Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, December 31, 2011

బాబాకు సంతుష్టిగా భోజనము పెట్టుట ఎట్లు?

0 comments Posted by tyagaraju on 4:10 PM




01.01.2012 ఆదివారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

మనము కూడా బాబావారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెపుదాము.

శ్రీ షిరిడీ సాయి బాబా సాయి బంధువులమైన మేమంతా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. మమ్ములనెప్పుడు మీరు చల్లగా చూడవలసిందిగాను, మీ రక్షణలో మమ్ములను ఉంచి కాపాడవలసినదిగాను ప్రార్ధిస్తున్నాము.

రాజాధి రాజ యోగిరాజ పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహరాజ్ కి జై


రోజు నూతన సంవత్సరము. ష్రీ షిరిడీ సాయి బాబా సత్ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని (9 . అధ్యాయము) ఒక సారి మననం చేసుకుందాము.

బాబాకు సంతుష్టిగా భోజనము పెట్టుట ఎట్లు?

ఒకప్పుడు ఆత్మారాం తార్ఖడ్ భార్య షిరిడీలో ఒక యింటియందు దిగారు. మధ్యాహ్ న్న భోజనము తయారయింది. అందరికీ వడ్డించారు. ఆకలితో ఉన్న కుక్క ఒకటి వచ్చి మొఱగసాగింది. వెంటనే తార్ఖడ్ భార్య లేచి ఒక రొట్టెముక్కను విసిరింది. కుక్క ఎంతో మక్కువగా ఆరొట్టెముక్కని తింది. ఆనాడుసాయంకాలము ఆమె మసీదుకు వెళ్ళినప్పుడు బాబా ఆమెతో " తల్లీ నాకు కడుపునిండ గొంతువరకు భోజనము పెట్టావు. నా జీవశక్తులు సంతుష్టి చెందినవి. ఎల్లప్పుడు యిలాగే చేస్తూ ఉండు. యిది నీకు సద్గతి కలుగచేస్తుంది. మసీదులో కూర్చుండి నేనెన్నడు అసత్యమాడను. నాయందు యిలాగే దయ ఉంచు. మొదట ఆకలితో ఉన్న జీవికి భోజనము పెట్టిన పిమ్మట నీవు భుజింపుము. దీనిని జాగ్రత్తగా జ్ఞప్తియందుచుకొనుము" అని అనేటప్పటికి తార్ఖడ్ గారి భార్యకు ఏమీ అర్ధం కాలేదు. అపుడామె "బాబా నేను నీకెట్లా భోజనము పెట్టగలను" నేనే నా భోజనానికి యితరుల మీద ఆధారపడి ఉన్నాను. నేను వారికి డబ్బిచ్చి భోజనము చేస్తున్నాను" అంది. అప్పుడు బాబా యిలా జవాబిచ్చారు. "నీవు ప్రేమపూర్వకముగా పెట్టిన యా రొట్టెముక్కను తిని యిప్పటికీ త్రేనుపులు వస్తున్నాయి. నీ భోజనమునకు ముందు కుక్కను చూచి నువ్వు రొట్టె పెట్టావో అదియు నేను ఒక్కటే. అలాగే , పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలైనవన్నీ కూడా నా అంశములే. ఎవరయితే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుదురో వారే నా ప్రియ భక్తులు. అందుచేత నేను వేరు, తక్కిన జీవరాశి అంతయు వేరు అనే ద్వంద్వ భావమును, భేదమును విడిచి నన్ను సేవింపుము" విధముగా బాబా చెప్పిన అమృతవాక్కులు ఆమె హృదయాన్ని కదిలించాయి. ఆమె నేత్రములు అశ్రువులతో నిడిపోయాయి. గొంతు గద్గదమయింది. ఆమె ఆనందానికి అంతు లేదు.

సాయి భక్తులారా ! చదివారుకదా ! యిక్కడ బాబాగారు చెప్పినది మనం తూ.చా. తప్పకుండా ఆచరిస్తే ఆయన అనుగ్రహానికి మనం పాత్రులమవుతాము. ఆకలితో ఉన్న జీవిని తృప్తి పరుస్తే బాబాని సంతుష్టిని చేసినట్లే. ఆకలితో ఉన్న జీవి అంటే జంతుజాలాలే కాదు, మానవుడిని కూడా. యిక్కడ మనం ఒక విషయం గమనించాలి. మనం సాధారణంగా మనయింటిలో మనం ఎంగిలి చేసినవి, మనం తినడానికి పనికిరాకుండా పాడయిన పదార్ధాలను సామాన్యంగా పిల్లులకు, కాకులకు, బిచ్చగాళ్ళకు, లేక మనయింటిలో పనిమనుషులకు వేస్తూ ఉంటాము.

ఆవిధముగా చేయడం పొరపాటు. మనం యితరులకు పెట్టినా, జంతుజాలాలకు పెట్టినా మనం తినగలిగేదే పెట్టాలి. మీకొక అనుమానం రావచ్చు. మరి పాడయిపోయిన పదార్ధాలను బయట పడవేస్తున్నాము కదా మరి అవి పక్షులు, పిల్లులు తింటాయి కదండీ అని. ఒకటి గుర్తు ఉంచుకోండి. మీరు కావాలని మాత్రం పెట్టవద్దు. పాడయిన పదార్ధాలను సహజంగా బయట పడవేస్తు ఉంటాము.




కాని వాటిని ఏజీవికి పిలిచి మాత్రం పెట్టకండి. వాటిని యితర జంతుజాలాలు యిష్టమయితే తింటాయి లేకపోతే వాసన చూసి వదలివేస్తాయి. మనం అనుకుంటాము. బిచ్చగాడే కదా వాడు ఏది పెట్టినా తింటాడులే అని. కాని ఒకటి గుర్తు ఉంచుకోండి. బిచ్చగాడు ప్రతీ రోజు అటువంటి ఎంగిలి పదార్ధాలను, పాడయిపోయిన పదార్ధాలను తింటూ ఉండవచ్చు. ఒక్కసారి మీరు కనక శుభ్రమైన ఆహారాన్ని అతనికి పెట్టారనుకోండి. అతను తన జీవితంలో మొదటిసారిగా తిన్నప్పుడు ఎంత తృప్తిపడతాడొ ఊహించుకోండి. అవునంటారా కాదంటారా? మీరు పండగనాడు, బూరెలు, పులిహార చేసుకున్నారు. వాటిని కొంచెం పెట్టిచూడండి. ఎంత తృప్తిగా ఆరగిస్తారో? సాధారణంగా మనము ఏమి చేస్తాము? ఆరోజు తిన్నంత తిని, మిగిలినవి మరుసటిరోజు బాగుంటే తింటాము బాగుండకపోతే బిచ్చగాడికి వేస్తాము? అవునా? మరి? ఒక రెండో లేక నాలుగో ఆరోజే దానం చేసేయండి. దానివల్ల మనకున్నదానిలో ఏమీ తరిగిపోదుకదా? ప్రతీరోజు భోజనానికి కూర్చునేముందు మొదటగా అన్నం కొంచెం తీసి బయట పెట్టండి. ఆకలితో ఉన్న ఏ పక్షి అయినా దానిని తింటుంది. బయటపెట్టిన తరువాత మీరు భోజనం చేయండి.

బాబాని సంతుష్టుడిని చేయడానికి,ఆయన అనుగ్రహానికి పాత్రులవడానికి మనము ఉపవాసాలు చేయనక్కరలేదు. బాబాకు పెద్ద పెద్ద దండలువేసి అలంకరించనక్కరలేదు. ప్రతీ జీవిలోను ఆయనని చూడాలి. ఆకలిగొన్నవారికి అన్నం పెట్టాలి. బాబా సంతుష్టి చెందుతారు. అప్పుడే బాబాకు మీరు మీఇష్టమైనదీ మీశక్తికొలదీ సమర్పించండి. బాబా మీద మీప్రేమను, భక్తిని తెలుపుకొనండి.

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు


Friday, December 30, 2011

సాయి.బా.ని.స. డైరీ

0 comments Posted by tyagaraju on 5:21 PM


31.12.2011 శనివారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు

ఈ రోజు సాయి.బా.ని.స. డరీ - 1993 20వ. భాగాన్ని చదువుకుందాము

సాయి.బా.ని.స. డైరీ - 1993









29.10.1993

నిన్న రాత్రి మానసిక బాధతో శ్రీ సాయికి నమస్కరించి సాయినాధ నీవు నా కష్ఠాలులోను, నా సుఖాలులోను నాకు తోడుగా ఉన్నావనే అనుభూతిని ప్రసాదించు తండ్రి అని వేడుకొన్నాను. శ్రీ సాయి ప్రసాదించిన దృశ్యము నన్ను చాల సంతోషపరిచినది. అది ఒక చెఱువు. నేను మానసిక బాధతో ఆ చెఱువులో ఈత కొడుతున్నాను.











యింకొక వ్యక్తి జ్వరముతో శారీరక బాధతో ఆ చెఱువులో ఈత కొడుతున్నాడు. మమ్మలనిద్దరిని ఓ వయసు మళ్ళిన వ్యక్తి గట్టుపై నిలబడి చిరునవ్వుతో చూస్తున్నాడు. ఆ వ్యక్తి మమ్మలనిద్దరిని గట్టుపైకి రమ్మనమని సైగ చేసినారు. ఆవ్యక్తి అన్నారు "నా కరుణాసగరములో మానసిక జ్వరముతోను, శారీరక జ్వరముతో బాధ పడేవారు ప్రశాంతముగా ఈత కొట్టవచ్చును. ఈత కొట్టి అలసి పోయినపుడు వాళ్ళను నేను జాగ్రత్తగా గట్టు ఎక్కించుతాను". నేను సంతోషముతో ఆయనను దాదాజి (తాతగారు) అని పిలుస్తాను. ఆయన కోపముతో నేను ముసలివాడిని కాను. నా వయస్సు నీకు తెలియదులే అన్నారు. ఆయన కోపము నాకు కొంచము భయము కలిగించినది. నిద్రనుండి లేచిపోయినాను. యిది అంత కల కదా - శ్రీ సాయి కలలో నా కష్ఠ సుఖాలలో నాకు తోడుగా ఉంటానని చెప్పినారు కదా అని సంతోషించినాను.

02.11.1993

నిన్న రాత్రి శ్రీ సాయి ముగ్గురు స్త్రీల రూపములో దర్శనము యిచ్చినారు. వాటి వివరాలు. నీ మనసుకు ఆనందము కలిగించే నీ కుమార్తె రూపములో ఉన్నాను. నీ కష్ఠ సుఖాలలో పాలు పంచుకొనే నీ భార్య రూపములో ఉన్నాను. లక్షలాది అనాధ బాల బాలికల బాధ్యత వహించుతున్న మదర్ థెరీసా రూపములోను ఉన్నాను - అన్నారు.

11.11.1993

నిన్నటి రోజు ప్రశాంతముగా గడచిపోయినది. శ్రీ సాయికి నమస్కరించి సాయినాధ నాలో ద్వేషము అనే గుణమును వదిలించుకొనే మార్గము చూపుమని వేడుకొన్నాను. శ్రీ సాయి చక్కని దృశ్యము చూపినారు. ఆ దృశ్య్లము చూసిన తర్వాత కనువిప్పు కలిగినది. నేను ఉదయము వేళ బ్రష్ తో పండ్లు తోముకుంటున్నాను. నేను ఆ మలినాన్ని బయటకు ఉమ్మి వేయకుండ మ్రింగుతున్నాను. పండ్లు శుభ్రపడినాయి కాని ఆ మలినము శరీరములోనే యున్నది. ఆ మలినాన్ని మ్రింగితే భయంకరమైన జబ్బులు వస్తాయి అంటారు ఓ అజ్ఞాత వ్యక్తి. నిద్రనుండి లేచి ఆలోచించినాను. ద్వేషము అనే మలినాన్ని మన మనసునుండి తీసి పారవేయాలి. లేకపోతే ఆ మలినము మన పతనానికి నాంది పలుకుతుంది అని గ్రహించినాను. ఆ అజ్ఞాత వ్యక్తి యింకా అన్నారు. సద్గురువు యొక్క ప్రేమ అభిమానాలు పొందియుండి కూడ జీవితము అనే రోడ్డుపై గోతులను చూసి ప్రక్కనుండి వెళ్ళకుండ ఆ గోతిలో పడితే అది సద్గురువు యొక్క తప్పుకాదు. అది శిష్యునిలో యింకా మిగిలియున్న అహంకారము అని గుర్తించు.

12.11.1993

నిన్నటి రోజు గురువారము. రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి "సాయినాధ, నీగురించి వివరముగా చెప్పు బాబా" అని వేడుకొన్నాను. శ్రీ సాయి కృష్ణుని రూపములో దర్శనము యిచ్చి "తనకు తన భక్తుల మధ్య ఉన్న ప్రేమ రాధా కృష్ణల ప్రేమవంటిది" అన్నారు. తన భక్తులు తలపెట్టిన మంచి కార్యాలు నిర్విఘ్నముగా జరగటానికి ఆశీర్వదించే శ్రీ విఘ్నేశ్వరుడిని నేనే" అన్నారు.

