19.01.2012 గురువారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ - 1994 9 వ. భాగాన్ని చదువుకుందాము.
సాయి.బా.ని.స. డైరీ - 1994 (9)
05.03.1994
నిన్నటిరోజున నాకుమారుడు వ్యవహారము నా మనసులో అశాంతిని రేకెత్తించినది. కన్నీళ్ళతో శ్రీ సాయికి నమస్కరించి నిద్రపోయినాను. శ్రీ సాయి చూపిన దృశ్యము నాలో మొండి ధైర్యమును ప్రసాదించినది. వాటి వివరాలు. ఒక యింటి యజమాని చనిపోయినాడు. అతని పిల్లలు ఆ సమయములో దగ్గర లేరు. ఆ యింటి యజమాని బంధువులు విచార వదనముతో అతని శరీరము ప్రక్కన కూర్చుని యున్నారు. ఆ యింటి యజమానురాలు కళ్ళలో ఒక్క నీటి చుక్క లేదు. ఆమె యాంత్రికముగా శవదహనమునకు కావలసిన ఏర్పాటులు చేయించుతున్నది. యింతమంది బంధుమితృల కళ్ళకు కనిపించని రూపములో ఒక సర్దాజీ (శ్రీ సాయి) చేతిలో తుపాకీ ధరించి ఆ ప్రాంతములో కాపలా కాస్తున్నారు. ఆయింటి యజమాని ఎవరు ? నేనే...
07.03.1994
నిన్నటిరోజున మధ్యాహ్న్నము నిద్రపోతూ ఉండగా కలలో శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి అన్నారు. 30.07.1995 తర్వాత నీ భార్య గర్భవతి అగుతుంది. ఆ సమయములో నీ యింట బంధుమితృలు నిన్ను చూడటానికి వస్తారు. నీ పిల్లలు యింటికి వచ్చేపోయేవారికి సేవ చేసుకోలేక చికాకు వడతారు. "ఈ విధమైన కలకు అర్థము ఏమిటి అయి ఉంటుంది అనే ఆలోచనలతో నిన్న రాత్రి నిద్రపోయినాను. రాత్రి నిద్రలో పీడ కలలు వచ్చినవి. ఎవరో చనిపోయినట్లు వారు తిరిగి జన్మించినట్లు - నేను ఆ కలకు భయపడి నిద్రనుండి లేచినాను. ఈ కలనుండి నేను అర్థము చేసుకొన్న విషయాలు - నా యింట 30.07.1995 తర్వాత ఎవరైన మరణించవచ్చును. తిరిగి ఆ వ్యక్తి నా కుటుంబ సభ్యుల గర్భములో జన్మించవచ్చును అనే భావన కలిగినది. వేచి చూడాలి.
పీ. ఎస్. 17.05.1996 నాడు నా గుండెకు బై పాస్ సర్జరీ జరిగినది. ఆ ఆపరేషన్ లో నా గుండె, ఊపిరి తిత్తులు ఒక గంట ముప్పయి నిమిషాలు ఆపివేసినారు. శ్రీ సాయి దయవలన ఆపరేషన్ విజయవంతముగా జరిగినది. యిది నాకు శ్రీ సాయి ప్రసాదించిన పునర్జన్మ. ఆపరేషన్ అనంతరము చాలా మంది బంధువులు నన్ను చూడటానికి నా యింటికి వచ్చినారు.
30.07.1996 నాడు ఆఫీసుకు వెళ్ళటానికి డాక్టర్స్ అనుమతి యిచ్చినారు. 17.05.1996 నాడు నా గుండె ఆపివేయటము నాకు మరణము, మరియు ఆపరేషన్ అనంతరము కోలుకోవటము పునర్జన్మ. శ్రీ సాయి ఈ పరిస్థితిని 07.03.1994 నాడు నాకు తెలియచేసినారు అని నా నమ్మకము.
(ఇంకా ఉంది)
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment