26.11.2011 శనివారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాసీస్సులు
ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ 6 వ.భాగము చదువుకుందాము.
సాయి.బా.ని.స. డైరీ 6 వ. భాగము
06.10.1992 మంగళవారము విజయదశమి
నిన్న రాత్రి తలనొప్పి, జ్వరముతో బాధపడుతూ శ్రీ సాయికి నమస్కరించి నిద్ర పోయినాను. తెల్లవారుజామున శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తిరూపములో అన్నారు. నీయింటికి యిద్దరు ప్రసాదము తీసుకోవటానికి వస్తారు. వారితోపాటు మరి యిద్దరు వస్తారు. వారు నీకు ప్రసాదము యిస్తారు. మెలుకువ వచ్చి చాలా ఆశ్చ్రర్యముగా ఉందే ఈ కల అని తలచినాను. ఈ రోజు విజయదశమి శ్రీ సాయికి నాలుగు హారతులు యిచ్చినాను. మధ్యాహ్నము శ్రీ సాయికి విజిటబుల్ బిరియాని నైవేద్యము పెట్టినాను. సాయంత్రము చాల మంది బందువులు, స్నేహితులు వచ్చి విజిటబుల్ బిరియానీని సాయి ప్రసాదముగా స్వీకరించినారు. యిక రాత్రి హారతికి ముందు హెచ్.ఎం.టీ. బేరింగ్స్ నుండి శ్రీ మతి & శ్రీ కృష్ణయ్య మరియూ వారి యిద్దరి మగ పిల్లలు వచ్చినారు. శ్రీ సాయి ప్రసాదము ఆ నలుగురికి ఇచ్చినాను. బార్యా భర్తలు ఆ ప్రసాదము తిన్నారు. కాని వారి పిల్లలకు విజిటబుల్ బిరియాని యిష్ఠము యుండదు కాబట్టి వారు తినరట. ఆ కారణము చేత ఆపిల్లలకు రెండు, రెండు పాలకోవ బిళ్ళలు యిచ్చినాను. ఆ పిల్లలు సంతోషముగా ఆపాలకోవ బిళ్ళలు తింటూ యుంటే శ్రీ సాయినాధులువారు నాకు ఆశీర్వచనాలు అనే ప్రసాదము యిస్తున్న అనుభూతిని పొందినాను. శ్రీ సాయి తెల్లవారు జామున కలలో చెప్పిన మాటలు అక్షరాల నిజము అగుతాయి అనే విషయమును నేను గుర్తించినాను. ఈ రోజునుండి శ్రీ సాయి అదేశానుసారముగా తెల్లబట్టలు ధరించటము ప్రారంభించినాను.
07.10.1992 బుధవారము
రెండురోజుల నుండి జ్వరము తలనొప్పితో బాధపడుతున్నాను. ఉదయము 5 గంటలకు శ్రీ సాయికి హారతి ఇవ్వలేకపోయినాను. అనారోగ్యముతో అలాగే నిద్రపోయినాను. సుమారు 5.30 నిమిషాల సమయములో మంచి నిద్రలో ఉండగా శ్రీ సాయి ఒక పెద్ద వయస్సు స్త్రీ రూపములో దర్శనము యిచ్చినారు. ఆ స్త్రీ మూర్తి నుదుట పెద్ద కుంకుమ బొట్టు పట్టు చీర ధరించి యున్నది. ఆమె చుట్టు చాలా మంది కూర్చుని ఉన్నారు. ఆమె అన్నమాటలు నా చెవిలో యింకా వినపడుతున్నాయి. ఆ మాటలు " ఈ గోపాల రావు, సాయిబాబా పూజ, అయ్య ప్ప పూజల పేరిట ఉపవాసాలు వగైరాలు చేస్తూ తన ఆరోగ్యము పాడుచేసుకొంటున్నాడు. చెబితే వినడు. అ న్నీ చేతులార చేసుకొంటున్నాడు." నా ఉద్దేశములో శ్రీ సాయి ఆ ముత్తయిదువు రూపములో దర్శనము యిచ్చి నా ఆ రోగ్యము గురించి సలహా ఇచ్చినారు. అని నమ్ముతాను. నా నమ్మకమును బలపరచటానికి శ్రీ సాయి సత్ చరిత్ర 32 వ. అధ్యాయములో గోఖలేగారి భార్య ఉపవాసము విషయములో శ్రీ సాయి అన్న మాటకు భగవంతుని పూజ చేసేటప్పుడు ఉపవాసము యుండటము మంచిది కాదు" అని చక్కగా చెప్పటములో నిజము యున్నది అని గట్టిగా నమ్మినాను.
