15.08.2020 శనివారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ
రోజు మరొక అధ్భుతమయిన సాయి లీలను ప్రచురిస్తున్నాను. డా.ప్రియ, ముంబాయి నుండి తమ అనుభవాన్ని ఆంగ్లంలో
శ్రీమతి మాధవి, భువనేశ్వర్ గారికి పంపించారు.
దానిని తెలుగులోని అనువాదం చేసి మీకు అందిస్తున్నాను. ఇది చదివిన తరువాత బాబా లీలలు అమోఘమని, అనూహ్యమని
మనకి అర్ధమవుతుంది.
'ఆ వ్యక్తి' - ఆస్పత్రిలో పరిచయం
సాయి
నన్ను భారతదేశానికి ఏవిధంగా పిలిపించుకొని, నన్ను తన భక్తురాలిగా చేసుకొన్నారో ఆ అద్భుతమయిన
లీలని మీకు వివరిస్తాను.
మా
కుటుంబంలో సాయిని నమ్ముకున్నవారెవరూ లేరు.
నేను మహారాష్ట్రలోనే జన్మించినందువల్ల సాయిబాబా ఎవరో తెలుసు. పూర్వపు రోజులలోని జ్ఞాపకాలను తిరిగి గుర్తుకు తెచ్చుకొంటే
మా ఇంటిలోని బొమ్మల అలమారులో ఉన్న సాయిబాబా విగ్రహం గుర్తుకు వస్తుంది. ఆ విగ్రహం కాషాయ రంగులో ఉండేది. దేవుళ్ళందరికి నమస్కారం చేసుకున్నట్లుగానే ఆయనకు
కూడా నమస్కరించడం తప్ప నాకు బాబా గురించి ఏమాత్రం తెలియదు.