Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, January 21, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1994 (10)

0 comments Posted by tyagaraju on 4:26 AM



21.01.2012 శనివారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబా వారి శుభాసీస్సులు

ఈరోజు సాయి.బా.ని.స. డైరీ - 1994 10 వ. భాగాన్ని చదువుకుందాము

సాయి.బా.ని.స. డైరీ - 1994 (10)

నిన్న రాత్రి కొందరు మితృలను భోజనానికి పిలిచినాను. భోజన సమయములో మా ఆఫీసులో పని చేసి రిటైర్ అయిన ఉన్నత ఉద్యోగిని దూషించినాను. మితృలుకూడా నాతో కలసి ఉన్నత ఉద్యోగిని దూషించినారు. రాత్రి భోజనాలు అనంతరము మితృలు అందరు వెళ్ళిపోయినారు. నేను ప్రశాంతముగా నిద్రపోయినాను. ఉదయము ఆరు గంటలకు లేచి మార్నింగ్ వాక్ కోసము బయలు దేరినాను. నేను మార్నింగ్ వాక్ నుండి తిరిగి వస్తూ ఉంటే చాలా కాలమునుండి కనిపించని మితృడు కనిపించినాడు. అతను నాతో అన్నమాటలు "నిన్నరాత్రి పది గంటలకు నీ గురించి మరియు మన ఆఫీసునుండి రిటైర్ అయిన ఉన్నత ఉద్యోగి (డా. ఎన్.కే. రావు) గురించి ఆలోచించసాగినాను. యిపుడు నీకు మరియు డా. ఎన్.కే. రావు గార్కి మంచి సంబంధాలు ఉన్నాయా లేదా?" మాటలు వింటూ ఉంటే శ్రీ సాయి స్వయముగా మాట్లాడుతున్నారా అనిపించినది. శ్రీ సాయి సత్ చరిత్ర 21 . అధ్యాయములో పండరీపురము ప్లీడరు విషయములో శ్రీ సాయి అన్న మాటలు "ఒకరిని గూర్చి చెడ్డ చెప్పరాదు, మరియు అనవసరముగా వ్యాఖ్యానము చేయరాదు" మరియు బాబా సర్వాంతర్యామి తన భక్తులు ఎక్కడ ఏమి చేస్తున్నా - ఏమి మాట్లాడిన వారికి అన్ని తెలియును అనేది గుర్తు చేసుకొన్నాను.

10.03.1994

నిన్నటిరోజు "శివరాత్రి". రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి నిద్రపోయినాను. రాత్రి కలలో శ్రీ సాయి చూపించిన దృశ్యము నాలో చాలా ఆలోచనలను రేకిత్తించినవి. వాటి వివరాలు:

నేను తెల్లని అండర్ వేరు, బనీను ధరించి చేతిలో పుస్తకము పెన్ను పట్టుకొని రోడ్డుమీదకు వచ్చినాను. రోడ్డుమీద "ఆత్మకూర్" కు మార్గము అని వ్రాసి యుంది. నేను ఆత్మకూర్ గురించి ఆలోచించుతూ నడక ప్రరంభించినాను. యింతలో వెనుకనుండి బస్సు నాప్రక్కనుండి చాలా వేగముగా వెళ్ళిపోయినది. సమయములో నా చేతిలోని పెన్ను, పుస్తకము రోడ్డుమీద పడిపోయినవి. బస్సు చక్రాలు పెన్ను మీదగా వెళ్ళినది. పెన్ను విరిగిపోయినది. పుస్తకములోని కాగితాలు గాలికి రెపరెపలాడుతున్నాయి. నేను పుస్తకాన్ని ఆరోడ్డుమీదనే వదలి వేసి ఆత్మకూర్ ఎక్కడవున్నది అని ఆలోచుంచుతూ రోడ్డుమీద ప్రయాణము సాగించసాగినాను.

12.03.1994

నిన్నటిరోజు రంజాన్ నెలలోని శుక్రవారము. రంజాన్ మాసము సందర్భముగా హిందువులకు, ముస్లింలకు సందేశము యివ్వమని శ్రీ సాయిని కోరినాను. శ్రీ సాయి రాత్రి కలలో ఒక అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము ఇచ్చి అన్నారు. "నీవు నీ బ్రతుకు తెరువు కోసము అన్ని విధములైన సర్దుబాట్లు చేసుకొంటూ నీకు నచ్చని నీ ఉన్నత ఉద్యోగి దగ్గర పని చేయటము లేదా - మరి యింట అత్తకోడళ్ళు గొడవలు పడుతున్న సంసారాలు చేయటము లేదా - అలాగే అన్ని మతాలువారు దేశములో సర్దుబాట్లు చేసుకొంటు ప్రశాంతముగా జీవించాలి."

15.03.1994

నిన్న రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి ఆధ్యాత్మిక శక్తి గురించి వరించమన్న్నాను. శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి అన్న మాటలు "గతంలో నీవు అనుభవించిన కష్ఠాలను మరచి పోవటము గొప్ప ఆధ్యాత్మిక శక్తి."