08.10.1992 గురువారము
నిన్నరాత్రి శ్రీ సాయికి నమస్కరించి సాయినా ధ నన్ను మంచి మార్గములో నడిపించు తండ్రి అని వేడుకొన్నాను. శ్రీ సాయి చూపిన దృశ్యము నా కళ్ళు తెరిపించినది. నా జీవిత మార్గము మారిపోయినది. ఆ దృశ్య వివరాలు - "అది పాడుపడిన ఓ సినీమాహాలు. నేను నా మితృడు టీ.వీ.జీ. సినిమా చూస్తున్నాము. యింటర్వెల్ లో మితృడు లెఫ్టి నెంట్ కర్నల్ జే.వీ.ఆర్. ని కలసినాడు. నేను జే.వీ.ఆర్. ను టీ.వీ.జీ. కి పరిచయము చేసినాను. వారు యిద్దరు సంతోషముగా మాట్లాడుకొంటు యుంటే నేను సినిమాహాలు బయట మి తృలు వై.సీ.ని మ రియు ఎల్.ఎన్. ను కలసినాను. వారితో మాట్లాడిన తర్వాత రైలు పట్టాలు దాటి మూత్రవిసర్జన చేసినాను. తిరిగి సినిమా హాలుకు వస్తూ ఉంటే రైలు ప ట్టాలమీద ఓ రైలు బండి ఉంది. నేను ఆ రైలు బండి ఎక్కి దిగబోతూ ఉంటే రైలు వేగముగా బయలుదేరినది. నేను దిగలేకపోయినాను. రైలు పెట్టెలు లోపలనుండి యింజను వరకు నడచుకొంటు వెళ్ళి యింజను డ్రైవరును రైలు ఆపమని కోరినాను. ఆ యింజను డ్రైవరు తలకు తెల్లని బట్టకట్టుకొని శిరిడీ సాయిబాబాలాగ ఉన్నారు. ఆ డ్రైవరు అన్నారు " ఈ రైలు ఎక్కినవారు మధ్యలో దిగకూడదు, దిగితే మంచిది కాదు. వచ్చే స్టేషన్లో దిగండి." నాకు తెలివి వచ్చినది. శ్రీ సాయి ఈ దృశ్యము ద్వారా నాకు తెలియచేసిన విషయాలు - సినిమా హాలు అంటే జీవితము. యింటర్వెల్ అంటే సగము జీవితము. జీవితములో మితృలు అరిషడ్ వర్గాలకు సంకేతము. మూత్ర విసర్జన అంటే అరిషడ్ వర్గాలను విస ర్జించటము. రైలులో ప్రయాణము అంటే నూతన జీవితమును ప్రారం భించటము. రైలు యింజను డ్రైవరు శ్రీ సాయి. రైలు మధ్యలో ఆగదు అంటే పాత జీవితములోనికి తిరిగి వెళ్ళకూడదు అని సందేశము. వచ్చే స్టేషన్ లో దిగు అంటే పునర్జన్మ పొందు అని అర్ధము.
ఈ దృశ్యము తలచుకొంటుయుంటే శ్రీ సాయి సత్ చరిత్ర మూడవ అధ్యాయములో శ్రీ సాయి శ్రీ హేమాద్రిపంతును ఉద్దేశించి అన్న మాటలు "వాడు తన దృష్టినంతటిని నా వైపు త్రిప్పవలెను. నాస్తికులు, దుర్మార్గుల సహవాసము విడువవలెను. అందరి యెడ అణకువ, నమ్రతలుండవలెను. నన్ను హృదయపూర్వకముగా పూజించవలెను. వాడిట్లు చేసినచో శాశ్వత ఆనందము పొందును" లో నిండు నిజముయున్నది అని నమ్ముతాను.
