24.10.2020 శనివారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులందరికి బాబా వారి శుభాశీస్సులు
విజయదశమి
శుభాకాంక్షలు
శ్రీ సాయిలీల ద్వైమాసపత్రిక జూలై – ఆగష్టు – 2019వ. సంవత్సరంలో ప్రచురించిన బాబా లీలలలో ఒక దానిని ఈ రోజు ప్రచురిస్తున్నాను. హిందీలో ప్రచురింపబడిన ఈ లీలకు తెలుగు అనువాదమ్…
ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్.
బంగారు
గొలుసును తెచ్చినదెవరు?
మే
నెల 1961 వ.సంవత్సరంలో మా అమ్మాయి అల్లుడితో కలిసి షిరిడీకి వెళ్ళే భాగ్యం కలిగింది. ఇండోర్ నుండి మన్మాడ్ వెళ్ళి అక్కడినుండి మరలా తిరుగు
ప్రయాణమయేలా ముందుగానే నిర్ణయించుకున్నాము.
ఆవిధంగా మాప్రయాణం ఎటువంటి కష్టం లేకుండా ఎంతో సులభంగా జరిగింది.
గురువారమునాడు
నేను మొట్టమొదటిసారిగా బాబా దర్శనం చేసుకొన్నాను.
సమాధి మందిరంలో నుంచుని ఆయనను దర్శించుకోగానే నాకళ్ళంబట ఆనందభాష్పాలు కారసాగాయి.
షిరిడీలో
మా అమ్మాయి స్నానం చేసినపుడు స్నానాలగదిలో తన మెడలో ఉన్న బంగారు గొలుసును మర్చిపోయింది. బయటకు వచ్చిన తరువాత కూడా ఆమెకు ఆవిషయం గుర్తుకు
రాలేదు. బాబాకి పూజ, అభిషేకం అయిన తరువాత మేము
తిరిగి బసకు వస్తుండగా తన మెడలో బంగారు గొలుసు లేదన్న విషయం హటాత్తుగా గుర్తుకు వచ్చింది. ఆ గొలుసును తను స్నానాలగదిలోనే మర్చిపోయినట్లుగా
అప్పుడు తెలిసింది. చాలా సేపు వెతికింది కాని
ఎక్కడా ఎటువంటి ఆధారం దొరకలేదు. ఇది మన మంచికే
జరిగిందేమోలే అని సరిపెట్టుకున్నాము. ఇక దీని
గురించి అనవసరంగా బాధపడకు అని మా అమ్మాయిని ఓదారుస్తూ కాస్త సంతోషాన్ని కలిగించడానికి
ప్రయత్నించాము.
ఆరోజు
రాత్రి భజన కార్యక్రమం మొదలయింది. అందరూ భజనపాటలు
పాడుతూ ఉన్నారు. అదే సమయంలో ఒక వ్యక్తి మైకులో
“నాకు ఒక బంగారు గొలుసు దొరికింది. అది ఎవరిదైతే వారు తగిన ఋజువు చూపించి తీసుకోవచ్చును”
అని ప్రకటన చేసాడు.
ఆ
ప్రకటన వినగానే మా అమ్మాయి అల్లుడు ఇద్దరూ ఆవ్యక్తి దగ్గరకు వెళ్లారు. తగిన సాక్ష్యాధారాలను చూపించిన తరువాత ఆవ్యక్తి
మాగొలుసును మాకు ఇచ్చాడు.
మా
వస్తువు మాకు దొరికిందన్న సంతోషంతో ఆవ్యక్తికి ఎదయినా బహుమానం ఇద్దామనుకున్నాము. ఆవ్యక్తి కోసం చాలా వెతికాము. కాని అతను మాకు మళ్ళీ కనపడలేదు.
ఈ
సంఘటన తరువాత మాకుంటుంబంలోని వారందరమూ బాబాకు అంకిత భక్తులమయాము. ఎపుడు అవకాశం లభిస్తే అప్పుడు షిరిడీ వెళ్ళి బాబాను
దర్శించుకొని ఊదీ, ప్రసాదం తీసుకొని ఎంతో సంతోషంగా ఇంటికి తిరిగి వస్తూండేవాళ్ళము.
(ఈ
విజయదశమి రోజులలో ఒక భక్తురాలి ఇంటికి బాబా ఏవిధంగా వచ్చారో తెలిపే అధ్బుతమయిన లీలతో
పాటు మరొక భక్తురాలికి నిన్నటి రోజున బాబా ప్రసాదించిన లీల … త్వరలో ప్రచురిస్తాను.)
(సర్వం
శ్రీ సాయినాధార్పణమస్తు)