29)




10.10.1994

నిన్న రాత్రి శ్రీ సాయికి నమస్కరించి నిద్రపోయినాను. శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో యిచ్చిన సందేశములు.

1) సంసారము - బరువు బాధ్యతలు శాశ్వతము కాదు. శాశ్వతమైనది (భగవంతుడు) ఏమిటి? అనేది తెలుసుకొని జీవించు.

2) జీవితంలో అప్పు చేసి బహుమతులను ఎవరికి ప్రదానము చేయకు. వాళ్ళ "మెహర్బాని" మాట భగవంతునికి తెలుసు. అప్పులవాళ్ళనుండి వచ్చే బాధ నీకు మాత్రమే తెలుసు. - శ్రీ సాయి -

12.10.1994

నిన్నటిరోజున మా కుటుంబమునకు ఆత్మీయులు అయిన శ్రీ నాగరాజరావు గారి మరణవార్త విన్నాను. మనసులో చాలా బాధ కలిగినది. జననము - మరణము గురించి చాల ఆలోచించినాను. రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి సాయినాధ పునర్జన్మ గురించి వివరాలు చెప్పు తండ్రి అని వేడుకొన్నాను. శ్రీ సాయి దృశ్యారూపములో తెలిపిన వివరాలు. 1) ఆత్మ శరీరాన్ని వదలిన తర్వాత శరీరము పంచభూతాలలో కలసిపోతుంది. 2) ఆత్మ పదిరోజుల తర్వాత ఋణానుబంధాను సారముగా గర్భవతి అయిన స్త్రీ మూర్తి గర్భములోని పిండములో ప్రవేశించి నూతన జన్మకు నాంది పలుకుతుంది. 4) ఆతల్లి గర్భాన్ని నవమాసాలు మోసిన తర్వాత నూతన ప్రాణికి జన్మ యిస్తుంది. అదే పునర్జన్మ. 5) కొంతమంది స్త్రీలు అవివాహితులుగా యుండిపోతారు. కొంతమంది స్త్రీలు వివాహము చేసుకొన్నా గర్భవతి కాలేరు. ఆత్మ అటువంటి స్త్రీలనుండి దూరముగా తిరుగుతుంది. 6) ప్రమాదాలలో మరణించినవారికి ఋణానుబంధాల సిద్ధాంతాలు వర్తించవు. ప్రమాదములో మరణించినవారు ఆసమయములో దగ్గరలో ఉన్న గర్భవతి గర్చములోగాని, జంతు గర్భములో గాని ప్రవేశించి పునర్జన్మ పొందుతారు. చనిపోయినవారి గురించి శోకించటములో అర్ధములేదు పుట్టిన ప్రతివాడు ఒకరోజున మరణించక తప్పదు. మనిషి చనిపోయిన తర్వాత అతని ఆత్మ తిరిగి గర్భవతి గర్భములో ప్రవేశించిన రోజే నిజమైన పుట్టినరోజు. నిజమైన పుట్టినరోజు ఎంతమందికి తెలుసు, ఆలోచించు.

13.10.1994 సమయం 1500 (అవర్స్) (3.00 పీ.ఎం.)

ఈరోజు మధ్యాహ్న్నము నిద్రలోని కలలో శ్రీ సాయి నామిత్రుడు శ్రీ బీ.ఎన్. మూర్తి రూపములో దర్శనము యిచ్చి అన్నారు.

"నేను మైన్ రోడ్డుదగ్గర యిల్లు కట్టుకోవటానికి స్థలము కొన్నాను.ఒకసారి చూడటానికి వచ్చి వెళ్ళు." నిద్రనుండి మెలుకువ వచ్చినది. సాయంత్రము ఏడుగంటలకు నేను నాయింటి ముందు నిలబడినాను. సాయి బంధువు శ్రీ సుందరరావు గారు నాదగ్గరకు వచ్చి అన్న మాటలు "నేను కమలానగర్ మైన్ రోడ్డు ప్రక్కన ఫ్లాట్ కొన్నాను. ఈరోజు ఉదయమే గృహప్రవేశము చేసినాను. దయచేసి మా నూతన గృహములో రోజు రాత్రి జరిగే శ్రీ సాయి హారతికి వచ్చి శ్రీ సాయికి మీ చేతుల మీదగా హారతి యివ్వమని కోరుతున్నాను." మాటలు వింటూ యుంటే మధాహ్న్నము కలలో శ్రీ సాయి అన్నమాటలు గుర్తుకు వచ్చినవి. రాత్రి శ్రీ సుందరరావుగారి నూతన గృహమునకు వెళ్ళి రాత్రి హారతి యిచ్చినాను.

