Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, November 7, 2022

శ్రీ సాయి సత్ చరిత్ర 15 వ.అధ్యాయమ్

0 comments Posted by tyagaraju on 2:54 AM

 




07.11.2022  సోమవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

శ్రీ మాత్రే నమః


సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

కార్తిక పౌర్ణమి శుభాకాంక్షలు

శ్రీ సాయి దయా సాగరమ్ 45వ, భాగమ్

అధ్యాయమ్ – 43

మరాఠీ మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి

ఆంగ్లానువాదమ్ ---  శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి

తెలుగు అనువాదమ్ ---  ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్

9440375411  & 81436267

శ్రీ సాయి సత్ చరిత్ర 15 వ.అధ్యాయమ్

నేను ప్రతిరోజు శ్రీ సాయి సత్ చరిత్రలోని 15 వ. అధ్యాయాన్ని పారాయణ చేస్తూ ఉంటాను.  ఈ అధ్యాయంలో ఒక వాస్తవ గాధ వివరింపబడింది.  అందులో ఔరంగాబాద్ నుండి ఒక బల్లి తన సోదరిని కలుసుకోవడానికి షిరిడికి వచ్చిన సంఘటన ప్రస్తావింపబడింది. ఈ సంఘటన చదివిన ప్రతిసారీ నేను బాబాను ఇలా ప్రార్ధించుకుంటూ ఉండేదానిని.  “బాబా మేము ఏడుగురం అక్కచెల్లెళ్ళం.  మా కందరికీ వివాహాలు అయిన తరువాత ఎక్కడెక్కడో దూరప్రాంతాలలో ఉంటున్నాము.  మేమందరం కలుసుకుందామనుకున్నా తరచుగా కలుసుకోలేకపోతున్నాము” అని బాధపడుతూ ఉండేదానిని.

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List