20.05.2016 శుక్రవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ
రోజు ప్రచురించేదానిలో దక్షిణ గురించి తెలుసుకుందాము
శ్రీసాయి అంకిత భక్తులు – జస్టిస్ ఎమ్.బి.రేగే – 3వ.భాగమ్
అదే
సంవత్సరం 1912 లో ఆయన వంద రూపాయలతో మరలా షిరిడీకి వచ్చారు. బాబాను దర్శించుకున్నపుడు బాబా రూ.40/- దక్షిణ అడగగానే
వెంటనే సమర్పించారు. కొంత సేపయిన తరువాత మరలా
రూ.40/- దక్షిణ అడిగారు. రేగే వెంటనే దక్షిణ
ఇచ్చారు. తరువాత మిగిలిన రూ.20/- కూడా దక్షిణ
అడిగారు. రేగే ఎటువంటి సంకోచం లేకుండా ఇచ్చేశారు. తన వద్దనున్న డబ్బంతా బాబాకు దక్షిణగా సమర్పించినందుకు
చాలా సంతోషించారు.