18.10.2022
మంగళవారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
శ్రీ మాత్రే నమః
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
సాయి దయా సాగరమ్ 42వ, భాగమ్
అధ్యాయమ్
– 40
మరాఠీ
మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి
ఆంగ్లానువాదమ్
--- శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి
(ఉదయ్ అంబాదాస్ బక్షి)
తెలుగు
అనువాదమ్ --- ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట,
హైదరాబాద్
9440375411 & 81436267
బాబా
రక్షణ కవచమ్
ఈ సంఘటన
1980 వ, సం. లో జరిగింది. నా అక్కచెల్లెళ్ళలో
పెద్ద అక్క షైలా బద్లాపూర్ లో ఉండేది. ఇప్పుడు
ఆమె జీవించి లేదు. నేను ఒకసారి ఉజ్వలాతాయి
ఇంటిలో శుభకార్యానికి ముంబాయినుండి బయలుదేరి వెళ్లాను. నేను పార్లేలో ఒకరోజు ఉన్న తరువాత మరునాడు షైలాని
కలుసుకోవడానికి లోకల్ రైలులో దాదర్ కి వచ్చాను.
దాదర్ నుండి మరొక లోకల్ రైలులో కళ్యాణ్ స్టేషన్ లో దిగాను.