11.10.1992 శనివారము
నిన్న రాత్రి శ్రీ సాయి నాకు ప్రశాంతమైన నిద్ర ప్రసాదించినారు. ఆనిద్రలో నాకు రెండు దృశ్యాలు చూపించినారు. 1) ఒక పెద్ద సభలో నన్ను హౌవ్ టు బిహేవ్ విత్ డాగ్ అనే విషయము మాట్లాడమన్నారు. నేను డాగ్ అంటే శ్రీ సాయి అని పదమూడవ అధ్యాయములో శ్రీ సాయి నల్ల కుక్కరూపములో బాల గణపతి షింపి చేతిలోని పెరుగు అన్నము తిని అతని మలేరియా జ్వరము తగ్గించిన సంఘటనపై సభలో మాట్లాడినాను. 2) నా జీవితము ఆఖరి దశలో నా శరీరము చిక్కి శల్యము అయిన తర్వాత నేను ఒక ఆశ్రమమునకు వెళతాను. అక్కడ ఆ ఆశ్రమ యజమాని మహాత్మ గాంధీ రూపములో యున్నారు.. ఆయన నాకు ఐదు రూపాయలు యిచ్చినారు. నేను ఆ ఐదు రూపాయలు స్వీకరించి ఆయన పాదాలపై శిరస్సు ఉంచి ఆఖరి శ్వాస తీసుకొంటాను శ్రీ సాయి ఈ రెండు దృశ్యాలు ద్వారా (*) నాకోరిక తప్పక నెరవేర్చుతారు అనే ధైర్యము కలిగినది.
(*) నా కోరికలు (1) శ్రీ సాయి తత్వ ప్రచారములో పాల్గొనటము (2) శ్రీ సాయి పాదాలపై ఆఖరి శ్వాస తీసుకోవటము. కాలమే సాక్ష్యముగా నిలబడుతుంది.
18.10.1992 ఆదివారము
ఈ రోజున కమలానగర్ లోని స్వంత యిల్లు వదలి మెహదీపట్నములోని అద్దె యింటికి చేరుకొన్నాను. 14.10.1992 నాడు రాత్రి శ్రీ సాయి చిత్తూర్ వి.నాగయ్య రూపములో దర్శనము యిచ్చి నా కుమారుడు చి.చక్రపాణితో ఆడుకొనుచున్న దృశ్యము ప్రసాదించినారు. మెహదీపట్నములో అద్దె యిల్లు చూపించినది నా ఆఫీసులో పనిచేస్తున్న శ్రీ.ఎం.నాగయ్యగారు. 16.10.92 నాడు శ్రీ సాయి ఆర్.ఎ.పి.పి.లోని నా మితృడు శ్రీ సీ.కె.కృష్ఞన్ (మళయాళీ) రూపములో దర్శనము యిచ్చి నీ స్వంత యింటిలో నేను అద్దెకు యుంటాను అంటారు. శ్రీ సాయి నా మేలు గురించి మరియు నా కుమారుని మేలు గురించి మెహదీపట్నములోని అద్దె యింటికి మార్చినారని నమ్ముతాను. విచిత్రమైన విషయము ఏమిటి అంటే ఉదయము శ్రీ సాయి సత్ చరిత్ర నిత్యపారాయణ 20 వ అధ్యాయములో బాబా షిరిడీని విడువనప్పటికి, కొందరిని, మచ్చీంద్ర గడ్ కు, కొందరిని కొల్ హా పూరునకు, షోలాపూరుకు గాని సాధన నిమిత్తము పంపుచుండెను. బహుశ సాయి తత్వములో సాధన గురించి శ్రీ సాయి నన్ను మెహదీపట్నము పంపినారని నేను నమ్ముతాను.
(నా స్వంత యిల్లు అద్దెకు ఇచ్చినాను. శ్రి ఎన్.ఎస్.పిళ్ళే - ఎన్.ఎఫ్.సీ. మళయాళీ మితృడు 01.11.92 నాడు అద్దెకు వచ్చినారు.
(ఇంకా ఉంది)
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు