11.06.2021 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయిలీల ద్వైమాసపత్రిక నవంబరు – డిసెంబరు, 2008 వ.సంవత్సరంలో ప్రచురింపబడిన సాయిలీల
షిరిడీ సాయిబాబా – గురునానక్ – 2 వ.భాగమ్
ఆంగ్ల మూలమ్ డా.సుబోధ్ అగర్వాల్, డెహ్రాడూన్
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఓ బాబా! యోగులు వాస్తవంగానే ఏకభావంతో కార్యాన్ని నిర్వహిస్తారు. గురునానక్ హిందువులు, ముస్లిమ్స్ మధ్య ఐకమత్యం ఉండాలని కోరుకొన్నారు. నువ్వు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందింపచేయడానికి, మతసామరస్యాన్ని నెలకొల్పడానికి అవతరించినవానిగా కీర్తింపబడ్డావు. గురునానక్ ఎప్పుడూ ‘ ఏక్ ఓంకార్ సత్నామ్’ అని అంటూ ఉండేవారు. అనగా దాని అర్ధం ‘భగవంతుడు ఒక్కడే - ఆయన పేరు సత్యసంధత’. అదేవిధంగా జీవితంలో నీయొక్క ముఖ్యమయిన ఉద్దేశ్యం శాశ్వతమయిన సత్యాన్ని ప్రజలు గ్రహించుకోవాలన్నదే. ‘సబ్ కా మాలిక్ ఏక్’ అందరినీ పరిపాలించేది ఒకే భగవంతుడు. (భగవంతుడే అందరికీ యజమాని).