Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Wednesday, August 12, 2020

ఆర్తితో అర్ధిస్తే ఆదుకునే సాయి

Posted by tyagaraju on 7:45 AM

Send Prayers to Sai Baba of Shirdi - Send Prayers to Shirdi Sai ...
      Yellow Rose HD Wallpapers for Android - APK Download

12.08.2020  బుధవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిపదానంద జూలై, 2000 సంవత్సరంలో ప్రచురింపబడిన మరొక బాబా లీలను ఈ రోజు ప్రచురిస్తున్నాను. 
నిస్సహాయ స్థితిలో ఉన్న తన భక్తులని బాబా ఏవిధంగా ఆదుకొంటారో దీనిని బట్టి మనం గ్రహించుకోవచ్చు.  సహాయం చేయడానికి భగవంతుడె స్వయంగా దిగి రాడు.  ఆవిధంగా రావాలంటే మనం ఎంతో పుణ్యం చేసుకోవాలి.  అందరిలోను భగవంతుడె ఉన్నాడు కాబట్టి ఆయన ఏదో ఒకరూపంలో వచ్చి మనకు సహాయం అందిస్తాడు.  అందులో ఎటువంటి సందేహం లేదు.  కావలసినదల్లా మనకు ఆయనమీద అచంచలమయిన భక్తి, విశ్వాసం.  ఇక చదవండి.
తెలుగు అనువాదమ్   ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫోన్.  9440375411  &  8143626744

ఆర్తితో అర్ధిస్తే ఆదుకునే సాయి
నేను మద్రాసు I.I.T. లో మెటలర్జీలో ప్రొఫెసర్ గా పనిచేస్తూ, 1997వ.సంవత్సరంలో పదవీవిరమణ చేసాను.  ఆతరువాత కర్నాటక బోర్డర్ లోని హోసూరులో స్థిరనివాసం ఏర్పరచుకొన్నాను. 


