శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి
సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావు
05.05.2019
ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 3 వ.భాగమ్
సాయిబానిస గారి ద్వారా సాయి భక్తులకు బాబా వారు అందిస్తున్న అమూల్యమయిన సాయి సందేశాలు
ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్
చదివిన తరువాత మీ అభిప్రాయాలను తెలపండి.
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
వాట్స్ ఆప్.& ఫోన్.. 8143626744 and 9440375411
17.04.2019 గురువుయొక్క
ఆవశ్యకత – శ్రీ షిరిడీ సాయి తన గురువు వివరాలు తెలియచేయుట.
1. గురుపరంపర
యొక్క ఆవశ్యకతను గురించి అడిగినావు కదా!
కొన్ని
విద్యలు గురువాక్కు ద్వారానే నేర్చుకోగలము.
ఉదా. సంగీతము, నాట్యము,
వేదాలు, మంత్రాలు
ఇవన్నీ గురువు
తన నోటితోను, చేతుల అభినయముతోను మాత్రమే తన శిష్యులకు నేర్పగలరు.
కాని
ఆధ్యాత్మిక జ్ఞానము సద్గురువు యొక్క ఆశీర్వచనాలతో మాత్రమే పొందగలము.
నీవు
నీ సద్గురువు పాదాలను నమ్ముకో.
ఆయన
నిన్ను నీగమ్యానికి తప్పక చేర్చుతారు.