31.10.2020 శనివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయే తప్ప మరొక దైవాన్ని తలచకుండా ఆయన నామస్మరణలోనే జీవితాన్నంతా గడిపిన సాయి అంకితభక్తురాలయిన శ్రీమతి శివమ్మ తాయి గురించి మూడవభాగాన్ని ఈ రోజు ప్రచురిస్తున్నాను.
సాయి
అమృతాధారనుండి
సేకరణ.
తెలుగు అనువాదమ్ :
ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
శివమ్మ తాయి – 3 వ.భాగమ్
“సాయిబాబా మందిరంలోనే నన్ను సమాధిచేయవలసిన సమాధి కూడా నిర్మించబడుతూ ఉంది. ఇక అది పూర్తి కావస్తోంది. నా గురువు ఎప్పుడు నిర్ణయిస్తే అపుడు నా శరీరాన్ని ఆ సమాధిలో ఉంచి పై భాగాన్ని మూసివేయండి. ఆ ఒక్కపని మాత్రమే మిగిలి ఉంది” అని ఆమె 1993వ.సంవత్సరంలో చెప్పింది. ఆమె ఇంకా చెప్పిన విషయం, “బాబా జీవించి ఉన్న కాలంలోను, సమాధి చెందిన తరువాత కూడా ఆయన నన్ను కనిపెట్టుకొని ఉంటున్నారు.