03.01.2023 మంగళవారమ్
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఓమ్ శ్రీ గణేశాయనమః
శ్రీ మాత్రేనమః
ఓమ్ శ్రీ సాయినాధాయనమః
శ్రీ కృష్ణపరబ్రహ్మణేనమః
శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే
శ్రీ సాయి సత్ చరిత్ర –9 వ.భాగమ్
ప్రేరణ ; గీతాచార్యుడు శ్రీ కృష్ణపరమాత్మ, మరియు సాయినాధులవారు
ప్రేరణా స్థలమ్ … శ్రీ వేణుగోపాలస్వామి
ఆలయమ్
సమన్వయ కర్త ; ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట్, హైదరాబాద్
ఫోన్. 9440375411
& 8143626744వ.
శ్రీమద్భగవద్గీత అధ్యాయమ్ – 6 ఆత్మసంయమ
యోగము (1)
శ్లోకమ్ – 6
బంధురాత్మాత్మనస్తస్య యేనాత్మైనాత్మనా
జితః
అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్
మనస్సును, ఇంద్రియములను, శరీరమును జయించిన
జీవుడు, తనకు తానే మిత్రుడు. అట్లు జయింపనివాడు
తనకు తానే శత్రువు. అనగా జితేంద్రియమునకు మనస్సు,
ఇంద్రియములు, శరీరము, భగవత్ప్రాప్తి సిధ్ధికై మిత్రునివలె, సహకరించును. అట్లుగాక జితేంద్రియుడు కానివానికి మనస్సు, ఇంద్రియములు,
శరీరము శత్రువులవలె ప్రవర్తించి లక్ష్యసాధనకు అవరోధములుగా నిలుచును.