20.03.1994

నిన్న రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి సాయినాధ - మాట్లాడు తండ్రీ అని వేడుకొన్నాను. శ్రీ సాయి నా జీవితము మరియు నా బంధువుల జీవితాలలోని ముఖ్య విషయాలను దృశ్యరూపములో చూపించినారు. వాటి సారాంశము. "మనము పిల్లలకు జన్మ యిస్థాము. అంతే గాని వాళ్ళ అదృష్ఠాలకు ఎంత వరకు మనము బాధ్యులము" అనే ప్రశ్నతో వారిని వదలివేస్థాము. కాని సమర్ధ సద్గురువు తన భక్తుల సంతోషము కోసము వారి ప్రశాంత జీవితము కోసము తన భక్తుల పిల్లల అదృష్టాన్ని బాగుచేస్తారు".

(యింకా ఉంది)

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు




Wednesday, January 18, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1994 (9)

0 comments Posted by tyagaraju on 5:53 PM

19.01.2012 గురువారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ - 1994 9 వ. భాగాన్ని చదువుకుందాము.

సాయి.బా.ని.స. డైరీ - 1994 (9)

05.03.1994

నిన్నటిరోజున నాకుమారుడు వ్యవహారము నా మనసులో అశాంతిని రేకెత్తించినది. కన్నీళ్ళతో శ్రీ సాయికి నమస్కరించి నిద్రపోయినాను. శ్రీ సాయి చూపిన దృశ్యము నాలో మొండి ధైర్యమును ప్రసాదించినది. వాటి వివరాలు. ఒక యింటి యజమాని చనిపోయినాడు. అతని పిల్లలు సమయములో దగ్గర లేరు. యింటి యజమాని బంధువులు విచార వదనముతో అతని శరీరము ప్రక్కన కూర్చుని యున్నారు. యింటి యజమానురాలు కళ్ళలో ఒక్క నీటి చుక్క లేదు. ఆమె యాంత్రికముగా శవదహనమునకు కావలసిన ఏర్పాటులు చేయించుతున్నది. యింతమంది బంధుమితృల కళ్ళకు కనిపించని రూపములో ఒక సర్దాజీ (శ్రీ సాయి) చేతిలో తుపాకీ ధరించి ప్రాంతములో కాపలా కాస్తున్నారు. ఆయింటి యజమాని ఎవరు ? నేనే...

07.03.1994

నిన్నటిరోజున మధ్యాహ్న్నము నిద్రపోతూ ఉండగా కలలో శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి అన్నారు. 30.07.1995 తర్వాత నీ భార్య గర్భవతి అగుతుంది. సమయములో నీ యింట బంధుమితృలు నిన్ను చూడటానికి వస్తారు. నీ పిల్లలు యింటికి వచ్చేపోయేవారికి సేవ చేసుకోలేక చికాకు వడతారు. " విధమైన కలకు అర్థము ఏమిటి అయి ఉంటుంది అనే ఆలోచనలతో నిన్న రాత్రి నిద్రపోయినాను. రాత్రి నిద్రలో పీడ కలలు వచ్చినవి. ఎవరో చనిపోయినట్లు వారు తిరిగి జన్మించినట్లు - నేను కలకు భయపడి నిద్రనుండి లేచినాను. కలనుండి నేను అర్థము చేసుకొన్న విషయాలు - నా యింట 30.07.1995 తర్వాత ఎవరైన మరణించవచ్చును. తిరిగి వ్యక్తి నా కుటుంబ సభ్యుల గర్భములో జన్మించవచ్చును అనే భావన కలిగినది. వేచి చూడాలి.

పీ. ఎస్. 17.05.1996 నాడు నా గుండెకు బై పాస్ సర్జరీ జరిగినది. ఆపరేషన్ లో నా గుండె, ఊపిరి తిత్తులు ఒక గంట ముప్పయి నిమిషాలు ఆపివేసినారు. శ్రీ సాయి దయవలన ఆపరేషన్ విజయవంతముగా జరిగినది. యిది నాకు శ్రీ సాయి ప్రసాదించిన పునర్జన్మ. ఆపరేషన్ అనంతరము చాలా మంది బంధువులు నన్ను చూడటానికి నా యింటికి వచ్చినారు.

30.07.1996 నాడు ఆఫీసుకు వెళ్ళటానికి డాక్టర్స్ అనుమతి యిచ్చినారు. 17.05.1996 నాడు నా గుండె ఆపివేయటము నాకు మరణము, మరియు ఆపరేషన్ అనంతరము కోలుకోవటము పునర్జన్మ. శ్రీ సాయి పరిస్థితిని 07.03.1994 నాడు నాకు తెలియచేసినారు అని నా నమ్మకము.


(ఇంకా ఉంది)

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు





 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List