28.05.2014 బుధవారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
భక్త మహల్సాపతి
(మహాల్సాపతి గృహము)
ఈ రోజునుండి మీకు మధ్య మధ్యలో బాబాకు సేవ చేసిన కొంతమంది భక్తుల గురించి తెలియచేస్తూ ఉంటాను. ఇవి చదివిన తరువాత మీ అభిప్రాయాలను కుడా తెలపండి. వీటికి సంబంధించిన వివరాలన్ని కూడా జనారధనరావు గారి బ్లాగునుండి సంగ్రహింపబడినవి. వారికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. వివరాలు అందించడంలో కాస్త ఆలశ్యమవచ్చు కారణం తెలుగులోకి అనువదించి మీకు అందించడానికి కాస్త సమయం పడుతుంది కాబట్టి. ప్రతీరోజు ప్రచురించడానికి సాధ్యమయినంతవరకు ప్రయత్నం చేస్తూనే ఉంటాను.
(మొట్టమొదటగా బాబా షిరిడీలోకి అడుగుపెట్టినపుడు ఆయనను "సాయి" అని పిలిచినది మహల్సాపతి. ఆతరువాతనుంచి బాబాకు సాయి అన్న పేరు స్థిరపడింది. 1886వ.సంవత్సరంలో బాబా ఆయన ఒడిలో పడుకొని తమ ప్రాణాన్ని బ్రహ్మండంలో లీనం చేసి సమాధిలోకి వెళ్ళారు. మరుసటిరోజు షిరిడీ గ్రామ ప్రజలందరూ వచ్చి చలనం, ఉచ్చ్వాశ నిశ్వాసాలు లేని బాబా శరీరం చూసి ఆయన మరణించారని భావించారు. మహల్సాపతి చెప్పినదానికి వ్యతిరేకించి, లాంచనాలన్నీ పూర్తిచేసి బాబా శరీరాన్ని సమాధి చేయవసిందేనని అన్నారు. కాని మహల్సాపతి ఒక్క అంగుళం కూడా కదలక "మూడురోజులు వేచి చూసినందువల్ల నష్టమేమీ లేదనీ, బాబా మూడు రోజులలో మరల తిరిగి వస్తారని చెప్పారు. బాబా మాటలు సత్యమని నమ్మకంగా చెప్పాడు.)