1970 వ.సంవత్సరంలో మా మామగారి సోదరుడయిన శ్రీ ఎ. ఎన్.సుందర్ రాజ్ గారు శ్రీసాయి స్పిరిట్యువల్ సెంటర్ కి, శ్రీరాధాకృష్ణస్వామీజీ గారికి పరిచయం చేసారు.  అప్పటినుండి స్వామీజీ నన్ను ఎన్నోవిధాలుగా అనుగ్రహిస్తూనే ఉన్నారు.  మా అబ్బాయి శ్రీరామ్, అతని భార్య ఇద్దరూ కొద్దిరోజులు ఉండి వెడదామని అమెరికానుండి వచ్చారు.  తిరుగుప్రయాణానికి మద్రాసునుండి మార్చ్ 26వ.తీదీన వెళ్ళే ఫ్లైట్ కి టిక్కెట్లు బుక్ చేసుకొన్నారు.  మార్చ్ 25 వ.తారీకున మైసూర్ లో ఉంటున్న, 90 సంవత్సరాల  వయసుగల మా అమ్మగారిని చూసి మద్రాసుకు రాత్రి బయలుదేరే రైలుకు బెంగళూరు రైల్వే స్టేషన్ లో మా అబ్బాయి కోడలిని దిగబెట్టాలి. ఆవిధంగా మా ప్రయాణాన్ని నిర్ణయించుకొని హోసూర్ నుండి మైసూర్ వెళ్లడానికి ఒక టాటా సుమో జీపుని అద్దెకు తీసుకొన్నాము.  మేము అనుకున్న ప్రకారమే మైసూరుకు చేరుకొన్నాము.  మా అమ్మగారు తన మనవడిని, మనవడి భార్యని చూసి చాలా సంతోషించింది.  మధ్యాహ్నం మేము ఎనిమిది మందిమి బోలెడంత సామానుతో బెంగళూరుకు బయలుదేరాము.  మేము ఇంకా మద్రాసుకు చేరకుండానే మాజీపు వెనక టైరు పంక్చరయింది.  దానికి మరొక చక్రం మార్చి మరికొంత దూరం ప్రయాణించిన తరువాత మరొక రెండు పంక్చర్ లు పడ్డాయి.  అప్పటికే  బాగా చీకటి పడింది.  పంక్చర్ లు పడ్డ టైర్లను బాగుచేయించే దారి ఏదీ కనిపించటంలేదు.  మా అబ్బాయి రాత్రి 10 గంటలకి మద్రాసుకు బయలుదేరే రైలు అందుకోవాలి.  మరుసటిరోజే అమెరికాకు విమానంలో బయలుదేరాలి.  ఈవిధంగా జీపుకి పంక్చర్ లు పడటంతో మాప్రయాణం ముందుకు సాగేలా కనిపించడంలేదు.  మేము ఎప్పుడు ఎలా ప్రయాణం సాగించాలో చక్కటి ప్రణాళిక వేసుకొన్నాము.  ఇప్పుడు అవన్నీ తలక్రిందులయ్యాయి.  ఏమీ చేయలేని అయోమయపరిస్థితిలో పడ్దాము.  మేము ఇక శ్రీసాయిబాబాని, శ్రీరాధాకృష్ణస్వామీజీ గారిని ప్రార్ధించుకుంటూ ఉన్నాము.  విష్ణుసహస్రనామాలలో అనుకూల శతావర్తి అని కీర్తిస్తూ ఉంటాము.  మా ప్రార్ధనలను సాయిబాబా, స్వామీజీ ఆలకించారు.  మాప్రార్ధనలు ఫలించాయి.  వెంటనే అనుకోనివిధంగా మాకు సహాయం లభించింది.  అది నిజంగా అధ్బుతమనే చెప్పాలి.  మా ప్రక్కనే ఒక జీపు వచ్చి ఆగింది.  అందులో ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు.  చాలా మర్యాదస్తుడిలా ఉన్నాడు. అతను మాపరిస్థితినంతా అర్ధం చేసుకొని మా ఎనిమిది మందినీ, సామానుతో సహా తన జీపులోకి ఎక్కించుకొని మా అబ్బాయిని, కోడలిని బెంగళూరు రైల్వే స్టేషన్ లో దిగపెట్టాడు. అంతే కాదు మా మామగారిని, అత్తగారిని కూడా బెంగళూరు విల్సన్ గార్డెన్ లో ఉన్న వారి ఇంటిలో దిగబెట్టాడు. ఆ అపరిచితుడు తనపేరు షకీల్ షేక్.  అతను తుమ్ కూరు లో ఉంటాడు.  మైసూరునుంచి తుమ్ కూరు వెడుతున్నట్లుగా చెప్పాడు.  అతను చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పినపుడు నవ్వి ఊరుకున్నాడు తప్పితే తన చిరునామా కూడా ఇవ్వలేదు.  అతికష్టం మీద తుమ్ కూర్ లో అతని టెలిఫోన్ నంబరును సంపాదించగలిగాను.  ఆతరువాత నేను శ్రీషకీల్ షేక్ కి ఉత్తరం వ్రాసి ఆ ఉత్తరాన్ని తుముకూరులో ఉన్న నాతోడల్లుడికి పంపిస్తూ, టెలిఫోన్ నెంబరును బట్టి అతని చిరునామా కనుక్కోమన్నాను.  దాని ఆధారంగా మాతోడల్లుడు ఆయనతో మాట్లాడగా షకీల్ షేక్ మా తోడల్లుడి ఇంటికి వచ్చాడు.  అతను చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెబుతున్నపుడు అతను హాలులో గోడకు తగిలించి ఉన్న బాబా ఫొటోవైపు చూస్తూ నాకు అప్పగించిన పనిని నేను చేసాను అంతే అన్నాడు.  ఆరోజు మార్చి, 25, 2000 వ.సంవత్సరంలో భయంకరమయిన రాత్రివేళ దారితెన్ను తెలియక నిస్సహాయ స్థితిలో ఉన్న మాకు సాయిబాబా, స్వామీజీ ఇద్దరూ శ్రీషకీల్ షేక్ సహాయమందించారు.                                                             డా.  ఆర్. వాసుదేవన్
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List