13.11.1993

నిన్నటి రోజున ధనవ్యామోహముపై చాలా ఆలోచించినాను. నాలోని ధన వ్యామోహమును తొలగించు బాబా అని ప్రార్ధించి నిద్రపోయినాను. కలలో ఒక అజ్ఞాత వ్యక్తి అన్నారు. "నీ యింటిలోని పూజగదిలో (మనసులో) పూజా సామానులతో నిండియుంది. కాని యింకా పూజ ప్రారంభించలేదు నీవు - అందుచేతనే యింకా ఈ వ్యామోహాల వలనుండి బయట పడలేదు"

(యింకా ఉంది)

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు


Thursday, December 29, 2011

సాయి.బా.ని.స. డైరీ - 1993

0 comments Posted by tyagaraju on 4:48 PM




30.12.2011 శుక్రవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాసీస్సులు

రోజు సాయి.బా.ని.. డైరీ - 1993 19 . భాగాన్ని చదువుకుందాము

సాయి.బా.ని.. డైరీ - 1993

23.10.1993

నిన్నటి రోజున మనసులో చాలా చికాకు పడినాను. జీవితములో తప్పు పనులు చేసినాను. వాటివలన చికాకులు కలుగుతున్నాయి. వాటినుండి బయటపడాలి. రాత్రి శ్రీ సాయికి నమస్కరించి నిద్రపోయినాను. శ్రీ సాయి ఒక అజ్ఞాత వ్యక్తి రూపములో వచ్చి నీ పెద్ద తండ్రి (నా తండ్రి అన్నగారు) చాలా డబ్బు అక్రమమార్గాలలో సంపాదించినారు. ఎంత డబ్బు సంపాదించిన డబ్బును దుబారా చేసి ఆఖరికి చనిపోయే సమయములో చేతిలో చిల్లి గవ్వలేని స్థితిలో చనిపోయినారు. ఆయన జీవితాన్ని చూసి నీవు అటువంటి పొరపాట్లు చేయకుండ జీవించు". శ్రీ సాయి నా బంధువులలో ఒక స్త్రీని చూపించి "ఆమె చెడు ప్రవర్తనతో కుటుంబ పరిస్థితి అస్థవ్యస్థ అయినది" అన్నారు. యిటువంటి పనులు నీవు చేయకుండాయుంటే చాలు. నీభవిష్యత్ లో నీకు చికాకులు యుండవు" అని శ్రీ సాయి అన్నారు అని భావించినాను.

25.10.1993

నిన్న రాత్రి కలలో శ్రీ సాయి యిచ్చిన సందేశము "ఎంతటి ఖరీదు అయిన కూరగాయలనైన సులువుగా జీర్ణము అవటానికి ఉడికించి తినవలసినదే, పచ్చి కూరగాయలు తినలేము కదా - అలాగే ఎంతటి గొప్పమతములో జన్మించినా భగవంతుని తెలుసుకోవటానికి సాధన చేయవలసియుంటుంది. సాధన విధానము నేను చెబుతాను యిష్ఠము యుంటే తెలుసుకో - శ్రీ సాయి.

26.10.1993

నిన్నటిరోజున శ్రీ సాయి తత్వప్రచారము విషయములో నేను సరి అయిన మార్గములో నడుస్తున్నది లేనిది తెలపమని శ్రీ సాయిని వేడుకొన్నాను. శ్రీ సాయి చూపిన దృశ్యము నన్ను సంతోషపరిచినది. "నేను నా ఆఫీసు బస్సు కోసము నిలబడినాను. యింతలో నా ఆఫీసు ప్రక్కన ఉన్న ఫ్యాక్టరీ బస్సు వచ్చినది. ఆబస్సులో ఎక్కటానికి బస్సును ఆపినాను. బస్సులోనివారు అందరు మీ ఆఫీసు యజమాని పేరు చెప్పి బస్సు ఎక్కండి అన్నారు.


నేను సంతోషముగా నా యజమాని శ్రీ .వీ.ఖాన్ అని చెప్పినాను. బస్సులోనివారు అందరు సంతోషముతో నన్ను వారి బస్సు ఎక్కించుకొని నా ఆఫీసు దగ్గర దించినారు. తెల్లవారిన తరవాత కల గురించి ఆలోచించినాను. నాకు శ్రీ సాయి అనేక సార్లు మా పెద్ద ఆఫీసరు శ్రీ .వీ.ఖాన్ రూపములో దర్శనము యిచ్చినారు. కలలో కనిపించిన బస్సు, అందలి ప్రయాణీకులు భగవంతుని భక్తులు. నేను నా యజమాని .వీ.ఖాన్ (శ్రీ సాయి) పేరు చెబితే వారు సంతోషముగా ఆబస్సులో ఎక్కనిచ్చినారు. అంటే శ్రీ సాయి తత్వము మరియు శ్రీ సాయి పేరు భగవంతుని భక్తులకు ఆమోదము అని గ్రహించినాను. శ్రీ సాయి తత్వము ప్రచారములో నేను సరి అయిన మార్గములో నడుస్తున్నాను అనే అనుభూతిని పొందినాను.