సంఘటన శ్రీ సాయి సత్ చరిత్ర 30. అధ్యాయములోని రహతా కుశాల్ చంద్ స్వప్నమును గుర్తు చేసినది. శ్రీ సాయిబాబా స్వప్నములకు కాలనియమములు లేవు అని మరొక్కసారి నిర్ధారణ జరిగినది.

14.10.1994 విజయదశమి : సమయం 11.30 .ఎం.

శ్రీ సాయి నిరాకారుడు అనే ఉద్దేశముతో శ్రీ సాయి సత్ చరిత్రలో 28 . అధ్యాయములో శ్రీ సాయి మేఘశ్యామునితో అన్నమాటలను ఒక కాగితముపై వ్రాసి పటము కట్టించినాను. మాటలు "నాకు రూపములేదు. నేను అన్ని చోట్ల నివసించుచున్నాను." ఆపటమును హాలులోని టీ.వీ. వెనుక వ్రేలాడదీసి నమస్కరించి, టీ.వీ.ని ఆన్ చేసినాను (ప్రారంభించినాను.) టీ.వీ.తెరమీద కనిపించిన బొమ్మ నన్ను ఆనందములో ముంచివేసినది. బొమ్మ నాయిష్ఠ దైవము శ్రీ సాయినాధునిది. బొమ్మ క్రింద అక్షరాలు "శ్రీ సాయికృష్ణ క్రియేషన్స్ సమర్పించు" అన్నవి. శ్రీ సాయి అన్ని చోట్ల నివసించుచున్నారు అనుటకు నిదర్శనము.

21.10.1994

నిన్నటిరోజున ఆధ్యాత్మిక రంగములో ముందుకు పయనించటానికి తెలుసుకోవలసిన విషయాలపై ఆలోచించినాను. రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి ఆధ్యాత్మిక రంగములో అభివృధ్ధికి తెలుసుకోవలసిన మంచి విషయాలు తెలియచేయమని వేడుకొన్నాను. శ్రీ సాయి చూపిన దృశ్యాల సారాంశము.

"ఉన్నత భావాలతో ఉన్నతమైన పదవులు అలంకరించి, పదవి విరమణ తర్వాత సంకుచిత భావాలతో బ్రతకటము అంటే తన్నుతాను మోసగించుకోవటమే. అటువంటి బ్రతుకు బ్రతికినా బతకకపోయినా ఒకటే. అటువంటివారు ఆధ్యాత్మిక జీవనానికి అర్హత లేనివారు అని గుర్తుంచుకోవాలి. -శ్రీ సాయి -

(యింకా ఉంది)
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు



Thursday, February 16, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1994

0 comments Posted by tyagaraju on 8:49 AM


16.02.2012 గురువారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ - 1994 28 వ.భాగాన్ని చదువుకుందాము



సాయి.బా.ని.స. డైరీ - 1994 (28)




05.10.1994

నిన్నటిరోజున నా దగ్గర బంధువుతో ఉన్న శత్రుత్వము గురించి ఆలోచించినాను. శ్రీ సాయి తత్వము ప్రకారము ఈ జన్మలోనే శత్రుత్వము వదిలించుకోవాలి. లేని యెడల అది మరుజన్మలో కూడ తల ఎత్తుతుంది. ఏమి చేయాలి అనే ఆలోచనలతో రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయి సలహా కోరి నిద్రపోయినాను. శ్రీ సాయి కలలో చూపిన దృశ్యాల సారాంశము. 1) నేను ముషీరాబాద్ జైలులో నా తప్పులకు శిక్ష అనుభవించి బయటకు వచ్చినాను. జైలు నుండి బయటకు వచ్చినానే కాని మనసులో పగ చల్లారలేదు. నేను జైలులో కష్ఠపడి పని చేఇనందులకు నాకు ప్రభుత్వమువారు యిచ్చిన ధనముతో ఒక తుపాకీని కొని నా శత్రువును కాల్చి చంపాలి అనే ఆలోచన కలిగినది. ఈ విషయము నా భార్యకు చెప్పినాను. ఆమె నాకు చీవాట్లు పట్టి "మీకు కళ్ళు సరిగా కనిపించని వయసు. యింక పంతాలు పట్టింపులు మాని వేయండి. మీరు మీ పగను వదలకపోతే తిరిగి జైలుకు వెళ్ళవలసియుంటుంది ఆలోచించుకోండి" అన్నది. నిద్రనుండి ఉలిక్కిపడి లేచినాను. నాగదిలో ఉన్న శ్రీ సాయి పటముముందు కూర్చుని ఆలోచించసాగినాను. క్రిందటి జన్మలోని శత్రుత్వమునకు ఈ జన్మలో మానసికముగా చాలా శిక్ష అనుభవించినాను. ఈ శిక్ష అనుభవించిన తర్వాత కూడ యింకా పగ వైషమ్యాలకు పోతే తిరిగి జైలుకు వెళ్ళవలసి యుంటుంది. అంటే వచ్చే జన్మలో కూడ ఈ శత్రుత్వము దానికి శిక్ష అనుభవించవలసి యుంటుంది. అందుచే ఈ శత్రుత్వమును ఈ జన్మలోనే అంతము చేసుకోవాలి లేదా శ్రీ సాయి సత్ చరిత్రలో శ్రీ సాయి చెప్పిన కధలలోని వీరభద్రప్ప (పాము), చెన్నబసప్ప (కప్ప) లాగ బాధపడాలి. అందుచేత ఈ జన్మలోనే శత్రుత్వము వదలించుకోవాలి అని నిశ్చయించుకొన్నాను.

