23.01.2015 శుక్రవారం
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ప్రతీ మానవునికి ఒక మార్గదర్శకుడు లేక ఒక మంచి సద్గురువు ఉండాలి. కొంతమంది అనుకోవచ్చు విధినెవ్వరూ తప్పించలేనప్పుడు దేవునితో పని ఏమిటి గురువుతో పని ఏమిటి అని. కాని ఆవిధిని కూడా తప్పించి ప్రమాదాల బారిన పడకుండా రక్షించే శక్తి గురువుకు ఉంటుంది. ఇక చదవండి.
హరిసీతారాం దీక్షిత్ చెప్పిన అనుభవాలు - 2 (నిన్నటి సంచిక తరువాయి భాగం)
మొట్టమొదటిసారిగా నేను బాబాని చూడగానే నా ప్రియ స్నేహితుడు గోవింద రఘునాధ్ ధబోల్కర్ కూడా బాబా దర్శనం చేసుకుంటే బాగుండుననిపించింది. ఒకసారి షిరిడీ వచ్చి బాబా దర్శనం చేసుకోమని షిరిడీనుండి ధబోల్కర్ కి ఉత్తరం వ్రాశాను.