Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, January 8, 2016

శ్రీ జీ.ఎస్.ఖపర్డే డైరీ – 19

0 comments Posted by tyagaraju on 7:33 AM
               Image result for images of shirdi sai baba
        Image result for images of rose hd
08.01.2016 శుక్రవారమ్
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ జీ.ఎస్.ఖపర్డే గారి డైరీ నుండి మరికొన్ని విశేషాలు
డైరీ నుండి కొన్నిటిని ఇవ్వటంలేదు.  ముఖ్యమయిన విశేషాలు ఉన్నవే ఇస్తున్నాను.  అందుచేత మధ్య మధ్యలో కొన్ని తేదీలలోని విషయాలను ఉద్దేశపూర్వకంగానే వదలి వేస్తున్నాను.
Image result for images of g s khaparde
శ్రీ జీ.ఎస్.ఖపర్డే డైరీ – 19
07.01.1912 ఆదివారమ్
ప్రొద్దున్న తొందరగా లేచి కాకడ  ఆరతికి వెళ్ళాను.  సాయి మహరాజ్ చాలా సంతోషంగా ఉన్నారు.  యోగ దృష్టిని ప్రసరించారు.  రోజంతా ఒక విధమయిన పారవశ్యంతో గడిపాను.  

Thursday, January 7, 2016

శ్రీ జీ.ఎస్.ఖపర్డే డైరీ – 18

0 comments Posted by tyagaraju on 8:05 AM
      Image result for images of rare photos shirdi saibaba
   Image result for images of rose hd

07. 01. 2016 గురువారం 
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి 
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు 
శ్రీ జీ.ఎస్. ఖపర్డే గారి డైరీలోని మరికొన్ని విశేషాలు 
Image result for images of g s khaparde
శ్రీ జీ.ఎస్.ఖపర్డే డైరీ – 18
05.01.1912 శుక్రవారం 
రాత్రి సరిగా నిద్రపట్టకపోయినప్పటికీ తొందరగా నిద్ర లేచాను.  కాకడ ఆరతికి వెళ్ళాను.  సాయి మహరాజ్ ప్రసన్నంగా ఉన్నారు.  మా అబ్బాయి బాబా, గోపాలరావు దోలే ఆయన వద్దకు వెళ్ళారు.  వారిని చూడగానే ఆయన “వెళ్ళండి” అన్నారు.  

Wednesday, January 6, 2016

శ్రీ జీ.ఎస్. ఖపర్డే డైరీ - 17

0 comments Posted by tyagaraju on 8:32 AM
      Image result for images of shirdi sainath
    Image result for images of white rose hd

06.01.2016 బుధవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

 ఈ రోజు డైరీ లోని విశేషం చదవండి.  ఇందులో సాయి మహరాజ్ చెప్పిన కధ ద్వారా మనం గ్రహించుకోవలసిన ముఖ్యమయిన విషయం ఉంది.  జాగ్రత్తగా చదివి ఆకళింపు చేసుకోండి. చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం తప్పదు.  మనది కాని సొమ్ము, అనగా పరుల సొమ్మును ఆశించకూడదని, ఆవిధంగా సంపాదించిన సొమ్ము నిలవదని మనం గ్రహించుకోవచ్చు. ఎవరికేది ప్రాప్తమో అదే లభిస్తుంది. మరు జన్మకైనా లభిస్తుందనేది సాయి మహరాజ్ చెప్పిన కధ ద్వారా మనకి బోధ పడుతుంది.  
Image result for images of g s khaparde

శ్రీ జీ.ఎస్. ఖపర్డే డైరీ - 17

04.01.1912 గురువారమ్
ప్రొద్దున్న తొందరగా లేచి, ప్రార్ధన చేసుకున్నాను.  మా అబ్బాయి బాబాని, గోపాలరావు దోలేని సాయి మహరాజ్ వద్దకు వెళ్ళి అమరావతి వెళ్ళడానికి అనుమతి తీసుకుని రమ్మన్నాను.  కాని , నా భార్య మధ్యలో కల్పించుకుని ఆరోజు పౌష్య పూర్ణిమ అని మన కుల దేవతకు పవిత్రమయిన రోజని చెప్పి వద్దంది.  

Monday, January 4, 2016

శ్రీ. జీ.ఎస్.ఖపర్డే డైరీ - 16

0 comments Posted by tyagaraju on 3:22 AM
      Image result for images of shirdisaibaba rare pictures
      Image result for images of white rose hd
04.01.2016 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు శ్రీ జీ.ఎస్.ఖపర్డే గారి డైరీలోని మరికొన్ని విశేషాలు  తెలుసుకుందాము.

Image result for images of g s khaparde
శ్రీ. జీ.ఎస్.ఖపర్డే డైరీ - 16

01.01.1912 సోమవారమ్
ఈ రోజు ఉదయం తొందరగానే నిద్రలేచి, కాకడ ఆరతికి చావడికి వెళ్ళాను.  మొట్టమొదటగా సాయి మహరాజ్ వదనం చూశాను.  మధురమయిన తేజస్సుతో కరుణతో నిండి ఉంది. 

Sunday, January 3, 2016

శ్రీ జీ.ఎస్. ఖపర్డే డైరీ – 15

0 comments Posted by tyagaraju on 7:06 AM
     Image result for images of shirdisaibaba rare pictures

  Image result for images of white rose hd
03.01.2016 ఆదివారం
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయ్ బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు శ్రీ జీ.ఎస్.ఖపర్డే గారి డైరీలోని మరికొన్ని విషయాలు తెలుసుకుందాము.
Image result for images of g s khaparde

శ్రీ జీ.ఎస్. ఖపర్డే డైరీ – 15
30.12.1911 శనివారమ్
షిరిడీ
ఉదయం ప్రార్ధన చేసుకున్న తరువాత నేను రెండు నెలల వరకు రాకపోవచ్చని రెండు ఉత్తరాలు ఒకటి మా అబ్బాయి బాబాకి ఇంకొకటి భావు దుర్రానీకి వ్రాశాను.  నటేకర్ రాధాకృష్ణమాయి ఇంటికి వెళ్ళాడు.  ఆమె ఇంటిలో లేనట్లుగా ఉంది.  

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List