06.10.1994

నిన్నటిరోజున ధైర్యముగాను. ప్రశాంతముగాను బ్రతకటము గురించి ఆలోచించినాను. నా మనసుకు సమాధానము దొరకలేదు. రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి సమాధానము యివ్వమని వేడుకొన్నాను. శ్రీ సాయి దృశ్యరూపములో యిచ్చిన సందేశముయొక్క సారాంశము.

1) మా ఆఫీసులోని నా పై అధికారి మీటింగులో నన్ను అనవసరముగా అవహేళన చేసినారు. నా మనసు చాలా బాధపడినది. నేను సహనమును కోల్పోకుండ జాగ్రత్తగా నెమ్మదిగా నాపై అధికారికి అతని తప్పు గురించి చెప్పినాను ఈ విధముగా పదిమందిలో తప్పు, ఒప్పులను ధైర్యముగా చెప్పగలగటము శ్రీ సాయి శక్తి అని గ్రహించినాను.

2) నేను నా భార్య ఆధ్యాత్మిక రంగములో కలసి ప్రయాణము చేయటానికి తీర్ధయాత్రలకు బయలుదేరినాము. ఒక పుణ్యక్షేత్రములో శ్రీ సాయిని పోలిన ఒక సన్యాసి కలసి అన్న మాటలు. "నీవు నీ భార్యతో కలసి తీర్ధ యాత్రలు మాత్రమే చేయగలవు. కాని ఆధ్యాత్మిక రంగములో నీవు ఒక్కడివే ప్రయాణము చేయాలి. ఆధ్యాత్మిక రంగములో ప్రయాణము తీర్ధయాత్రల ప్రయాణము అంత సులభమైనది కాదు. ఈ అధ్యాత్మిక మార్గము మిగుల కఠినమైనది. కావలసినంత కృషి చేయవలసియుండును. " నిద్రనుండి మెలుకువ వచ్చినది. శ్రీ సాయి సత్చరిత్రలో 21 వ. అధ్యాయములో శ్రీ సాయి శ్రీ వీ.హెచ్.ఠాకూరు గారితో అన్న మాటలు గుర్తుకు వచ్చినవి. జీవితములో ప్రశాంతముగా బ్రతకాలి అని ఉంది. ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదించమని శ్రీ సాయిని వేడుకోవాలి అని నిశ్చయించుకొన్నాను.

09.10.1994

నిన్నటిరోజున ధైర్యము, అధైర్యముల గురించి ఆలోచించినాను. రాత్రి నిద్రకుముందు శ్రీ సాయికి నమస్కరించి ధైర్యము, అధైర్యముల గురించి వివరించమని వేడుకొన్నాను. శ్రీ సాయి కలలో చూపిన దృశ్యాల వివరాలు. వాటి సారాంశము. "ధైర్యము అనేది నీమనసులోని దాగియున్న శక్తి. అధైర్యము అనేది నీ మానసిక బలహీనత. ఈ రెండు నీలోనే యున్నాయి. వాటికి ఉదాహరణలు చెబుతాను విను" అన్నారు ఒక అజ్ఞాత వ్యక్తి. వాటి వివరాలు.

1) ప్లేగు వ్యాధి సోకిన బిడ్డను ఒడిలో తీసుకొని ఆపసి పాపకు సేవ చేస్తున్న తల్లిని చూడు.



2. పిల్లలు లేకపోయిన అన్యోన్యముగా జీవించుతున్న నీ స్నేహితుని, అతని భార్యను చూడు.
3. టిబెట్ నుండి జీవనోపాధికి చిన్న చిన్న పిల్లలతో వచ్చిన ఆ కాందిశీకులను చూడు.
4. ఈ ఉదాహరణలద్వారా నేను తెలుసుకొన్న విషయము "అధైర్యము అనే మానసిక బలహీనతను నీవు జయించిననాడు, ధైర్యము అనే నీలోని శక్తి ఉద్భవించుతుంది."

(యింకా ఉంది)
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

Wednesday, February 15, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1994 (27)

0 comments Posted by tyagaraju on 7:45 AM






15.02.2012 బుధవారము

ఓంసాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి సుభాశీస్సులు
ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ 1994 27వ భాగాన్ని చదువుకుందాము

సాయి.బా.ని.. డైరీ - 1994 (27)


29.09.1994

దేశములో (సూరత్) ప్లేగు వ్యాధి విపరీతముగా ప్రబలుచున్నది అనే వార్తలు వినవస్తున్నాయి. రాత్రి భయముతో శ్రీ సాయికి నమస్కరించి ప్లేగువ్యాధి నుండి రక్షణ పొందటానికి మార్గము చూపమని వేడుకొన్నాను. శ్రీ సాయి చూపిన దృశ్యాల వివరాలు 1) సమాజములో చెడు అలవాట్లు పెరుగుతున్నపుడు వ్యాధులు అనే ఆయుధమువలన సామూహిక మరణాలు సంభవించును 2) ఆటలలో ఆరోగ్యవంతులే విజయము సాధించుతారు. అనారోగ్యముతో వ్యాధులతో ఉన్నవారు మరణానికి తలవంచుతారు. 3) అంటువ్యాధులు బాగా ప్రబలుతున్న ప్రాతాలలో ఎక్కువగా ప్రయాణాలు చేయవద్దు. విందులు, వినోదాలలో పాల్గొనవద్దు 4) నీయింటి పరిసర ప్రాంతాలను శుభ్రముగా ఉంచుకొని వేపచెట్టు గాలి పీల్చు.

30.09.1994

నిన్నటిరోజున గృహస్థ ఆశ్రమము, సన్యాస ఆశ్రమము గురించి ఆలోచించినాను. రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి గృహస్థ ఆశ్రమములో యుంటూ సన్యాసిలాగ బ్రతకటము గురించి తెలపమని వేడుకొన్నాను. శ్రీ సాయి దృశ్యరూపములో యిచ్చిన సూచనలు వాటి వివరాలు.

1) నీ బరువు బాధ్యతలు నిర్వర్తించటానికి మాత్రమే ఆలోచించు.

2) అనవసరపు విషయాలలో జోక్యము చేసుకోవద్దు.

3) ఆహారములో రుచులకు పోవద్దు.

4) పరుల సొమ్ము ఆశించవద్దు

5) పరస్త్రీల గురించి ఆలోచించవద్దు.

6) నీయింటనే ప్రశాంతముగా జీవించాలి అనే కోరికతో భగన్ నామ స్మరణ చేస్తూ జీవించాలి.

01.10.1994

నిన్నటిరోజున శ్రీ సాయి తత్వము గురించి, శ్రీ సాయి శిరిడీలో జీవించిన కాలములోని సంఘటనలు గురంచి ఆలోచించినాను. రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి "సాయిబంధువులు ఆచరించవలసిన ముఖ్య విషయములు చెప్పు తండ్రీ" అని వేడుకొన్నాను. శ్రీ సాయి చూపిన దృశ్యాలు సారాంశము.

1) నీకంటె బలవంతుడు నీచేత తప్పుడు పనులు చేయించటానికి పయత్నాలు చేస్తూ ఉన్నపుడు దానిని నీవు గ్రహించగలగిననాడు, తప్పుడు పనులు చేయటముకంటే అటువంటి బలవంతుల నుండి దూరముగా యుండటము ఉత్తమ మార్గము.

2) ఎవరినైన వంచన చేసి జీవించటము పాపము, ఆత్మవంచన చేసుకొని జీవించటము మహాపాపము.

02.10.1994

నిన్నరాత్రి నిద్రకు ముందు శ్రీ సాయ్కి నమస్కరించి, ఆధ్యాత్మిక విషయాలు చెప్పమని వేడుకొన్నాను. శ్రీ సాయి చూపిన దృశ్యాల సారాంశము.

1) భగవంతుని తెలుసుకోవాలనె తపనతో ఆధ్యాత్మిక రంగములో ప్రవేశిస్థాము. ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకొంటు సాధన చేయడము ద్వారా ఆధ్యాత్మిక శక్తిని పొందుతాము. అటువంటి సమయములో చిన్న చిన్న విజయాలను సాధించుతాము. విజయాలను సాధించినాము అనే గర్వముతో భగవంతుని ఉనికిని మర్చిపోయి పతనము చెందుతాము. అందుచేత ఆధ్యాత్మిక రంగములో ప్రయాణము చేసేటప్పుడు మనలోని అహంకారాన్ని ముందుగా సద్గురుని పాదాల దగ్గర విడిచి ముందుకు సాగిపోవాలి.

2) ఆధ్యాత్మిక రంగములో ప్రయాణము చేసేవానికి తోడుగా బంధువులు, మిత్రులు రారు. సద్గురువు చూపు కాంతి కిరణాలుగా మన ప్రయాణములో సహాయపడతాయి.

(యింకా ఉంది)
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు


 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List