28.10.1993

నిన్నటిరోజున శ్రీ ఆర్థర్ ఆస్ బరన్ సాయి రామచరిత్ర అనువాదము కష్ఠము అనిపించినది. నేను చేస్తున్న అనువాదములో తప్పులు లేకుండయుండేలాగ ఆశీర్వదించమని శ్రీ సాయినాధుని వేడుకొన్నాను. రాత్రి కలలో శ్రీ సాయి చూపిన దృశ్యము నన్ను సంతోషములో ముంచివేసినది. శ్రీ సాయి ఒక పెద్ద కంపెనీ యజమాని రూపములో తెల్లని సూటు ధరించి, తెల్లని కారులో నాయింటికి వచ్చి, నన్ను నా భార్యను పెద్ద హోటల్ కు రాత్రి భోజనానికి తీసుకొని వెళ్ళినారు. నా భార్య తనకు కావలసిన పదార్ధాలను తెప్పించుకొని తినసాగినది. పెద్ద కంపనీ యజమాని నాకు మత్తు పానీయాల లిస్టు యిచ్చి నాకు కావలసిన మత్తుపానీయము తెప్పించుకొనమని చెప్పినారు. నేను శ్రీ సాయి భక్తునిగా మారిన రోజునుండి మత్తుపానీయాలు త్రాగడము మానివేసినాను అని ఆయనకు చెప్పినాను. ఆయన నాలోని మంచి పట్టుదలకు సంతోషించి తను, నాకు తనకు త్రాగటానికి మంచి పానీయము ఆర్డర్ చేస్తానని చెప్పి అక్కడయున్న సర్వరుని పిలిచి రెండు పెద్ద కప్పుల "బ్రోస్" పానీయము తీసుకొని రమ్మనమని చెప్పినారు. నా భార్య చక్కగా భోజనము చేయసాగినది. సర్వరు రెండు పెద్ద కప్పులలో వేడి వేడి బ్రోస్ పానీయము తెచ్చినాడు. పెద్ద కంపెనీ యజమాని మరియు నేను వేడి పానీయము త్రాగటము ప్రారంభించినాము. వేడి పానీయము నాలికకు తగలగానే నాకు నిద్రనుండి తెలివి వచ్చినది. నేను పెద్ద హోటల్ లో లేను. నాభార్య నా మంచము ప్రక్క మంచముపై ప్రశాతముగా నిద్రపోవుచున్నది. పెద్ద కంపెనీ యజమాని లేరు. యిది అంత కలకదా అని అనిపించినది. కాని బ్రోస్ అనే పానీయము గురించి ఆలోచించుతు మరసటిరోజున నా స్నేహితులను చాలా మందిని అడిగినాను. అటువంటి పానీయము తాము ఎవరు త్రాగలేదని చెప్పినారు. అయినా శ్రీ సాయి రాత్రి కలలో పెద్ద కంపెనీ యజమాని రూపములో దర్శనము యివ్వటము నిజము అయనట్లు అయితే బ్రోస్ అనే పానీయము యివ్వటము కూడ నిజము అని తలచినాను. నా స్నేహితులు బ్రోస్ అనే పదానికి అర్ధము చెప్పలేకపోవటముతో నాదగ్గర ఉన్న చాంబర్స్ ట్వెంటీయత్ సెంచురీ డిక్షనరీ చూసినాను. నా కళ్ళను నేను నమ్మలేకపోయినాను. బ్రోస్ అనేపదమునకు అర్ధము " సింపుల్ అండ్ న్యూట్రిషస్ ఫుడ్, మేడ్ బై పోరింగ్ బాయిలింగ్ వాటర్ ఆర్ మిల్క్ ఆన్ ఓట్ మీల్" అని ఉంది. తెలుగులో చెప్పాలి అంటే గంజి అని అర్ధము. శ్రీ సాయినాధుడు నాపై కరుణించి గంజిని ప్రసాదించి నాయింట భోజన పదార్ధాలకు లోటు యుండదని ఆశీర్వదించినారు. మరియు ఆర్థర్ ఆస్ బర్న్ యింగ్లీషులో వ్రాసిన పుస్తకమునకు తెలుగు అనువాదము చేయటములో యింగ్లీషు డిక్షనరీ సాయము తీసుకో అనే సలహా యిచ్చినారు.

(ఇంకా ఉంది)

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు


 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List