02.10.2018 మంగళవారమ్
ఓమ్ సాయి
శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు
బాబావారి శుభాశీస్సులు
బాబా ఊదీ
– మహా ప్రసాదమ్
ఈ రోజు బాబావారి
ఊదీ యొక్క అధ్బుతమైన శక్తికి సంబంధించిన లీల తెలుసుకుందాము. ఇది
సాయి లీల.ఆర్గ్
నుండి సంగ్రహింపబడింది.
జనక్ రాజ్ లరోయియా... నోయిడా
సూర్యోదయానికి
ప్రారంభంనుండే చల్లని పిల్లగాలులు అంతటా వ్యాపించి మనసుకు ఆహ్లాదాన్ని కలిగించినట్లుగా,
అనతి కాలంలోనే షిరిడీ సాయిబాబావారి మహిమలు, ఆయన గొప్పతనం దేశం నలుమూలలా వ్యాపించాయనటంలో
ఎటువంటి అతిశయోక్తి లేదు. షిరిడీ సాయి సంస్థాన్
వారి నియమాలకు అనుగుణంగా ఢిల్లీ మరియు చుట్టుప్రక్కల నిర్మింపబడిన సాయిమందిరాలలో ప్రతిష్టించబడిన
బాబావారి విగ్రహాలు ఎంతోమంది భక్తులను ఆకర్షిస్తూ ఉన్నాయి. రోజురోజుకి వచ్చే భక్తుల సంఖ్య కూడా ద్విగుణీకృతమవుతూ
ఉంది. కుల, మత, జాతి, లింగ వివక్షతలు లేకుండా
అన్ని వయసుల వారు ప్రతి గురువారంజరిగే బాబా ఆరతిలో విధిగా పాల్గొంటూ ఉన్నారు.